STOCKS

News


కరిగిన రూపాయి : పెరిగిన పసిడి

Tuesday 11th December 2018
Markets_main1544510670.png-22820

ముంబై:- రూపాయి కరిగిపోవడం పసిడికి బలానిస్తుంది. ఫారెక్స్‌ మార్కెట్లో రాత్రి డాలర్‌ మారకంలో రూపాయి విలువ 50పైసలు కోసుకుపోయింది. ఫలితంగా గతరాత్రి ఎంసీఎక్స్‌ మార్కెట్లో 10గ్రాముల పసిడి రూ.32వేల పైకి ఎగసింది. చివరికి రూ.567లు లాభపడి రూ.30028లు వద్ద ముగిసింది. అయితే నేటి ట్రేడింగ్‌లో పసిడి ఫ్యూచర్లలో లాభాల స్వీకరణ జరుగుతోంది. ఉదయం గం.11:45ని.లకు ఎంసీఎక్స్‌లో 10గ్రాముల పసిడి రూ.244లు నష్టపోయి రూ.31784.00ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.
అంతర్జాతీయంగా స్వల్ప నష్టాలతో:-             
డాలర్‌ రికవరీ, బ్రెగ్జిట్‌ ఆందోళనల నేపథ్యంలో ప్రపంచమార్కెట్లో పసిడి ధర మంగళవారం స్వల్పంగా నష్టపోయింది. ఆసియా ట్రేడింగ్‌ ఉదయం గం.11:00లకు ఔన్స్‌ పసిడి ధర 2డాలర్లు నష్టపోయి 1,248.95 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. బ్రెగ్జిట్‌పై పార్లమెంట్‌లో మంగళవారం చేపట్టే ఓటింగ్‌ను వాయిదా వేస్తున్నట్లు బ్రిటన్‌ ప్రధాని థెరెసా మే తెలిపారు. బ్రెగ్జిట్‌పై యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ)తో తాను కుదుర్చుకున్న ఒప్పందంలోని అంశాలపై ఎంపీల్లో విభేదాలు తలెత్తడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సోమవారం పార్లమెంట్‌లో ప్రకటించారు. మరోవైపు వచ్చే ఏడాదిలో కీలక వడ్డీరేట్లను ఎలాగైన పెంచాలనే ఉద్దేశంతో ఫెడ్‌ రిజర్వ్‌ ప్రణాళికలు సిద్ధం చేస్తుందని వాల్‌స్ట్రీట్‌లో వార్తలు వెలువడ్డాయి. ఫలితంగా ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో మంగళవారం డాలర్‌ ఇండెక్స్‌ రివకరి బాట పట్టింది. యూఎస్‌ నవంబర్‌ ఉద్యోగ కల్పన గణాంకాలు అంచనాలను అందుకోలేకపోవడంతో గత ట్రేడింగ్‌ సెషన్‌లో డాలర్‌ ఇండెక్స్‌ క్షీణించిన సంగతి తెలిసిందే. డాలర్‌ ఇండెక్స్‌ రివకరి మంగళవారం పసిడి ధరపై ఒత్తిడిని పెంచుతుంది.



You may be interested

ఎన్నికల ఫలితాలతో సమస్య లేదు..

Tuesday 11th December 2018

విదేశీ ఇన్వెస్టర్లకు ఎన్నికల ఫలితాలతో వచ్చిన సమస్య ఏమీ లేదంటున్నారు ఈఎం ఈక్విటీ స్ట్రాటజిస్ట్‌ అడ్రియన్‌ మోవాత్‌. ప్రజలు రాష్ట్రాల ఎన్నికల్లో ఒక విధంగా ఓట్లు వేయవచ్చని, సార్వత్రిక ఎన్నికల్లో మరో విధంగా ఓట్లు వేయవచ్చని అంచనా వేశారు. అందువల్ల ఓటర్లు ఎప్పుడూ ఒకేలా ఓట్లు వేస్తారని అంచనా వేయడం తగదని తెలిపారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు.  భారత్‌ ప్రస్తుతం ప్రతికూల పరిస్థితులను

ఎన్నికల ఫలితాల వేళ ఎలా ట్రేడ్‌ చేయాలి?

Tuesday 11th December 2018

ప్రముఖ బ్రోకరేజ్‌లు, అనలిస్టుల సలహాలు దలాల్‌ స్ట్రీట్‌ మొత్తం ఎన్నికల ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. ఇప్పటికే ఎగ్జిట్‌ పోల్స్‌ దెబ్బకు సూచీలు సోమవారం 2 శాతం మేర ఢమాల్‌మన్నాయి. మరి మంగళవారం నిజ ఫలితాల వేళ సూచీల స్పందన ఎలాఉంటుందోనని ఇన్వెస్టర్లు ఆందోళనగా ఉన్నారు. వీరి ఆందోళనకు తగ్గట్లే ఆరంభంలో సూచీలు నష్టాలతో ట్రేడయ్యాయి. మధ్యాహ్న సమయానికి కాస్త కోలుకొని ప్రస్తుతం ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల

Most from this category