STOCKS

News


రెండోరోజూ తియ్యటి ర్యాలీ..!

Tuesday 30th October 2018
Markets_main1540890817.png-21587

చక్కెర షేర్లు వరుసగా రెండో ట్రేడింగ్‌లోనూ తియ్యటి ర్యాలీ చేస్తున్నాయి. ఈ మార్కెటింగ్‌ సంవత్సరం(అక్టోబర్‌-సెప్టెంబర్‌)లో చక్కెర ఉత్పత్తి తగ్గవచ్చని ఇండియన్‌ షుగర్‌ మిల్స్‌ అసోసియేషన్‌ అంచనాలు ర్యాలీకి కారణమయ్యాయి. ఈ ఏడాది దేశంలో చక్కెర ఉత్పత్తి 32 మిలియన్‌ టన్నులుగా ఉండొచ్చని ఐఎస్‌ఎంఏ పేర్కోంది. చక్కెర ఉత్పత్తి తగ్గనుండంతో చక్కెర షేర్లు ర్యాలీ చేయవచ్చనే అంచనాలతో ఇన్వెస్టర్లు వరుసగా రెండో రోజూ కూడా ఈ చక్కెర కౌంటర్లలో కొనుగోళ్లకు తెరలేపారు. ఫలితంగా ఇంట్రాడేలో పలు చక్కెర షేర్లు లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. ధరమ్‌పూర్‌ షుగర్స్‌ మిల్స్‌ 10శాతం, బల్లాపూర్‌ చినీ మిల్స్‌ 5శాతం, దాల్మియా భరత్‌, మగధ్‌ షుగర్స్‌ షేర్ల 5శాతం ర్యాలీ చేశాయి. తురు షుగర్స్‌, రాణా షుగర్స్‌, శ్రీ రేణుకా షుగర్స్‌ 3శాతం లాభపడ్డాయి. గత మార్కెటింగ్‌ సంవత్సరం(అక్టోబర్‌-సెప్టెంబర్‌)లో 2017-18 కాలంలో 32.5 మిలియన్‌ టన్నులు జీవితకాల గరిష్ట చక్కెర ఉత్పత్తి జరిగింది. ఈ నేపథ్యంలో ఈ మార్కెటింగ్‌ సంవత్సరంలో చక్కెర షేర్లు ఏకంగా 67శాతం వరకు క్షీణించాయి.



You may be interested

నిఫ్టీ టార్గెట్‌ 10,380–10,600 శ్రేణి

Tuesday 30th October 2018

స్వల్పకాలానికి మార్కెట్‌ బాటమ్‌అవుట్‌ అయ్యిందని, 10,380–10,600 శ్రేణికి క్రమేపీ పెరిగే ఛాన్స్‌ వుందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ టెక్నికల్‌ అనలిస్ట్‌ సూచిస్తున్నారు. ఇన్వెస్టర్లు, ట్రేడర్లు వారి షార్ట్‌ పొజిషన్ల నుంచి వైదొలిగి 10,004 పాయింట్ల స్టాప్‌లాస్‌తో నిర్దేశిత లక్ష్యానికి లాంగ్‌ పొజిషన్లు క్రియేట్‌ చేసుకోవొచ్చని సిఫార్సుచేశారు. గతవారం మార్కెట్‌ క్షీణించినప్పటికీ, డౌన్‌ట్రెండ్‌ మూమెంటమ్‌ నెమ్మదించిందని, 100 వారాల మూవింగ్‌ ఏవరేజ్‌ కదులుతున్న 10,000 పాయింట్ల సమీపంలో నిఫ్టీ మద్దతుపొంది, పెద్ద ర్యాలీ

డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ దూకుడు

Tuesday 30th October 2018

ప్రముఖ హౌసింగ్‌ ఫైనాన్స్‌ సంస్థ డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ షేరు మంగళవారం 16శాతం లాభపడింది. నేడు ఈ షేరు బీఎస్‌ఈలో రూ. 186.00ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. లిక్విడిటీ కొరత కారణంగా ఇటీవల భారీగా పతనంతో ఈ షేరు కొనుగోలు ధర ఆకర్షణీయంగా ఉండటంతో ఇన్వెస్టర్లు షేరు కొనుగోలుకు మొగ్గచూపారు. ఫలితంగా ఇంట్రాడేలో 16శాతం ర్యాలీ చేసి రూ.214.30 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేసింది. మధ్యాహ్నాం గం.1:20ని.లకు షేరు గత ముగింపు

Most from this category