News


ఐటీ షేర్ల ర్యాలీకి అడ్డుపడిన రూపాయి..!

Saturday 24th November 2018
Markets_main1543042980.png-22362

ముంబై: అమెరికా డాలర్‌తో రూపాయి మారకం విలువ 74 స్థాయికి చేరుకున్న సమయంలో జోరుమీద కొనసాగిన ఐటీ రంగ షేర్లు ప్రస్తుతం నష్టాలబాటలో ప్రయాణిస్తున్నాయి. ఈ నెల ప్రారంభం నుంచి క్రమంగా బలపడుతూ వచ్చిన రూపాయి మారకం విలువ గడిచిన ఏడు సెషన్లలోనూ వరుసగా బలపడి ఐటీ షేర్ల లాభాలను ఆవిరిచేసింది. గడిచిన ఏడు సెషన్లలో రూపాయి దాదాపు 2 శాతం మేర బలపడింది. క్రూడ్‌ ధరలు భారీగా తగ్గడం వల్ల ద్రవ్యలోటు, ద్రవ్యోల్బణ భయాలు తగ్గిపోయి మారకం విలువపై సానుకూల ప్రభావం చూపింది. ఈ క్రమంలో దేశీ మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలు తమ వద్ద ఉన్నటువంటి ఐటీ షేర్లలో ఎక్స్‌పోజర్‌ తగ్గించుకుంటున్న నేపథ్యంలో గురువారం ట్రేడింగ్‌ ముగిసే సమయానికి నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ 0.31 శాతం నష్టపోయి 13,835 పాయింట్ల వద్ద నిలిచింది. ఇక ఈఏడాది ప్రారంభం నుంచి చూస్తే.. 2018 క్యాలెండర్‌ ఇయర్‌లోని మొదటి 9 నెలల్లో ఏకంగా 41 శాతం లాభాలను నమోదుచేసిన ఇన్ఫోసిస్‌ షేరు ధర, అక్టోబర్‌ ఒకటి నుంచి ఇప్పటివకు 17 శాతం నష్టపోయింది. ఇదే విధంగా జనవరి-సెప్టెంబర్‌ కాలంలో 64 శాతం పెరిగిన టీసీఎస్‌ షేరు ధర.. ఆ తరువాత కాలంలో 19.5 శాతం పడిపోయింది. హెచ్‌సీఎల్ టెక్, మైండ్‌ట్రీ, విప్రో షేర్లు అక్టోబర్‌ ఒకటి నుంచి ఇప్పటివరకు 7-23 శాతం మేర నష్టపోయాయి. కేపీఐటీ టెక్నాలజీస్‌, టెక్‌ మహీంద్ర 9.2 శాతం నష్టపోగా.. ఎంఫసిస్‌, పెర్సిస్టెంట్‌ సిట్టమ్స్‌, హేక్సావేర్‌ టెక్నాలజీస్‌ షేర్లు సెప్టెంబరు తరువాత నుంచి ఇప్పటివరకు 22-28 శాతం మేర నష్టాలను నమోదుచేశాయి. అయితే, ఇంతటి పతనం నమోదుకావడం అనేది సాధారణ అంశమేనని ఐసీఐసీఐ డెరెక్ట్‌ భావిస్తోంది. కొన్ని నెలలపాటు అవుట్‌పెర్ఫార్మ్‌ చేసిన ఈరంగంలో ఈ మాత్రం దిద్దుబాటు తప్పదని వ్యాఖ్యానించింది. You may be interested

ప్రభుత్వ బ్యాంకులకు యథావిధిగా కేంద్రం నిధులు

Saturday 24th November 2018

న్యూఢిల్లీ: బాసెల్‌-3 నిబంధనలకు అనుగుణంగా మూలధన అవసరాలను చేరుకునే విషయంలో ఆర్‌బీఐ మరో ఏడాది పాటు గడువును సడలించినప్పటికీ... ప్రభుత్వరంగ బ్యాంకులకు యథావిధిగా కేంద్ర ప్రభుత్వం నుంచి మూలధన సాయం అందుతుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కాకపోతే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మిగిలిన కాలంలో ఈ మొత్తం రూ.15,000-20,000 కోట్లకు తగ్గుతుందని పేర్కొన్నాయి. గతేడాది అక్టోబర్‌లో ప్రకటించిన నిధుల సాయం ప్రణాళిక పరంగా ఎటువంటి తగ్గింపు ఉండదని స్పష్టం చేశాయి.

11శాతం తగ్గిన పండుగ వాహన విక్రయాలు

Saturday 24th November 2018

నిస్సారంగా పండుగల సీజన్‌ -పీవీ, టూ వీలర్ల అమ్మకాలు డౌన్‌ -ప్రభావం చూపిన ఎన్‌బీఎఫ్‌సీల లిక్విడిటీ సమస్య -ఫాడా వెల్లడి న్యూఢిల్లీ: దేశీయంగా వాహన కంపెనీల రిటైల్‌ అమ్మకాలు ఈ ఏడాది పండుగల సీజన్‌లో 11 శాతం తగ్గాయి. ప్రయాణికుల వాహనాలు, టూ-వీలర్ల అమ్మకాలు బలహీనంగా ఉండటమే దీనికి కారణమని ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆటోమొబైల్‌ డీలర్స్‌ అసోసియేషన్స్‌(ఎఫ్‌ఏడీఏ) తెలిపింది. గత కొన్నేళ్లలో పండుగల సీజన్‌ ఇంత నిస్సారంగా ఉండడం చూడలేదని ఫాడా ప్రెసిడెంట్‌ అశీష్‌ హర్షరాజ్‌

Most from this category