STOCKS

News


సన్‌ఫార్మా షైనింగ్‌

Thursday 27th December 2018
Markets_main1545894073.png-23262

ముంబై:- దేశీయ ఔషధ దిగ్గజం సన్‌ఫార్మా షేర్లు గురువారం ట్రేడింగ్‌లో 2.50శాతం లాభపడ్డాయి. పేటెంట్‌ ఉల్లంఘన కేసులో తన అనుబంధ సంస్థ డీయుఎస్‌ఏ ఫార్మాస్యూటికల్స్‌కు అమెరికా ఫెడరల్‌ కోర్టు క్లీన్‌చిట్‌ ఇచ్చినట్లు సన్‌ఫార్మా బుధవారం మార్కెట్‌ ముగింపు అనంతరం స్టాక్‌ ఎక్చ్సేంజ్‌లకు సమాచారం ఇచ్చింది. ఈ వార్తతో నేడు ట్రేడింగ్‌ ప్రారంభంలోనే సన్‌ఫార్మా షేర్లకు డిమాండ్‌ పెరిగింది. ఫలితంగా షేర్లు ఇంట్రాడేలో  2.50శాతం ర్యాలీ చేసి రూ.424.00ల గరిష్టాన్ని నమోదు చేశాయి. మధ్యాహ్నం గం.12:00లకు షేరు గత ముగింపు(రూ.414)తో పోలిస్తే 1.50శాతం లాభంతో రూ.420ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.391.10 రూ.678.80లుగా నమోదయ్యాయి.



You may be interested

సూచీలకు రిలయన్స్‌ అండ

Thursday 27th December 2018

ముంబై:- షేర్లలోకెల్లా అధిక వెయిటేజీ కలిగిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు 2.50శాతం లాభపడి సూచీల ర్యాలీ అండగా నిలుస్తోంది. ముఖేష్‌ అంబానీ చెందిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్లు నేడు బీఎస్‌ఈలో రూ.1105.00ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఇంట్రాడేలో షేరుకు కొనుగోళ్ల మద్దతు పెరగడంతో ఒకానొక దశలో 2.50శాతం లాభపడి రూ.1125.90ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేసింది. మధ్యాహ్నం గం.1:00లకు షేరు గతముగింపు(రూ.1096.95) ధరతో పోలిస్తే 2శాతం లాభంతో రూ.1120.25ల

వెలుగులో మెటల్‌ షేర్లు

Thursday 27th December 2018

మార్కెట్‌ లాభాల ట్రేడింగ్‌లో భాగంగా గురువారం ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో మెటల్‌ షేర్లు వెలుగులోకి వచ్చాయి. హిందాల్కో, వేదాంత షేర్లు 2శాతం ర్యాలీ మెటల్‌ షేర్లకు కలిసొచ్చింది. ఎన్‌ఎస్‌ఈలోని మెటల్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ నేటి ట్రేడింగ్‌లో దాదాపు 1శాతం లాభపడింది. ఉదయం గం.11:00లకు ఇండెక్స్‌ అరశాతం లాభంతో 31113 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఇండెక్స్‌లోని మొత్తం 15 షేర్లకు గానూ, 12

Most from this category