STOCKS

News


సన్‌ఫార్మాకు సెబి షాక్‌

Monday 3rd December 2018
Markets_main1543818739.png-22592

  • 10శాతం పతమైన షేరు ధర

గతంలో సెటిల్‌మెంట్‌ చేసుకున్న ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ కేసును సెబీ తిరిగి చేపట్టనుందనే వార్తల నేపథ్యంలో సన్‌ఫార్మా షేరు సోమవారం ట్రేడింగ్‌లో 10శాతానికి పైగా నష్టపోయింది. 2017లో సన్‌ ఫార్మాస్యూటికల్‌ ఎండీ దిలీప్‌ సంఘ్వీతో పాటు 9 మంది ప్రమోటర్లు ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ఆరోపణలకు సంబంధించి దర్యాప్తును రూ. 18 లక్షలు చెల్లించి సెటిల్‌మెంట్‌ చేసుకున్నారు. తాజాగా ఈ కేసును తిరిగి విచారించాలని సెబీ భావిస్తున్నట్లు వార్తలు వెలువడ్డాయి. అలాగే   విదేశీ రీసెర్చ్‌ సంస్థ మెక్వారీ కూడా సన్‌ ఫార్మా కార్పొరేట్‌ గవర్నెన్స్ పలు సందేహాలను వ్యక్తం చేసింది.  ఈ ప్రతికూల వార్తల నేపథ్యంలో నేడు సన్‌ఫార్మా షేరు 10శాతానికి పైగా నష్టపోయి రూ.441.95ల కనిష్టానికి పతనమైంది. ఉదయం గం.11:30ని.లకు షేరు గత ముగింపు ధర(రూ.492.3)తో పోలిస్తే 8.50శాతం నష్టంతో రూ.450.20ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.  434.80 రూ.678.80లుగా నమోదయ్యాయి. కంపెనీపై ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఇన్వెస్టర్లకు సంజాయిషీ ఇచ్చేందుకు నేడు(డిసెంబర్‌ 03) సాయం‍త్రం గం.6:30లకు సీనియర్‌ మేనేజర్లు పత్రికాసమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు కంపెనీ అధికారులు ప్రకటించారు.



You may be interested

మెటల్‌ షేర్ల మెరుపులు

Monday 3rd December 2018

అమెరికా - చైనాల మధ్య కుదిరిన వాణిజ్య యుద్ధ సంధి మెటల్‌ షేర్లకు కలిసొస్తుంది. ప్రపంచంలో అత్యధికంగా మెటల్స్‌ ఉత్పత్తిదారుగా పేరొందిన చైనాపై అమెరికా టారీఫ్‌లను సడలించడంతో అంతర్జాతీయంగా మెటల్‌ ధరలు లాభాల బాట పట్టాయి. ధరల పెరుగుదలతో ఈ రంగానికి చెంది షేర్లు కూడా ర్యాలీ చేస్తున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ 3శాతానికి పైగా లాభపడింది. మధ్యాహ్నం గం.1:30ని.లకు ఇండెక్స్‌ గతముగింపు(3,163.75)తో

రిస్క్‌ తగ్గిస్తూ రాబడినిచ్చే ఫండ్‌

Monday 3rd December 2018

రిస్క్‌ను తగ్గిస్తూ రాబడినిచ్చే ఫండ్‌ కోటక్‌ స్టాండర్డ్‌ మల్టీక్యాప్‌ ఈ ఏడాది స్టాక్‌ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులతో కొనసాగుతుండడాన్ని చూస్తున్నాం. కొన్ని రోజులు ర్యాలీ చేయడం, కొన్ని రోజులు నష్టాల పాలు కావడం సాధారణంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో ఇటువంటి పరిస్థితులను సమర్థంగా నెగ్గుకొచ్చే మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాలు ఇన్వెస్టర్లకు దీర్ఘకాలంలో మెరుగైన రాబడులను ఇవ్వగలుగుతాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ తరహా పథకాలపై దృష్టి సారించడం మంచిది. అటువంటి వాటిల్లో కోటక్‌ స్టాండర్డ్‌

Most from this category