STOCKS

News


ఈ స్టాకుల్లో కరెక‌్షన్‌కు అవకాశం!

Tuesday 23rd April 2019
Markets_main1556014455.png-25294

సోమవారం ముగింపు ప్రకారం 127 షేర్ల చార్టుల్లో ఎంఏసీడీ(మూవింగ్‌ ఏవరేజ్‌ కన్వర్జన్స్‌ డైవర్జన్స్‌) ఇండికేటర్‌ బేరిష్‌ సంకేతాలు ఇస్తోందని టెక్నికల్‌ అనలిస్టులు చెబుతున్నారు. ఈ షేర్ల చార్టుల్లో ఎంఏసీడీ బేరిష్‌ క్రాసోవర్‌ ఏర్పరిచింది. ఇలా బలహీనంగా మారిన షేర్లలో సుజ్లాన్‌ ఎనర్జీ, డీహెచ్‌ఎఫ్‌ఎల్‌, ఆర్‌ఇన్‌ఫ్రా, భెల్‌, ఐడీబీఐ బ్యాంక్‌, టాటా స్టీల్‌, వొకార్డ్‌, స్ట్రైడ్స్‌ ఫార్మా, ఫ్యూచర్‌ కన్జూమర్‌, జేకే పేపర్‌, మార్కసాన్స్‌ ఫార్మా, ధనలక్ష్మి బ్యాంక్‌, టాటా కెమికల్స్‌, జేకే బ్యాంక్‌, ఎస్‌బీఐ లైఫ్‌, సియట్‌, డా. రెడ్డీస్‌, జేఎస్‌డబ్ల్యు ఎనర్జీ, సీఈఎస్‌సీ, రామ్‌కో, టాటా గ్లోబల్‌ బెవరేజెస్‌, ఏసీసీ తదితరాలున్నాయి. ఈ కౌంటర్లలో ట్రెండ్‌ బలహీనంగా ఉందని టెక్నికల్‌ విశ్లేషకులు చెపుతున్నారు. మరోవైపు 18 షేర్లలో  ఎంఏసీడీ బేరిష్‌ క్రాసోవర్‌ ఏర్పడింది. వీటిలో గతి, క్విక్‌హీల్‌టెక్‌, బ్రిటానియా, ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్‌, మోన్‌సాంటో తదితరాలు ఈ జాబితాలో వున్నాయి.  మదుపరులు ఇన్వెస్ట్‌ చేయాలంటే కేవలం ఎంఏసీడీ ఇండికేటర్‌ను మాత్రమే విశ్వసించకుండా,  ఇతర ఇండికేటర్లు పరిశీలించి అధ్యయనం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఎంఏసీడీ అంటే...
ట్రెండ్‌ రివర్సల్‌ గుర్తించేందుకు ఎంఏసీడీ ఇండికేటర్‌ను వాడతారు.  26, 12 రోజుల ఎక్స్‌పొటెన్షియల్‌ మూవింగ్‌ యావరేజెస్‌ మధ్య భేదం ఆధారంగా ఎంఏసీడీ పనిచేస్తుంది. సిగ్నల్‌లైన్‌ ఆధారంగా బై, సెల్‌ అవకాశాలను గణిస్తారు. సిగ్నల్‌లైన్‌కు పైన ఎంఏసీడీ లైన్‌ కదలాడితే బుల్లిష్‌గా, ఈ లైన్‌కు దిగువకు వస్తే బేరిష్‌గా చెప్పవచ్చు. ఎంఏసీడీ రెండు లైన్లు ఒకదానినొకటి క్రాస్‌ చేసే విధానాన్ని బట్టి బేరిష్‌ క్రాసింగ్‌, బుల్లిష్‌ క్రాసింగ్‌గా చెబుతారు.  
ఎంఏసీడీతోపాటు ఆర్‌ఎస్‌ఐ, బోలింగర్‌ బ్యాండ్‌ లాంటి ఇతర ఇండికేటర్లను పరిశీలించి ట్రెండ్‌ను నిర్ధారణ చేసుకోవాలి.  You may be interested

3 వారాల కనిష్టస్థాయి వద్ద ముగింపు

Tuesday 23rd April 2019

ట్రేడింగ్‌ ఆద్యంతం లాభనష్టాల మధ్య ఊగిసలాడిన సూచీలు చివరి నష్టాలతో ముగిశాయి. అటో, బ్యాంకింగ్‌, మెటల్‌ షేర్ల పతనం సూచీల లాభాలకు గండి కొట్టింది. ఫలితంగా మార్కెట్‌ మంగళవారం వరుసగా మూడో రోజూలతో ముగిసింది. సెన్సెక్స్‌ 80 పాయింట్లు నష్టపోయి 38565 వద్ద, నిఫ్టీ 18.50 క్షీణించి11576 వద్ద స్థిరపడింది. మార్చి 29 తర్వాత ఈ స్థాయిలో సూచీలు ముగియడం ఇదే ప్రధమం. బ్యాంకింగ్‌ రంగ షేర్లలో నెలకొన్న అమ్మకాలతో

స్థిరంగా పసిడి

Tuesday 23rd April 2019

ప్రపంచమార్కెట్లో పసిడి ధర మంగళవారం స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. ఆసియాలో మధ్యాహ్నం ట్రేడింగ్‌ సమయానికి 2డాలర్లు నష్టపోయి 1,275.35 డాలర్ల వద్ద స్థిరంగా ట్రేడ్‌త అవుతోంది. ఇరాన్‌ నుంచి దిగుమతయ్యే క్రూడాయిల్‌పై అమెరికా ఆంక్షలు విధించడంతో అంతర్జాతీయంగా మరోసారి ఉద్రిక్తతలు మొదలయ్యాయి . అలాగే క్రూడాయిలర్‌ ధరలు 6నెలల గరిష్టం వద్ద ట్రేడ్‌ అవుతుండటం కూడా పసిడి ధర స్థిరమైన ర్యాలీకి తోడ్పాటును అందిస్తున్నాయి. మరోవైపు ఆరు ప్రధాన కరెన్సీ

Most from this category