STOCKS

News


ఆటో ఔట్‌లుక్‌ అదిరింది.. కానీ?

Thursday 30th August 2018
Markets_main1535626333.png-19806

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ ర్యాలీ చేస్తోంది. అయితే ఇక్కడ ఆటో రంగ పరిస్థితి మాత్రం అర్ధం కావడం లేదు. ఈ పరిశ్రమపై అంచనాలు బాగున్నాయి. అయితే స్టాక్స్‌లో మాత్రం అనుకున్నంత చలనం లేదు. వాహన రంగం గత రెండేళ్లలో ట్రాక్‌లోనే ఉంది. అయితే గత మే నెల నుంచి కొంత వెనుకంజలో ఉంది. బీఎస్‌ఈ ఆటో ఇండెక్స్‌ను సెన్సెక్స్‌తో పోలిస్తే ఈ విషయం అర్థమౌతుంది. మే నెల మధ్య నుంచి చూస్తే బీఎస్‌ఈ ఆటో ఇండెక్స్‌ కేవలం 0.5 శాతం మాత్రమే పెరిగింది. అదే సమయంలో సెన్సెక్స్‌ 10 శాతంమేర ఎగసింది. 2016 ఫిబ్రవరి 24 నుంచి 2018 మే 18 వరకు చూస్తే రెండు ఇండెక్స్‌లు 50 శాతంమేర పెరిగాయి. 
గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్‌ పుంజుకోవడం, ఎన్నికల ముందు ప్రభుత్వ ఖర్చులు వంటి అంశాలు సమీప కాలంలో ఆటో రంగానికి సానుకూల అంశాలని మార్కెట్‌ నిపుణులు పేర్కొంటున్నారు. 
టాటా మోటార్స్‌ (16 శాతం పతనం), హీరో మోటొకార్ప్‌ (10 శాతం క్షీణత), అశోక్‌ లేలాండ్‌ (13 శాతం డౌన్‌), అపోలో టైర్స్‌ (8.74 శాతం తగ్గుదల) స్టాక్స్‌ పడిపోవడంతో ఆటో ఇండెక్స్‌పై ప్రతికూల ప్రభావం పడింది. మొత్తం విక్రయాల పరంగా చూస్తే పరిశ్రమ జోరుమీదుంది. జూలైలో కంపెనీలు ప్యాసింజర్‌ వెహికల్స్‌ మినహా అన్ని విభాగాల్లో బలమైన అమ్మకాలను నమోదచేశాయి. 
మారుతీ సుజుకీ 2018-19లో రెండంకెల వృద్ధి అంచనాలను కొనసాగిస్తోంది. అయితే జూలైలో ఈ కంపెనీల అమ్మకాలు 1,65,346 యూనిట్ల నుంచి 1,64,369 యూనిట్లకు స్వల్పంగా తగ్గాయి.
గ్లోబల్‌ బ్రోకరేజ్‌ సంస్థ గోల్డ్‌మన్‌ శాక్స్‌.. మారుతీకి బై రేటింగ్‌ ఇచ్చింది. టార్గెట్‌ ప్రైస్‌ను రూ.11,041గా నిర్ణయించింది. 
గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతోందని బ్రోకరేజ్‌ సంస్థ ఐఐఎఫ్‌ఎల్‌ తెలిపింది. ప్రభుత్వ వ్యయాలు పెరగడం, రైతు రుణ మాఫీ, కనీస మద్దతు ధర పెంపు, సాధారణ రుతుపవనాలు వంటి అంశాలు సానుకూల ప్రభావం చూపాయని పేర్కొంది. వీటి ప్రభావం ట్రాక్టర్‌ విక్రయాల్లో బలమైన వృద్ధి, దేశీ టూవీలర్‌ అమ్మకాలు పుంజుకోవడం వంటి అంశాల్లో ప్రతిబింబిస్తోందని తెలిపింది.
గ్రామీణ ప్రాంతాల్లో స్కూటర్లకు ఆదరణ పెరుగుతోందని మార్కెట్‌ నిపుణులు పేర్కొన్నారు. బస్సుల డిమాండ్‌ మిశ్రమంగా ఉందని తెలిపారు. కన్‌స్ట్రక‌్షన్‌ డిమాండ్‌ పుంజుకోవడం వల్ల చిన్న ట్రక్కుల డిమాండ్‌ ఉందని పేర్కొన్నారు. 
స్వరాజ్‌ ఇంజిన్స్‌, ఎస్‌ఎంఎల్‌ ఇసుజు, హీరో మోటొకార్ప్‌, వీఎస్‌టీ టిల్లర్స్‌ వంటి స్టాక్స్‌ను కొనుగోలు చేయవచ్చని ఐఐఎఫ్‌ఎల్‌ సిఫార్సు చేసింది. వాహన విడిభాగాల విభాగంలో మదర్‌సన్‌ సుమీ, భారత్‌ ఫోర్జ్‌, ఎక్సైడ్‌ ఇండస్ట్రీస్‌ స్టాక్స్‌ను కొనొచ్చని ఇండిట్రేడ్‌ క్యాపిటల్‌ ఫౌండర్‌ సుదీప్‌ తెలిపారు. మదర్‌సన్‌ సుమీ 2016 ఫిబ్రవరి నుంచి చూస్తే ఇన్వెస్టర్ల డబ్బుని రెట్టింపు చేసింది. మారుతీ సుజుకీ, ఎంఆర్‌ఎఫ్‌, టీవీఎస్‌ మోటార్‌, ఎక్సైడ్‌ ఇండస్ట్రీస్‌ షేర్ల ఇదే కాలంలో 100 శాతానికిపైగా పెరిగాయి.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండు, మూడో త్రైమాసికాల్లో టైర్ల కంపెనీల మార్జిన్లు 1.5-2 శాతం శ్రేణిలో తగ్గొచ్చనే అంచనాలున్నాయి. కేరళ వరదల కారణంగా రబ్బరు సరఫరాపై ప్రతికూల ప్రభావం పడటంతో దిగుమతుల పెరుగుదల ఇందుకు కారణం. ‘కేరళ వరదలు దేశీ సరఫరాకు విఘాతం కలిగించాయి. అందువల్ల టైర్ల డిమాండ్‌ను అందిపుచ్చుకోవడానికి కంపెనీలు దిగుమతులపై ఎక్కువగా ఆధారపడాల్సి ఉంటుంది’ అని ఇండియా రేటింగ్స్‌ పేర్కొంది. 
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో బలమైన ఆరంభానిచ్చిన ఆటో రంగం రానున్న కాలంలోనూ ఇదే ట్రెండ్‌ను (రెండంకెల వృద్ధిని) కొనసాగించొచ్చని బ్రోకరేజ్‌ సంస్థ షేర్‌ఖాన్‌ అంచనా వేసింది. మారుతీ సుజుకీ, ఎంఅండ్‌ఎం, ఎస్కార్ట్స్‌ స్టాక్స్‌పై పాజిటివ్‌గా ఉన్నామని పేర్కొంది. 
 You may be interested

ఝున్‌ఝున్‌వాలా బుట్టలో డీఎల్‌ఎఫ్‌

Friday 31st August 2018

ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ ఇన్వెస్టర్‌ రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా రియల్‌ ఎస్టేట్‌ రంగంలో అగ్రగామి కంపెనీ అయిన డీఎల్‌ఎఫ్‌లో వాటాలు కొనుగోలు చేశారు. ఈ విషయాన్ని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. కంపెనీలో ఝున్‌ఝున్‌వాలాలకు 1.19 కోట్ల షేర్లు ఉన్నాయి. మార్చి నాటికి కంపెనీ ఈక్విటీ 178.40 కోట్ల షేర్లతో ఉంది. ఈ ప్రకారం చూస్తే ఆయన వాటా 0.67 శాతానికి  సమానం. తాజా షేరు ధర రూ.216 ప్రకారం చూస్తే డీఎల్‌ఎఫ్‌లో

నష్టాలతోనే ముగింపు

Thursday 30th August 2018

ముంబై:- ఆగస్ట్‌ ఎఫ్‌అండ్‌వో కాంట్రాక్టుల గడువు ముగింపు నేపథ్యంలో గురువారం స్టాక్‌ మార్కెట్‌ స్వల్పంగా నష్టపోయింది. ఇంట్రాడేలో రూపాయి జీవితకాల కనిష్టానికి చేరుకోవడం, అంతర్జాతీయంగా చమురు ధరల పెరుగుదల సహా నేడు ఆగస్ట్‌ ఎఫ్‌అండ్‌వో కాంట్రాక్టుల ముగింపు తేది కావడంతో సూచీలు నష్టాల్లోనే ట్రేడయ్యాయి. ఓ దశలో నిఫ్టీ సూచీ 53 పాయింట్లు, సెన్సెక్స్‌ 141 పాయింట్లు నష్టపోయాయి. అయితే చివర్లో ఇన్వెస్టర్లు స్వల్పంగా కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో సూచీలు కొంతమేర

Most from this category