STOCKS

News


సన్‌ ఫార్మా షేరు కొంటున్నారా...? తొందరొద్దు!

Tuesday 22nd January 2019
Markets_main1548097053.png-23710

సన్‌ ఫార్మా షేరు ధర కేవలం మూడున్నర నెలల వ్యవధిలోనే 40 శాతం క్షీణించింది. దీంతో చౌకగా దొరుకుతుంది కదా అని వెంటనే కొనుగోలు చేద్దామనుకునే వారు కాస్త ఆగొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. స్టాక్‌ కరెక్షన్‌ ఇంకా ముగిసినట్టు సంకేతాలేవీ కనిపించడం లేదని పేర్కొంటున్నారు.

 

షేరు అధిక వ్యాల్యూషన్లలో ఉండడం, కార్పొరేట్‌ గవర్నెన్స్‌ అంశాలు, అమెరికా మార్కెట్ల నుంచి ఉత్పత్తులను రీకాల్‌ చేయడం వంటివి సన్‌ ఫార్మా విషయంలో గమనించొచ్చు. సన్‌ఫార్మా విషయంలో ఓ ప్రజావేగు సెబీకి ఫిర్యాదు చేసినట్టు ఓ వార్తా సంస్థ బయటపెట్టడంతో ఈ షేరు ఈ నెల 17-18 తేదీల్లో 14 శాతం పతనమై సరికొత్త 52 వారాల కనిష్ట స్థాయిని నమోదు చేసింది. సన్‌ఫార్మా వెకురోనియం బ్రోమైడ్‌ ఇంజెక్షన్లు 1,39,180 వయల్స్‌ను ఇటీవలే అమెరికా మార్కెట్‌ నుంచి ఉపసహరించుకున్నట్టు సమాచారం. సాంకేతికంగా డౌన్‌ట్రెండ్‌లో ఉన్న ఈ షేరును ఇప్పుడు కొనడం కంటే కాస్త వేచి చూడడం నయమన్నది అనలిస్టుల సూచన. సన్‌ ఫార్మా షేరు ధర 2018 అక్టోబర్‌ 1న రూ.634 స్థాయి నుంచి ప్రస్తుతం రూ.398వద్ద ఉంది. మరి దీన్ని కాంట్రా బై (మార్కెట్‌ పరిస్థితులను పట్టించుకోకుండా దీర్ఘకాలం కోసం)గా చూడొచ్చా? అంటే... 

 

సన్‌ఫార్మా 2000 సంవత్సరంలో రూ.25 గరిష్ట స్థాయి నుంచి రూ.7 కనిష్ట స్థాయికి పడిపోయింది. పై నుంచి 72 శాతం క్షీణించినట్టు. 13 క్వార్టర్ల పాటు కన్సాలిడేటెడ్‌ అయిన తర్వాత మళ్లీ బుల్‌ రన్‌ను ప్రారంభించింది. ‘‘ప్రస్తుత దశ కూడా 2000కు పోలినట్టుగానే ఉంది. 2015 ఏప్రిల్‌లో రూ.1,200 స్థాయిలో గరిష్ట ధరను నమోదు చేసిన తర్వాత ఈ స్టాక్‌ బేర్ పట్టులో ఉంది. 2018 నుంచి చూస్తే రూ.678 గరిష్ట స్థాయి నుంచి కరెక్షన్‌ను కొనసాగిస్తోంది. కీలకమైన రూ.435 మద్దతు స్థాయిని దిగి పోయింది. కనుక ఈ స్థాయిలో వెంటనే కోలుకుని రూ.435 పైన క్లోజ్‌ కానంత వరకు ఇది కాంట్రా బైగా కనిపించడం లేదు’’అని చార్ట్‌వ్యూ ఇండియా టెక్నికల్‌ రీసెర్చ్‌ చీఫ్‌ స్ట్రాటజిస్ట్‌ మజర్‌ మహమ్మద్‌ తెలిపారు. ఒకవేళ ఈ షేరు రూ.375 స్థాయిని బ్రేక్‌ చేస్తే రూ.316 స్థాయి వరకు వెళ్లినా ఆశ్చర్యపోనవసరం లేదన్నారు. కొంత కాలం పాటు ఈ స్టాక్‌ కొనుగోలుకు దూరంగా ఉండడం మంచిదని సూచించారు. సాంకేతికంగా చూస్తే ఈ స్టాక్‌ సమీప కాలంలో కనిష్ట స్థాయిని నమోదు చేస్తుందన్న ఆధారాలు కనిపించడం లేదని, ఇప్పటి వరకు కీలక మద్దతు స్థాయిలుగా నిలిచిన రూ.400-420 శ్రేణి ఇప్పుడు ఈ స్టాక్‌కు కీలక నిరోధంగా పనిచేస్తాయని ఏంజెల్‌ బ్రోకింగ్‌ టెక్నికల్‌ అనలిస్ట్‌ రాజేష్‌ భోస్లే తెలిపారు. స్టాక్‌ రికవరీ అయితే దీర్ఘకాలిక పొజిషన్ల నుంచి బయటకు రావచ్చని సూచించారు. You may be interested

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 35 పాయింట్లు డౌన్‌

Tuesday 22nd January 2019

ఆసియా మార్కెట్లు ప్రతికూలంగా ట్రేడవుతున్న నేపథ్యంలో సింగపూర్‌లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 35 పాయింట్లు తగ్గింది. భారత్‌లోని ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌తో అనుసంధానమై ట్రేడయ్యే ఈ సూచి మంగళవారం ఉదయం 8.50 గంటలకు 35 పాయింట్ల తగ్గుదలతో 10,935 పాయింట్ల వద్ద కదులుతోంది. క్రితం రోజు ఇక్కడ నిఫ్టీ ఫ్యూచర్‌ 10970 పాయింట్ల వద్ద ముగిసింది. సోమవారం అమెరికా మార్కెట్లకు మార్టిన్‌లూథర్ కింగ్‌డే సందర్భంగా సెలవుకాగా, యూరప్‌ సూచీలు అరశాతం

ఐఐఎఫ్‌ఎల్‌ ఎన్‌సీడీ ఇష్యూ... ఎంతో ఆకర్షణీయం!

Tuesday 22nd January 2019

ఇండియా ఇన్ఫోలైన్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ (ఐఐఎఫ్‌ఎల్‌) ఎన్‌సీడీ ఇష్యూ ఈ నెల 22న ప్రారంభం కాబోతుంది. ఈ నెల మొదట్లో మహీంద్రా అండ్‌ మహీంద్రా ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, శ్రీరామ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఫైనాన్స్‌ ఎన్‌సీడీలు ప్రారంభమయ్యాయి. తాజాగా వీటి సరసన ఐఐఎఫ్‌ఎల్‌ ఎన్‌సీడీ కూడా చేరింది. అయితే, ఈ కంపెనీ ఆకర్షణీయమైన వడ్డీ రేటును ఆఫర్‌ చేస్తుండడం ఆసక్తికరం. ఈ నేపథ్యంలో ఈ ఎన్‌సీడీలో ఇన్వెస్ట్‌ చేసుకోవడంపై అనలిస్టుల అభిప్రాయాలు ఇలా

Most from this category