News


ఇర్కాన్‌ ఐపీవో: సబ్‌స్క్రైబ్‌ చేయాలా? వద్దా?

Thursday 13th September 2018
Markets_main1536822011.png-20237

రైల్వే శాఖ నేతృత్వంలోని ‘ఇర్కాన్‌ ఇంటర్నేషనల్‌’ ఐపీవోకు వస్తోంది. మరి ఇందులో ఇన్వెస్ట్‌ చేయాలా? వద్దా? అనే సందేహం చాలా మంది ఇన్వెస్టర్లకు ఉంటుంది. ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ సెంట్రమ్‌ తాజాగా ఇర్కాన్‌ ఐపీవోను సబ్‌స్క్రైబ్‌ చేసుకోవచ్చని సిఫార్సు చేసింది. 4 స్టార్‌ రేటింగ్‌ ఇచ్చింది. 

 

ఐపీవో వివరాలు..
ప్రైస్‌బాండ్‌: రూ.470-475
ఫేస్‌ వ్యాల్యు: రూ.10
ఇష్యూ సైజ్‌: రూ.470 కోట్లు
మినిమమ్‌ లాట్‌ సైజ్‌: 30
ఇష్యూ ప్రారంభం: సెప్టెంబర్‌ 17
ఇష్యూ ముగింపు: సెప్టెంబర్‌ 19

షేర్‌ హోల్డింగ్స్‌
                     ఇష్యూ    ముందు    ఇష్యూ తర్వాత
ప్రమోటర్లు          99.7 శాతం        89.2 శాతం
పబ్లిక్‌+ఇతరులు     0.3 శాతం        10.8 శాతం

ఇష్యూ వాటా
క్విబ్‌                        50 శాతం 
నాన్‌-ఇన్‌స్టిట్యూషన్స్‌    15 శాతం 
రిటైల్‌                       35 శాతం

సబ్‌స్క్రైబ్‌ ఎందుకు?
ఇర్కాన్‌ ఇంటర్నేషనల్‌లో కేం‍ద్ర ప్రభుత్వానికి 99.7 శాతం వాటా ఉంది. ఇది ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ రంగంలో ఇంజినీరింగ్‌, కన్‌స్ట్రక‌్షన్‌ సంబంధిత సర్వీసులను అందిస్తుంది. రైల్వే రంగానికి తొలి ప్రాధాన్యమిస్తుంది. వ్యాపారంలో భిన్నత్వం కోసం జాతీయ రహదారులు, రోడ్డు నిర్మాణ విభాగాలకు కార్యకలాపాలు విస్తరించింది. కంపెనీ అంతర్జాతీయ మార్కెట్లలోనూ సేవలందిస్తోంది. మలేసియా, శ్రీలంక, బంగ్లాదేశ్‌, దక్షిణాఫ్రికా వంటి దేశాల్లో కార్యాలయాలున్నాయి. కంపెనీ రానున్న కాలంలో విదేశీ మార్కెట్లలో కార్యకలాపాలు విస్తరించనుంది. అధిక విలువ కలిగిన ప్రాజెక్టులపై దృష్టి కేంద్రీకరిస్తోంది. బిల్ట్‌-ఆపరేట్‌-ట్రాన్స్‌ఫర్‌ (బీవోటీ), ఇంజినీరింగ్‌-ప్రొక్యూర్‌మెంట్‌-కన్‌స్ట్రక‌్షన్‌ (ఈపీసీ), హైబ్రిడ్‌-యాన్యుటీ-మోడల్‌ (హెచ్‌ఏఎం) కాంట్రాక్టులు సహా జాయింట్‌ వెంచర్స్‌, స్పెషల్‌ పర్పస్‌ వెహికల్స్‌ వంటి వాటితో పోర్ట్‌ఫోలియోను విస్తరించుకుంటోంది. కేంద్ర ప్రభుత్వం మౌలిక వసతుల అభివృద్ధిపై అధికంగా దృష్టి కేంద్రీకరించింది. మెట్రో, భారత్‌మాల, ఎకనమిక్‌ కారిడార్లు వంటి కార్యక్రమాలను గమనిస్తే.. కంపెనీ ఆర్డర్‌ బుక్‌ బాగుంటుందని అంచనా వేయవచ్చు. వ్యాల్యుయేషన్స్‌ ఆకర్షణీయంగా ఉన్నాయి. కంపెనీ పనితీరు, ఆదాయ వృద్ధి బాగున్నాయి. సామర్థవంతమైన మేనేజ్‌మెంట్‌ మరొక సానుకూలత. అందువల్ల ఇన్వెస్టర్లు ఐపీవోను సబ్‌స్క్రైబ్‌ చేయవచ్చు. రైల్వే విభాగంపైనే ఎక్కువగా ఆధారపడటం, చట్టపరమైన ఆమోదాలు ఆలస్యం కావడం వంటివి రిస్క్‌ అంశాలు.   
  
ఇర్కాన్‌ ఐపీఓలో భాగంగా కేంద్రం 10.5 శాతానికి సమానమైన 99 లక్షల షేర్లను విక్రయించనుంది. You may be interested

ఓరియెంట్‌ రిఫ్రాక్టరీస్‌ రేటింగ్‌ డౌన్‌

Thursday 13th September 2018

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ సెంట్రమ్‌ తాజాగా ఓరియెంట్‌ రిఫ్రాక్టరీస్‌ స్టాక్‌ను హోల్డ్‌ చేయవచ్చని సిఫార్సు చేసింది. ఎందుకో చూద్దాం..  బ్రోకరేజ్‌: సెంట్రమ్‌ స్టాక్‌: ఓరియెంట్‌ రిఫ్రాక్టరీస్‌ ఇండస్ట్రీ: మెటల్స్‌ రేటింగ్‌: హోల్డ్‌ ప్రస్తుత ధర: రూ.242 టార్గెట్‌ ప్రైస్‌: రూ.230 డౌన్‌సైడ్‌: 8 శాతం సెంట్రమ్‌.. ఓరియెంట్‌ రిఫ్రాక్టరీస్‌ స్టాక్‌ను హోల్డ్‌ చేయవచ్చని సిఫార్సు చేసింది. రేటింగ్‌ను బై నుంచి హోల్డ్‌కు తగ్గించింది. టార్గెట్‌ ప్రైస్‌ను రూ.230గా నిర్ణయించింది. కంపెనీ పెద్ద సంస్థగా ఎదగడానికి ప్రయత్నిస్తోందని తెలిపింది. భారత్‌లో అధిక మార్కెట్‌

వారంరోజుల గరిష్టం వద్ద పసిడి

Thursday 13th September 2018

న్యూయార్క్‌:- ప్రపంచ మార్కెట్లో గురువారం పసిడి ధర వారంరోజుల గరిష్టం పైన స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. ఆరు ప్రధాన కరెన్సీ విలువతో పోలిస్తే డాలర్‌ ఇండెక్స్‌ క్షీణించడం, అమెరికా 10ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌ పెరగడం ఇందుకు కారణమవుతున్నాయి. ఆసియా మార్కెట్లో భారత వర్తమానకాలం ఉదయం 11 గంటలకు ఔన్స్‌ పసిడి 1 డాలరు స్వల్పంగా లాభపడి రూ.1,211.90 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. క్షీణించిన డాలర్‌ ఇండెక్స్‌:- అమెరికా-చైనా దేశాల మధ్య

Most from this category