STOCKS

News


క్షీణించిన ఫార్మా షేర్లు

Friday 24th August 2018
Markets_main1535100224.png-19601

ముంబై:- ఇటీవల రూపాయి పతనంతో లాభాల ర్యాలీ చేసిన ఫార్మా షేర్లలో లాభాల స్వీకరణ కారణంగా నేడు ఫార్మా షేర్లు నష్టాల బాట పట్టాయి. ఫార్మా సూచీలోని హెవీవెయిటైజ్‌ షేర్లైన సిప్లా, సన్‌ఫార్మా షేర్లు 2శాతం క్షీణించడంతో ఎన్‌ఎస్‌ఈలో ఫార్మా షేర్లకు ప్రాతినిథ్యం నిఫ్టీ ఫార్మా ఇండెక్స్‌ 2శాతం వరుకు నష్టపోయింది. మధ్యాహ్నం గం.1:45ని.లకు ఇండెక్స్‌ గతముగింపు(10077)తో పోలిస్తే 1శాతం (100 పాయింట్లు) నష్టపోయి 9,971 పాయింట్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాల సూచీల్లోకి నిప్టీ ఫార్మా ఇండెక్స్‌ టాప్‌ లూజర్‌గా ట్రేడవుతోంది. ఈ సూచీలో భాగమైన 10 షేర్లలో 8షేర్లు నష్టాల్లో ట్రేడ్‌ అవుతుండగా, 2 షేర్లు మాత్రం లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. ఈ సూచీలో ప్రధాన షేర్లైన సన్‌ ఫార్మా, సిప్లా, కెడిల్లా హెల్త్‌కేర్‌, గ్లెన్‌మార్క్‌ షేర్ల 2శాతం నష్టపోగా, డాక్టర్‌ రెడ్డీస్‌, బయోకాన్‌, అరబిందో ఫార్మా షేర్లు 1శాతం వరకూ నష్టపోయాయి. ఇదే సూచిలో దివీస్‌ ల్యాబ్స్‌, పిరమిల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌ షేర్లు అరశాతం వరకూ నష్టపోయాయి.



You may be interested

హిందుస్తాన్‌ జింక్‌ కొనొచ్చు: కోటక్‌

Friday 24th August 2018

బ్రోకరేజ్‌ సంస్థ కోటక్‌ సెక్యూరిటీస్‌ తాజాగా హిందుస్తాన్‌ జింక్‌ షేరు కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. ఎందుకో ఒకసారి గమనిస్తే.. బ్రోకరేజ్‌: కోటక్‌ సెక్యూరిటీస్‌ స్టాక్‌: హిందుస్తాన్‌ జింక్‌ రేటింగ్‌: కొనొచ్చు ప్రస్తుత ధర: రూ.292 టార్గెట్‌ ప్రైస్‌: రూ.300 బ్రోకరేజ్‌ సంస్థ కోటక్‌ సెక్యూరిటీస్‌.. హిందుస్తాన్‌ జింక్‌ స్టాక్‌పై బుల్లిష్‌గా ఉంది. కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. టార్గెట్‌ ప్రైస్‌ను రూ.300గా నిర్ణయించింది. అంతర్జాతీయంగా తక్కువ వ్యయంతో అధిక ఉత్పత్తిని సాధించే పలు కంపెనీల్లో హిందుస్తాన్‌ జింక్‌

ఈ ఫార్మా షేర్లపై బుల్లిష్‌..

Friday 24th August 2018

ఫార్మా రం‍గంలో ర్యాలీ మిడ్‌క్యాప్స్‌కు విస్తరిస్తోందంటున్నారు ఐఐఎఫ్‌ఎల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (రీసెర్చ్‌) అభిమన్యు సొఫత్‌. అందువల్ల రంగంలో ఎంపిక చేసిన స్టాక్స్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేస్తున్నారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు. అమెరికాలోని జెనరిక్‌ మార్కెట్‌ ఇంకా బలహీనంగా ఉందని పేర్కొన్నారు. అరబిందో ఫార్మాను కొనుగోలు చేయవచ్చని అభిమన్యు సిఫార్సు చేశారు. పీఈకి 12.5 రెట్లు వద్ద ఈ స్టాక్‌ ట్రేడవుతోందని తెలిపారు. ఈ

Most from this category