STOCKS

News


హఠాత్తుగా పతనమైన సూచీలు

Wednesday 31st October 2018
Markets_main1540962080.png-21599

ఆర్‌బీఐ, కేంద్రం విభేదాలతో మార్కెట్లో షాక్‌


బుధవారం పాజిటివ్‌గా ప్రారంభమైన భారత్‌ మార్కెట్‌ ట్రేడింగ్‌ మొదలైన గంట తర్వాత హఠాత్తుగా నెగిటివ్‌లోకి మళ్లింది. ఉదయం 10.20 గంటలకు బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 250 పాయింట్లు క్షీణించి 33,640 పాయింట్ల వద్దకు తగ్గగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 90 పాయింట్ల క్షీణతతో 10,108 పాయింట్ల స్థాయికి దిగింది. కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ 250 పాయింట్ల మేర పతనమై 25,555 పాయింట్ల స్థాయికి చేరింది. 
 



You may be interested

 74 దిగువకు రూపాయి క్రాష్‌

Wednesday 31st October 2018

ఒకవైపు ప్రపంచ ప్రధాన కరెన్సీలతో డాలరు గత రాత్రి భారీగా బలపడటంతో పాటు...ఇక్కడ కేంద్ర ప్రభుత్వానికి, ఆర్‌బీఐకి తీవ్ర విభేదాలు తలెత్తాయని వచ్చిన వార్తలకు స్పందనగా డాలరు మారకంలో రూపాయి విలువ నిట్టనిలువునా పతనమయ్యింది. బుధవారం ఉదయం 10 గంటల సమయానికి రూపాయి 45 పైసల మేర క్షీణించి 74.13 వద్దకు పడిపోయింది. క్రితం రోజు 20 పైసల వరకూ తగ్గిన రూపాయి..ఈ రెండు రోజుల్లో 1 శాతం వరకూ

ఆర్‌బీఐ గవర్నర్‌ రాజీనామా ?

Wednesday 31st October 2018

ఆర్బీఐ విధానాల్లో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడంపై ఆర్‌బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం వ్యవహారశైలితో  విసుగు చెందుతున్న ఉర్జిత్‌ పటేల్‌ రాజీనామా చేయవచ్చని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆర్‌బీఐ గవర్నర్‌ను ముఖ్యమైన అంశాల్లో కేంద్ర ఆదేశించే అధికారాల్ని ఆర్‌బీఐ చట్టం ప్రకారం కేంద్రం సంక్రమింపచేసుకుందంటూ బుధవారం వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో ఆర్‌బీఐ గవర్నర్‌ రాజీనామా చేయవచ్చన్న అంచనాలు ఊపందుకున్నాయి.  ప్రభుత్వానికి, ఆర్‌బీఐ గవర్నర్‌కు

Most from this category