STOCKS

News


స్వల్పలాభాలతో ముగింపు..!

Friday 30th November 2018
Markets_main1543573871.png-22531

ఆరంభలాభాల్ని హరించిన బ్యాంక్‌, మెటల్‌ షేర్లు
ఫార్మా, ఐటీ, అటో షేర్ల అండతో సూచీలు వరుసగా ఐదోరోజూ లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్‌ 24 పాయింట్ల లాభంతో 36,194 వద్ద, నిఫ్టీ 18 పాయింట్ల లాభంతో 10,877 వద్ద ముగిశాయి. ముడిచముర ధరల పతనం, రూపాయి ర్యాలీ కారణంగా మార్కెట్‌ మిడ్‌సెషన్‌ వరకు ర్యాలీ చేసింది. మిడ్‌సెషన్‌ నుంచి నెలకొన్న అమ్మకాలతో సూచీలు ఆరంభ లాభాలను నిలుపుకోవడంలో విఫలయ్యాయి. ముఖ్యంగా నిఫ్టీ 10900 పాయింట్ల స్థాయిని నిలుపుకోలేకపోయింది. ఎన్‌ఎస్‌ఈలో బ్యాంక్‌ నిఫ్టీ 76 పాయింట్లు నష్టపోయి 26,863 వద్ద ముగిసింది. ఇదే ఎన్‌ఎస్‌ఈలో ఫార్మా, ఐటీ, అటో, ఆర్థిక, ఫైనాన్స్‌, రియల్టీ రంగాలకు చెందిన సూచీలు లాభాలతో ముగిశాయి. మెటల్‌ బ్యాంకింగ్‌ ఇండెక్స్‌లు మాత్రం నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 36,083- 36,389.22 పాయింట్ల రేంజ్‌లో కదలాడగా, నిఫ్టీ 10,835.10 - 10,922.45 స్థాయిలో కదలాడింది.   
300 పాయింట్ల రేంజ్‌లో సెన్సెక్స్‌:-
ప్రపంచ మార్కెట్లు మిశ్రమంగా ఉన్నప్పటికీ, భారత మార్కెట్‌ డిసెంబర్‌ ఎంఅండ్‌ఓ ఫ్యూచర్‌ కాంట్రాక్టును ఘనంగా ప్రారంభించింది. అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు పతనం, దేశీయ ఫారెక్స్‌లో డాలర్‌ మారకంలో రూపాయి వరుసగా నాలుగోరోజూ బలపడటం సూచీల లాభాల ట్రేడింగ్‌ ప్రారంభానికి సహకరించాయి. సెన్సెక్స్‌ 134 పాయింట్ల లాభంతో 36,304 వద్ద, నిఫ్టీ  34 పాయింట్ల లాభంతో 10,892 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. వినిమయ, ఐటీ, ఇంధన రంగ షేర్ల ర్యాలీతో నిఫ్టీ సూచీ 63 పాయింట్లు లాభపడి 10900 మార్కును అందుకుని 10922 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. మరో ప్రధాన సూచీ సెన్సెక్స్‌ సైతం డబుల్‌ సెంచరీ(219 పాయింట్లు) లాభాలను ఆర్జించి 36,389 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. సూచీలు గరిష్టస్థాయిల వద్ద ట్రేడ్‌ అవుతున్న నేపథ్యంలో ట్రేడర్లు లాభాల స్వీకరణకు పూనుకోవడంతో బ్యాంకింగ్‌, మెటల్‌ షేర్లు నష్టాల బాట పట్టాయి. మిడ్‌సెషన్‌ సమయంలో లాభ, నష్టాల మధ్య ఊగిసలాడిన సూచీలు అమ్మకాలతో పైచేయి కావడంతో పూర్తి నష్టాల్లోకి మళ్లాయి. ఫలితంగా ట్రేడింగ్‌ ఆరంభంలో సూచీలు ఆర్జించిన లాభాల్ని కోల్పోయాయి. నేటి నుంచి రెండురోజుల పాటు జరుగనున్న జీ-20 సదస్సులో వాణిజ్య యుద్ధంపై ట్రంప్‌-జిన్‌పింగ్ చర్చలపై ఇన్వెస్టర్ల దృష్టిని సారించడంతో యూరప్‌ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. యూరో మార్కెట్ల నష్టాల ఓపెనింగ్‌తో కూడా ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని దెబ్బతీసింది. ఫలితంగా మిడ్‌సెషన్‌ నుంచి సూచీలు నష్టాలపాలయ్యాయి. ముఖ్యంగా బ్యాంకింగ్‌, మెటల్‌ షేర్లలో అమ్మకాలు సాగడంతో సెన్సెక్స్‌ 87 పాయింట్ల నష్టాన్ని నమోదు చేసి 36,083 వద్ద,  నిఫ్టీ సూచీ 24పాయింట్ల నష్టపోయి 10,835 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని నమోదుచేశాయి. నేటి మార్కెట్‌ ముగింపు అనంతరం భారత్‌ స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)వృద్ధి రెండో త్రైమాసిక(జూలై-సెప్టెంబర్‌) గణాకాంలు వెలువడునున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు కొంత అప్రమత్తతకు లోనవడం కూడా సూచీల లాభాలు హరించేందుకు ఒక కారణమని చెప్పవచ్చు. మిడ్‌సెషన్‌ సెషన్‌ నుంచి తీవ్ర ఒడిదుడుకులకు లోనైన సూచీలు చివరకు స్వల్పలాభంతో ట్రేడింగ్‌ను ముగించాయి.
టెక్‌మహీంద్రా, డాక్టర్‌రెడ్డీస్‌, సిప్లా, విప్రో, యస్‌బ్యాంక్‌ షేర్లు 3నుంచి 6.50శాతం లాభపడగా, ఎన్‌టీపీసీ, యూపీఎల్‌, టాటామోటర్స్‌, ఇన్ఫ్రాటెల్‌, హెచ్‌పీసీఎల్‌ షేర్లు 2.50శాతం నుంచి 4.50 నష్టపోయాయి.



You may be interested

పెట్టుబడులకు భారత్‌ గొప్ప మార్కెట్‌

Friday 30th November 2018

మూడు నుంచి ఐదేళ్లు లేదా దీర్ఘకాలంలో ఇన్వెస్ట్‌మెం‍ట్లకు భారత్‌ గొప్ప మార్కెట్‌ అని ఐఐఎఫ్‌ఎల్‌ చైర్మన్‌, ఫౌండర్‌ నిర్మల్‌ జైన్‌ తెలిపారు. చాలా మంది ఇన్వెస్టర్లు భారత్‌ మార్కెట్‌పై దృష్టి కేంద్రీకరించారని పేర్కొన్నారు. వ్యాల్యుయేషన్స్‌, స్థిరత్వం వంటి వాటి రూపంలో అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు.  ఇండియన్‌ మార్కెట్లు 2014 నుంచి మంచి పనితీరు కనబరుస్తున్నాయని నిర్మల్‌

వచ్చే ఏడాది నిఫ్టీ ఎర్నింగ్స్‌ వృద్ధి 12 శాతం..!

Friday 30th November 2018

ముంబై: ప్రస్తుత వాతావరణంలో దీర్ఘకాలిక పెట్టుబడులకు పలు మిడ్‌క్యాప్స్‌ ఆకర్షణీయంగా ఉన్నాయని కోటక్ మహీంద్ర అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్, ఈక్విటీ రీసెర్చ్ హెడ్‌ షిబని కురియన్ అన్నారు. వచ్చే 3-5 ఏళ్ల పెట్టుబడి వ్యూహంతో బలమైన వృద్ధి కనబర్చనున్నటువంటి కంపెనీలలో అత్యంత బలమైన యాజమాన్యం కలిగి, మూలధన కేటాయింపు విధానాలు బలంగా ఉండి, ఉన్నతమైన రిటర్న్‌ రేషియోను కలిగిఉన్నటువంటి సంస్థల షేర్లలో పెట్టుబడులు మంచి రాబడిని అందిస్తాయని

Most from this category