STOCKS

News


కొత్త సీరిస్‌లో ఓపెన్‌ ఇంట్రెస్ట్‌ భారీగా మారిన షేర్లివే!

Wednesday 2nd January 2019
Markets_main1546407362.png-23356

మూడో త్రైమాసిక ఫలితాల సీజన్‌తో జనవరి నెల హడావుడిగా ఉండబోతోంది. జనవరి సీరిస్‌లో అధిక ఓపెన్‌ ఇంట్రెస్ట్‌(ఓఐ) నమోదు చేసిన ఐదు స్టాకులపై బ్రోకరేజ్‌ల విశ్లేషణలు ఇలా ఉన్నాయి..
1. సీమెన్స్‌: జనవరి సీరిస్‌లో ఓఐ 15.4 శాతం, ధర 3 శాతం పెరిగాయి. కన్సాలిడేషన్‌ తర్వాత పాజిటివ్‌ బ్రేకవుట్‌ సాధించినట్లు చార్టులు చెబుతున్నాయి. స్టాకు రూ. 1045కు పైన కొనసాగినంత కాలం పాజిటివ్‌గా భావించవచ్చని నిపుణులు చెబుతున్నారు. మోతీలాల్‌ ఓస్వాల్‌ రూ. 1100, యాంటిక్‌ బ్రోకింగ్‌ రూ. 1370 టార్గెట్‌ను ఇచ్చాయి. ఇన్‌ఫ్రాపై వ్యయం పెరగడం కంపెనీకి కలిసివస్తుందని అంచనా.
2. కంటైనర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా: జనవరి సీరిస్‌లో ఓఐ 10.4 శాతం, ధర 3.2 శాతం పెరిగాయి. స్టాకు రూ. 700కు పైన ఉన్నంత వరకు పాజిటివ్‌ కదలికలుంటాయని నిపుణుల అభిప్రాయం. మోతీలాల్‌ఓస్వాల్‌ రూ.735, ఫిలిప్‌ క్యాపిటల్‌ రూ. 900 టార్గెట్‌ను ఇచ్చాయి. ఎకనమిక్‌ రికవరీ, మూలధన వ్యయాల కారణంగా నిర్వహణా సామర్ధ్యం పెరగడం తదితర అంశాలు స్టాక్‌కు పాజిటివ్‌ అంశాలు.
3. ముత్తూట్‌ ఫైనాన్స్‌: జనవరి సీరిస్‌లో ఓఐ 11.4 శాతం, స్టాకు ధర 3.7 శాతం పెరిగాయి. గత త్రైమాసికంలో కంపెనీ మొండిపద్దులు తగ్గాయి. స్టాక్‌కు సుశీల్‌ ఫైనాన్స్‌ రూ. 530- 540 టార్గెట్‌ ఇచ్చింది. ఇప్పటికే ఈ స్టాకు హోల్డ్‌ చేస్తున్నవాళ్లు అలాగే కొనసాగించవచ్చని, కొత్త పొజిషన్లు వద్దని సూచించింది.
4. ఎంఅండ్‌ఎం: జనవరి సీరిస్‌లో ఓఐ 12.7 శాతం పెరగగా, ధర 2.8 శాతం పతనమైంది. ధర పడిపోతుంటే ఓఐ పెరగడం షార్ట్‌ పొజిషన్లు పెరగడానికి సంకేతంగా భావించవచ్చు. డిసెంబర్‌లో కంపెనీ విక్రయాలు నిరాశపరిచాయి. దిగువన రూ.750 వరకు స్టాకు ధర పతనం కావచ్చు. 
5. బీఓఐ: జనవరి సీరిస్‌లో ఓఐ 10.8 శాతం, ధర 5 శాతం పెరిగాయి. తాజాగా ప్రభుత్వం నుంచి రూ. 10000 కోట్ల పైచిలుకు సాయం పొందింది. దీంతో త్వరలో పీసీఏ పరిధిలోనుంచి బ్యాంకు బయటకు రావచ్చు. అయితే బ్యాంకు ఎన్‌పీఏలు ఇంకా చాలా ఉన్నాయని నిపుణుల అంచనా. 



You may be interested

రాణిస్తున్న ఐటీ షేర్లు

Wednesday 2nd January 2019

సూచీల నష్టాల ట్రేడింగ్‌లోనూ ఐటీ షేర్లు రాణిస్తున్నాయి.  ఎన్‌ఎస్‌ఈలో ఐటీ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ బుధవారం 1శాతం లాభపడింది.ఐటీ షేర్లలో టీసీఎస్, ఇన్ఫోసిస్‌ షేర్లు 2నుంచి 1శాతం ర్యాలీ ఐటీ షేర్లకు ఉత్సాహానిచ్చింది. అలాగే ఎన్‌ఐఐటీ టెక్‌, 2శాతం, టాటా ఎలాక్సీ, మైండ్‌ ట్రీ, ఓఎఫ్‌ఎస్‌ఎస్‌ 1శాతం, టెక్‌ మహీంద్రా, ఓఎఫ్‌ఎఫ్‌ఎస్‌, విప్రో షేర్లు అరశాతం లాభపడ్డాయి. మరోవైపు ఇన్ఫీభీమ్‌, హెచ్‌సీఎల్‌టెక్‌ షేర్లు అరశాతం నష్టాల్లో

నష్టాల్లో మెటల్‌ షేర్లు

Wednesday 2nd January 2019

అంతర్జాతీయంగా మెటల్‌ షేర్ల పతనంతో దేశీయ మార్కెట్లో ఈ రంగ షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోంటున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ ట్రేడింగ్‌ ప్రారంభంలోనే 2శాతం వరకు క్షీణించింది. చైనా ఉత్పాదక రంగం నెమ్మదించడంతో అంతర్జాతీయ మార్కెట్లో మెటల్ షేర్లు నష్టాల బాట పట్టాయి. మరోవైపు ప్రముఖ రేటింగ్‌ సంస్థ సీఎల్‌ఎస్‌ఏ జేఎస్‌డబ్లూ‍్య స్టీల్‌,  టాటా స్టీల్‌ షేర్ల ధరలకు రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్‌

Most from this category