STOCKS

News


తగ్గిన సన్‌ టీవీ వెలుగులు

Friday 18th January 2019
Markets_main1547801879.png-23667

మీడియా షేర్ల పతనంలో భాగంగా సన్‌టీవీ షేర్లు శుక్రవారం ఏడాది కనిష్టానికి నష్టపోయాయి. నేటి బీఎస్‌ఈ ట్రేడింగ్‌లో సన్‌టీవీ షేర్లు రూ.567.30ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో షార్ట్‌ సెల్లింగ్‌తో షేరు ఒక్కసారిగా తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనైంది. ఒకానొకదశలో 9శాతం నష్టపోయి రూ.513.75ల కనిష్టానికి చేరుకుంది. ఇది ఈ షేరుకు ఏడాది కనిష్టస్థాయికి కావడం గమనార్హం. మధ్యాహ్నం గం.2:00లకు షేరు గతముగింపు(రూ.567.30)తో పోలిస్తే 7.50శాతం నష్టపోయి రూ.525.00ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.513.75లు రూ.1081.85లుగా ఉన్నాయి. అలాగే మీడియా షేర్లలో టీవీ18బ్రాడ్‌కాస్ట్‌ 5శాతం క్షీణించగా, ఐనాక్స్‌ లిమిటెడ్‌ 2శాతం, డిష్‌ టీవీ, ఎరోస్‌మీడియా, నెట్‌వర్క్స్‌ 18 షేర్లు 1శాతం నష్టపోయాయి.



You may be interested

ఈ ఏడాది వెనుకడుగే!

Friday 18th January 2019

భారత మార్కెట్‌పై సీఎల్‌ఎస్‌ఏ అంచనా వచ్చే ఆరునెలల్లో దేశీయ మార్కెట్లలో నిధుల ప్రవాహం సన్నగిల్లుతుందని, అందువల్ల మార్కెట్లు మందకొడిగా తయారవుతాయని సీఎల్‌ఎస్‌ఏ వ్యూహకర్త మహేశ్‌ నండూర్కర్‌ అభిప్రాయపడ్డారు. అందువల్ల ఈక్విటీలపై ఆచితూచి వ్యవహరించాలని సూచించారు. ఈ ఏడాది ప్రథమార్ధంలో దేశీయ మార్కెట్లలో 8- 10 శాతం పతనం వచ్చే ఛాన్సులు కనిపిస్తున్నాయన్నారు. ఈ ఏడాదిని నిఫ్టీ పాజిటివ్‌గా ముగిస్తే సంతోషించాల్సినవిషయమని, ఈ సంవత్సరం ఎలాగైనా సూచీల్లో డౌన్‌ట్రెండ్‌ తప్పకపోవచ్చని ఆయన చెప్పారు.బడ్జెట్‌

ఎయిర్‌టెల్‌, ఐడియాల షేర్లకు జియో షాక్‌

Friday 18th January 2019

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ టెలికాం విభాగమైన రిలయన్స్‌ జియో క్యూ3లో భారీ లాభాలను ఆర్జించడంతో పాటు రుణభారాన్ని తగ్గించేందుకు నిధుల సమీకరణ ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు ప్రకటించడంతో ప్రత్యర్థి టెలికాం కంపెనీ షేర్లైన భారతీ ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌ ఐడియా షేర్లు నష్టాలబాట పట్టాయి.  జియో లాభాలు ఈ క్యూ3లో 65శాతం పెరిగి రూ.831 కోట్లకు చేరాయి. ముఖ్యంగా కస్టమర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ క్యూ2లో 16 కోట్లుగా వున్న వినియోగదారుల సంఖ్య ఈ క్యూ3

Most from this category