STOCKS

News


వెలుగులోకి షుగర్‌ షేర్లు

Friday 15th February 2019
Markets_main1550218363.png-24211

కేంద్ర ప్రభుత్వం చక్కెర కనీస అమ్మకం ధర పెంచాలనే నిర్ణయంతో శుక్రవారం షుగర్‌ షేర్లు వెలుగులోకి వచ్చాయి. చక్కెర మిల్లులు కిలో చక్కెరను రూ.31 ధరకు తక్కువగా విక్రయించవద్దని గురువారం ఆహార మంత్రి రాం విలాస్ పాశ్వాన్ స్పష్టం చేశారు. కేంద్రం తీసుకున్న ఆ నిర్ణయంతో చక్కెర ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీల ఆర్థిక కష్టాలు తీరతున్నాయని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అలాగే చక్కెర ఫ్యాక్టరీలకు ప్రభుత్వం ఈథనాల్ లోన్ పరిమితిని కూడా పెంచనుందనే వార్తలు మార్కెట్లో వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో నేటి ట్రేడింగ్‌లో చక్కెర షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. మవానా షుగుర్స్‌ షేర్లు 8శాతం లాభపడగా, బలరామ్‌పూర్‌ చిని మిల్స్‌, అవధ్‌ షుగర్స్‌ షేర్లు 4శాతం ర్యాలీ చేశాయి. అలాగే ధరమ్‌పూర్‌ షుగర్‌ మిల్స్‌ షేర్లు గాయత్రి షుగర్స్‌, బన్నారీ అమాన్‌ షేర్లు 3శాతం లాభపడ్డాయి. అలాగే బజాజ్‌ హిందూస్థాన్‌ షుగర్స్‌, శ్రీ రేణుకా షుగర్స్‌ 2శాతం నుంచి 1శాతం పెరిగాయి.



You may be interested

ఎయిర్‌బస్‌ ఏ380... గుడ్‌బై!!

Friday 15th February 2019

2021 నుంచి తయారీ నిలిపివేత కొనేవారు లేకపోవడంతో సంస్థ నిర్ణయం టౌలౌజ్‌: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రయాణికుల విమానంగా గుర్తింపు పొందిన ఎయిర్‌బస్‌ ఏ380 తయారీ నిలిచిపోనుంది. కొనే కస్టమర్లు లేకపోవడంతో 2021 నుంచి తయారీని నిలిపివేస్తున్నట్టు ఎయిర్‌బస్‌ తాజాగా ప్రకటించింది. ప్రధాన కస్టమర్‌ అయిన ఎమిరేట్స్‌ ఇచ్చిన ఆర్డర్లను తగ్గించుకుంటున్నట్టు తెలిపింది. ‘‘ఏ380 తయారీకి సంబంధించి పూర్తి చేయని ఆర్డర్లు పెద్దగా లేవు. కనుక తయారీని కొనసాగించాల్సిన అవసరం కనిపించడం లేదు’’ అని

బ్యాంక్‌ నిఫ్టీ 1.50శాతం డౌన్‌..!

Friday 15th February 2019

మార్కెట్‌ పతనంలో భాగంగా బ్యాంక్‌ షేర్లు శుక్రవారం భారీగా నష్టపోతున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో​బ్యాంక్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించే బ్యాంక్‌ నిప్టీ 1.30శాతం నష్టపోయింది. ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్లలో ఎక్కువగా అమ్మకాలు జరుగుతున్నాయి. మధ్యాహ్నం గం.12:30ని.లకు ఇండెక్స్‌ గతముగింపు(26,970.60)తో పోలిస్తే 1శాతం నష్టంతో 26,687.35 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇక ఇండెక్స్‌లో మొత్తం 12 షేర్లకు గానూ అన్ని షేర్లు నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. అ‍త్యధికంగా పంజాజ్‌ నేషనల్‌ బ్యాంక్‌, యస్‌ బ్యాంక్‌

Most from this category