STOCKS

News


కుట్ర జరుగుతోంది.. జోక్యం చేసుకోండి.

Saturday 19th January 2019
Markets_main1547879128.png-23680

- సెబీని కోరిన సన్‌ఫార్మా
- సన్‌ ఫార్మాకు వ్యతిరేకంగా రెండో ప్రజావేగు ఫిర్యాదు
- 8 శాతం పతనమైన షేరు

న్యూఢిల్లీ: కొన్ని సంస్థలు, కొందరు వ్యక్తులు తమ కంపెనీకి, కంపెనీ వాటాదారులకు నష్టం కలిగించే, విద్వేషపూరిత విధానాలకు పాల్పడుతున్నారంటూ మార్కెట్‌ నియంత్రణ సంస్థ, సెబీకి ఫార్మా దిగ్గజం సన్‌ ఫార్మాస్యూటికల్స్‌ ఫిర్యాదు చేసింది. ఈ విషయమై జోక్యం చేసుకోవాలని సెబీని చైర్మన్‌ అజయ్‌ త్యాగిని కోరుతూ సన్‌ ఫార్మా ఒక లేఖ రాసింది. నిరాధారమైన ఫిర్యాదులు, ఆరోపణల కారణంగా వాటాదారుల విలువ భారీగా హరించుకుపోయిందని ఈ లేఖలో కంపెనీ పేర్కొంది.  ఈ కుట్రలో కొన్ని మీడియా సంస్థల, వ్యక్తుల పాత్ర ఉందని ఈ విషయమై పూర్తిగా విచారణ జరపాలని కోరింది.
సన్‌ ఫార్మాకు వ్యతిరేకంగా సెబీకి రెండో ప్రజావేగు ఫిర్యాదు అందిందన్న వార్తల నేపథ్యంలో సన్‌ ఫార్మా షేర్‌ భారీగా నష్టపోయింది. ఇటీవల కాలంలో  ఈ కంపెనీకి వ్యతిరేకంగా సెబీకి అందిన రెండో ప్రజా వేగు ఫిర్యాదు ఇది. గత ఏడాది నవంబర్‌లో కంపెనీలో పలు ​‍అక్రమాలు జరుగుతున్నాయని, ప్రమోటర్లు అవకతవకలకు పాల్పడుతున్నారంటూ ఒక ప్రజావేగు సెబీకి ఫిర్యాదు చేశారు. తాజా వార్తల నేపథ్యంలో శుక్రవారం ఈ కంపెనీ షేర్‌ 8 శాతం క్షీణించి రూ.390 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 12 శాతం క్షీణించి రూ.375కు పతనమైంది. సెన్సెక్స్‌, నిఫ్టీల్లో బాగా నష్టపోయిన షేర్‌ ఇదే. ఒక్క రోజులోనే  ఈ కంపెనీ మార్కెట్‌ క్యాప్ రూ.8,735 కోట్లు హరించుకుపోయి రూ.93,751 కోట్లకు పడిపోయింది.



You may be interested

టయోటా కొత్త ‘‘కామ్రీ హైబ్రీడ్‌’’

Saturday 19th January 2019

ధర రూ.36.95 లక్షలు న్యూఢిల్లీ: టొయోటా కిర్లోస్కర్‌ మోటార్‌ (టీకేఎం) తాజాగా ‘కామ్రీ హైబ్రీడ్‌’ కారు కొత్త వెర్షన్‌ను భారత మార్కెట్లో శుక్రవారం విడుదలచేసింది. దీని ప్రారంభ ధర రూ.36.95 లక్షలుగా ఉంటుందని తెలిపింది. పెట్రోల్ ఇంజిన్‌తో పాటు ఎలక్ట్రిక్ మోటార్ కూడా ఉండే ఈ కారు లీటరుకు 23.27 కి.మీ. మైలేజీనిస్తుంది. ఇందులో 9 ఎయిర్‌బ్యాగ్స్‌, బ్రేక్ హోల్డ్ ఫీచర్ మొదలైనవి ఉన్నాయి. 2002లో కామ్రీ హైబ్రీడ్‌ను ప్రవేశపెట్టినప్పట్నుంచి ఇప్పటిదాకా

కార్వీ ట్రేడింగ్‌లో 40శాతం​ యాప్‌తోనే

Saturday 19th January 2019

ఆన్‌లైన్‌ ఆధారిత పెట్టుబడుల పెరుగుదల వచ్చే ఏడాదికల్లా హైదరాబాద్‌ రీసెర్చ్‌ టీమ్‌లో 70 మంది స్థిరమైన ప్రభుత్వం ఏర్పడితే నిఫ్టీ కొత్త శిఖరాలకు ఆటో షేర్లు వద్దు... ప్రభుత్వ రంగ బ్యాంకులు బెటర్‌ కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ సీఈఓ రాజీవ్‌ సింగ్‌ వెల్లడి హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఫైనాన్షియల్‌ బ్రోకరేజ్‌ కంపెనీ కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ మొత్తం ఆదాయంలో కార్వీ ఆన్‌లైన్‌ ట్రేడ్‌ మొబైల్‌ యాప్‌ వాటా 40 శాతం వరకూ ఉంటుందని కంపెనీ సీఈఓ రాజీవ్‌

Most from this category