STOCKS

News


తగ్గిన సన్‌ టీవీ వెలుగులు

Monday 5th November 2018
Markets_main1541401538.png-21715

ఆశాజనక రెండో త్రైమాసిక ఫలితాలు సన్‌ టీవీ షేర్లకు వెలుగునివ్వలేకపోయాయి. సన్‌టీవి ఈ క్యూ2లో ఆశించిన స్థాయిలో ఫలితాలను ఆర్జించినప్పటికీ.., ఈ కంపెనీ షేర్లు సోమవారం ట్రేడింగ్‌లో 7శాతం నష్టపోయాయి. నేడు సన్‌టీవి షేర్లు బీఎస్‌ఈలో రూ.663.4ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో ఇన్వెస్టర్లు షేర్ల అమ్మకాలకు మొగ్గుచూపడతో షేరు 7శాతం క్షీణించి రూ.615.85లకు పతనమైంది. మధ్యాహ్నం గం.12:00లకు షేరు గతముగింపు ధర(రూ.663.4)తో పోలిస్తే 6.50శాతం నష్టపోయి రూ.619ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.566.50లు, రూ.1097.05లుగా నమోదయ్యాయి.
సన్‌ టీవీ క్యూ2 ఫలితాలు:-
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో కంపెనీ రూ.351.3 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. గతేడాది ఇదే క్యూ2తో కంపెనీ సాధించిన రూ. 284.6 కోట్లతో పోలిస్తే ఇది 23.4శాతం అధికం. ఆదాయం సైతం 11శాతం పెరిగి రూ.749.5లను సాధించింది. గతేడాది ఇదే క్యూ2లో కంపెనీ రూ.675.9కోట్లను ఆర్జించింది. సబ్‌స్క్రెబర్ల ఆదాయం కూడా 21.3శాతం పెరిగింది. ఎబిటా 11.7శాతం వృద్ధి చెంది రూ.554కోట్లుగా నమోదైంది. ఇదే క్యూ2లో మార్జిన్లు సైతం 73.9శాతం వృద్ధిని కనబరిచాయి. ముఖ్యంగా తమిళనాడులో సబ్‌స్క్రెబర్లు పెరగడంతో కంపెనీ ఆశించిన స్థాయిలో క్యూ2 ఫలితాలను నమోదుచేసినట్లు మార్కెట్‌ విశ్లేషకులు భావిస్తున్నారు. లాభదాయకమైన క్యూ2 ఫలితాలు సాధించడంతో కంపెనీ 2018-19 ఆర్థిక సంవత్సరానికి గానూ రూ.5లు ముఖ విలువ కలిగిన ప్రతి షేరు ధరపై రూ.2.50ల మధ్యంతర డివిడెంట్‌ను ప్రకటించింది.
సీఎల్‌ఎస్‌ఈ బై రేటింగ్‌:-
ఆర్థిక ఫలితాలు ఆశించిన నమోదుకావడంతో ప్రముఖ రేటింగ్‌ సంస్థ సీఎల్‌ఎస్‌ఈ సన్‌టీవీ షేరుకు బై రేటింగ్‌ను కేటాయించింది. అయితే టార్గెట్‌ ధరను మాత్రం రూ.1,100ల నుంచి రూ.870లకు పరిమితం చేసింది. కంపెనీల పెట్టుబడులు యాడ్‌ రెవెన్యూలను మరింత పెంచుతాయని రేటింగ్‌ సంస్థ అంచనా వేస్తుంది. వచ్చే రెండేళ్లలో కంపెనీ వార్షిక సగటు వృద్ధి రేటు (సీఏజీఆర్‌) దాదాపు 15.5 శాతం వరకూ ఉంటుందని సీఎల్‌ఎస్‌ఈ అంటోంది.



You may be interested

2-3 నెలల్లో 31,000కి పసిడి!!

Monday 5th November 2018

ధంతేరాస్‌ పవిత్రమైన రోజని, అప్పుడు పసిడి కొనుగోలు చేస్తే శ్రేయస్కరమని చాలా మంది విశ్వసిస్తారు. సాంప్రదాయ ఇన్వెస్టర్లు ధంతేరాస్‌ రోజు బంగారాన్ని కొనుగోలు చేస్తుంటారు. ప్రస్తుత పరిస్థితుల్లో ధరలు ఎక్కువగా ఉండటం వల్ల కొంత మొత్తంలో పసిడిని కొనుగోలు చేయవచ్చని, అయితే పోర్ట్‌ఫోలియోలో బంగానికి తగిన కేటాయింపుల కోసం సరైన సమయం కోసం వేచిచూడటం మంచిదని రిలయన్స్‌ కమోడిటీస్‌ హెడ్‌ (కమోడిటీ) ప్రీతమ్‌ పట్నాయక్‌ తెలిపారు. ఆయన ఒక ఆంగ్ల

ఫార్మా...డౌన్‌

Monday 5th November 2018

ఫార్మా షేర్లకు సిప్లా రెండో త్రైమాసిక ఫలితాలు షాకినిచ్చాయి. నేడు సిప్లా ప్రకటించి క్యూ2 ఫలితాలు మార్కెట్‌ వర్గాల అంచనాలకు అందుకోలేకపోవడంతో సిప్లా షేర్లు 8శాతం పతనమైంది. సిప్లా కౌంటర్లో వెల్లువెత్తిన అమ్మకాలు క్రమంగా పుంజుకుంటూ ఇదే ఫార్మా రంగంలో మిగతా షేర్లను ముంచాయి.  ఎన్‌ఎస్‌ఈలో ఈ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ఇండెక్స్‌ మధ్యాహ్నం‍ ట్రేడింగ్‌ సెషన్‌లో 1.50శాతం నష్టపోయింది. ఇదే సమయంలో దివీస్‌ల్యాబ్స్‌ 3శాతం నష్టపోయింది.

Most from this category