STOCKS

News


ఇథనాల్‌ ధర పెంపుతో తీపెక్కిన చక్కెర షేర్లు

Friday 14th September 2018
Markets_main1536911438.png-20251

ముంబై:- ఇథనాల్‌ ధరను కేంద్రం ప్రభుత్వం పెంచడంతో  శుక్రవారం చక్కెర షేర్లు మరింత తీపెక్కాయి. చక్కెర తయారీలో ఉత్పన్నమయ్యే ఇథనాల్‌ ఉత్పత్తిని ప్రోత్సహించే యత్నాల్లో భాగంగా ఇథనాల్‌ ధరను  25శాతం పెంచుతున్నట్లు గత బుధవారం పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వెల్లడించారు. ప్రస్తుతం లీటర్‌ ఇథనాల్‌ ధర రూ.47.13 ఉండగా.. దీన్ని రూ.59.13కి పెంచనున్నట్లు ఆయన తెలిపారు. ఇథనాల్‌ ధరను పెంచడం ద్వారా చక్కెర మిల్లులకు లాభం పెరుగుతుందనే అంచనాలతో శుక్రవారం చక్కెర కంపెనీల షేర్లు ర్యాలీ చేస్తున్నాయి. మావానా షేగర్స్‌, ఉత్తమ్‌ షుగర్స్‌, దాల్మియా షుగుర్స్‌, శక్తి షుగుర్స్‌, ద్వారకేశీ షుగర్స్‌, మగధ్‌ షుగర్స్‌, రాజశ్రీ షుగర్స్‌, రాణీ షుగర్స్‌, కేసర్‌ ఎంటర్‌ప్రైజెస్‌, కేఎం షుగర్‌ మిల్స్‌, ధాంపూర్‌ షుగర్ మిల్స్ షేర్లు ఇంట్రాడేలో 20శాతం వరకు లాభపడి అప్పర్‌ సర్క్యూట్‌ వద్ద లాక్‌ అ‍య్యాయి. వాటితో పాటు ​శ్రీ రేణుక షుగర్స్‌, బల్‌రామ్‌పూర్‌ చిని, త్రివేధి ఇంజనీరింగ్స్‌, అవధ్‌ షుగర్స్‌, డీసీఎం శ్రీరాం ఇండియా షేర్లు 10శాతం వరకు లాభపడ్డాయి.



You may be interested

ఈ మూడు రంగాలకు సై..

Friday 14th September 2018

2013 నాటి ట్రెండ్‌ ఆధారంగా చూస్తే ప్రస్తుతం రూపాయి వేగంగా కోలుకుంటుందని ఐసీఐసీఐ డైరెక్ట్‌ హెచ్‌ఓఆర్‌ పంకజ్‌ పాండే తెలిపారు. ఆటో, సిమెంట్‌, కొన్ని ఫార్మా షేర్లల్లో ఇన్వెస్ట్‌ చేయవచ్చని సూచించారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు.  దేశీయంగా స్థూల ఆర్థికాంశాలు బాగున్నాయని పంకజ్‌ పాండే తెలిపారు. క్యూ1లో బలమైన జీడీపీ వృద్ధి రేటు సాధించామని పేర్కొన్నారు. కంపెనీల ఎర్నింగ్స్‌ పుంజుకున్నాయని తెలిపారు. అంతర్జాతీయ

పెట్రోరంగ షేర్ల ర్యాలీ

Friday 14th September 2018

ముంబై:- పెట్రోరంగ షేర్లు గురువారం పరుగులు పెడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు గరిష్ట ధరల నుంచి తగ్గుముఖం పట్టడంతో పాటు దేశీయంగా రూపాయి బలపడటం ఇందుకు కారణమయ్యాయి. బీఎస్‌ఎస్‌ఈలో పెట్రోఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే ఎస్‌&పీ బీఎస్‌ఈ ఆయిల్‌ & ఇండెక్స్‌ గ్యాస్‌ 2శాతం వరుకు లాభపడింది. ఈ సూచీలు ప్రధాన షేర్లైన బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌, ఐఓసీలు 4నుంచి పెద్ద ర్యాలీ చేశాయి. ఇదే సమయానికి

Most from this category