STOCKS

News


చక్కెర షేర్లకు సీసీఐ చేదు వార్త..!

Friday 21st September 2018
Markets_main1537514278.png-20437

ముంబై:- కేంద్రం ఇథనాల్‌ ధర పెంపు కారణంగా గతవారంలో స్వీట్‌ ర్యాలీ చేసిన చక్కెర షేర్లకు కాంపీటీషన్‌ కమీషన్‌ ఆఫ్‌ ఇండియా(సీసీఐ) షాక్‌ ఇచ్చింది. ప్రభుత్వ ఆయిల్‌ కంపెనీలకు ఇథనాల్‌ సరఫరా చేసే విషయంలో చక్కెర సంఘాలతో కుమ్మక్కుకావడంతో 18 చక్కెర మిల్లులపై రూ.38 కోట్ల జరిమానా విధిస్తున్నట్లు సీసీఐ గురువారం తెలిపింది. ఈ కుమ్మక్కులో అధిక పాత్ర ఉన్న బజాజ్‌ హిందూస్థాన్‌ షుగర్స్‌ కంపెనీ మొత్తం జరిమానాలో రూ.12.35 కోట్లు పెనాల్టీ చెల్లించాలని సీసీఐ ఆదేశాలను జారీ చేసింది. ఈ జరిమానా ప్రభావం నేటి ట్రేడింగ్‌లో ఆయా కంపెనీలు చక్కెర షేర్లపై పడింది. ఫలితంగా బజాజ్‌ హిందూస్థాన్‌ షుగర్స్‌, దాల్మియా భారత్‌ షుగుర్స్‌, బలపూర్‌ చిని మిల్స్‌ షేర్లు 4నుంచి 10శాతం నష్టపోయాయి.
బజాజ్‌ హిందూస్థాన్‌ షుగర్స్‌:- నేటి ట్రేడింగ్‌లో రూ.11.70ల ట్రేడింగ్‌ను ప్రారంభించింది. జరిమానా నేపథ్యంలో షేరు నేటి ట్రేడింగ్‌లో  10 శాతం నష్టపోయి రూ.10.50ల వరకు పతనమైంది. మే 14 తరువాత షేరు ఇంట్రాడేలో ఈ స్థాయిలో నష్టపోవడం ఇదే తొలిసారి. ఉదయం గం.11:30ని.లకు షేరు గతముగింపు(రూ.11.57)తో పోలిస్తే 9శాతం నష్టంతో రూ. 10.48ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇథనాల్‌ ధర పెంపు వార్తల నేపధ్యంలో గత ఏడు ట్రేడింగ్‌ సెషన్స్‌లో 72శాతం లాభపడింది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ. 5.65 రూ.18.80లుగా నమోదయ్యాయి.



You may be interested

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కన్నా ఐసీఐసీఐ బెటర్‌!

Friday 21st September 2018

దేవాంగ్‌ మెహతా వచ్చే 6- 9 నెలల కాలానికి వాల్యూషన్ల పరంగా, వృద్ధి పరంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేరు కన్నా ఐసీఐసీఐబ్యాంకు షేరు బాగుందని సెంట్రమ్‌ ఇండియా అనలిస్టు దేవాంగ్‌ మెహతా అభిప్రాయపడ్డారు. సమీప భవిష్యత్‌లో ఇన్వెస్టర్ల దృష్టి క్రమంగా ఐసీఐసీఐ బ్యాంకు వైపునకు మరులుతుందన్నారు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కౌంటర్లో రద్దీ ఎక్కువని, అందువల్ల కొందరు ఇన్వెస్టర్లు క్రమంగా వ్యూహాత్మకంగా ఐసీఐసీఐ బ్యాంకు కౌంటర్‌కు మరలిపోతారని చెప్పారు. ఐసీఐసీఐ పద్దు పుస్తకాల

నిఫ్టీ 10,000 దిగువకు అసాధ్యం

Friday 21st September 2018

ఎన్నికలకు ముందు ఏడాదిలో ద్రవ్యలోటు పెరుగుదల భయాలు ఉండటం సహజమేనని షేర్‌ఖాన్‌ రీసెర్చ్‌ హెడ్‌ గౌరవ్‌ దువా తెలిపారు. అయితే కేం‍ద్ర ప్రభుత్వం 2018-19 ద్రవ్యలోటు లక్ష్యానికి పరిధిలోనే ఉండాలని భావిస్తుందని ధీమా వ్యక్తంచేశారు. రానున్న కాలంలో జీఎస్‌టీ పన్ను వసూళ్ల మీద అ అంశం ఎక్కువగా ఆధారపడి ఉంటుందని తెలిపారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు.  మార్కెట్‌ స్వల్ప కాలంలో ఎలా ఉంటుందో

Most from this category