STOCKS

News


మళ్లీ మోదీయే... విశ్లేషకుల అంచనాలు

Friday 21st December 2018
Markets_main1545416898.png-23145

ఈ ఏడాది ఎన్ని ఎత్తు పల్లాలను చవిచూసినా... చివరికి బుల్స్‌దే పై చేయిగా కనిపిస్తోంది. ఎందుకంటే 2018 ముగియడానికి మరో వారమే మిగిలి ఉండగా, ఇప్పటి వరకు చూసుకుంటే మార్కెట్లు నికరంగా లాభాల్లో ఉన్నట్టే. మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ స్టాక్స్‌ మాత్రం మూడింట రెండొంతులు నష్టాల్లోనే ఉన్నాయి. వీటిల్లో ఇన్వెస్ట్‌ చేసిన వారు మార్కెట్లు తిరిగి ఎప్పుడు ర్యాలీ చేస్తాయా? అని కళ్లల్లో వొత్తులు వేసుకుని చూస్తున్న పరిస్థితి ఉంది. అంతేకాదు, మార్కెట్‌ నూతన శిఖరాలకు పరుగులు పెట్టాలంటే కేంద్రంలో తిరిగి మోదీ సర్కారే కొలువుదీరాలని ఎక్కువ మంది ఇన్వెస్టర్లు ఆశిస్తున్నట్టు ఇప్పటికే సర్వేలు స్పష్టం చేశాయి. మరి ఫండ్‌ మేనేజర్లు, విశ్లేషకుల మనోగతం ఎలా ఉంది...?

 

2019లోనూ మార్కెట్లు సానుకూల రాబడులను ఇస్తాయా...?... ఈ ఏడాది లోక్‌ సభ ఎన్నికలు జరగనున్నాయి. కేంద్రంలో మోదీ సర్కారు సాహసోపేతంగా, ఓటు బ్యాంకు రాజకీయాల కోణానికి భిన్నంగా, భారీ సంస్కరణలు చేపట్టింది. మరి తిరిగి మోదీయే కింగ్‌ అవుతారా? అన్న సందేహం ఇన్వెస్టర్లు అందరిలోనూ ఉంది. ఓ సంస్థ 15 మంది అనలిస్టులు, ఫండ్‌ మేనేజర్ల నుంచి అభిప్రాయాలను తెలుసుకోగా, ఇందులో 50 శాతం మంది బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 40,000-45,000 స్థాయికి చేరొచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. మరో 43 శాతం మంది సైతం సెన్సెక్స్‌ 35,000-40,000 మధ్యలో ఉండొచ్చని అంచనా వ్యక్తం చేశారు. మరో 7 శాతం మంది అయితే 35,000 స్థాయిలకే పరిమితం కావొచ్చన్న అభిప్రాయం తెలియజేశారు. 

 

నిఫ్టీ విషయానికొస్తే...
పోల్‌లో పాల్గొన్న వారిలో 47 శాతం మంది అనలిస్టులు నిఫ్టీ 12,000 మార్క్‌ను బ్రేక్‌ చేసి 12,500 వరకు వెళ్లొచ్చన్న అంచనాతో ఉన్నారు. 33 శాతం మంది అయితే నిఫ్టీ 11,000-12,000 శ్రేణి పరిధిలో ట్రేడ్‌ అవుతుందని భావిస్తున్నారు. 20 శాతం మంది మాత్రం 10,500-11,000 పరిధిలోనే ట్రేడ్‌ కావచ్చని లెక్క కడుతున్నారు. 

 

మోదీ సర్కారే
ఇక లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఆటుపోట్లు పెరుగుతాయని ఎక్కువ మంది నమ్ముతున్నారు. 47 శాతం మంది తిరిగి మోదీ అధికారంలోకి వస్తారని అంచనా వేస్తున్నారు. అయితే, అది సంకీర్ణ సర్కారు కావచ్చని భావిస్తున్నారు. 33 శాతం మంది మాత్రం మరోసారి బీజేపీ పూర్తి మెజారిటీతో అధికారం చేపడుతుందని అంచనా వేస్తుంటే... 20 శాతం మంది మాత్రం ఏ విషయమూ చెప్పలేదు. ‘‘ఎన్నికల నేపథ్యంలో మార్కెట్లు పూర్తి ఆటుపోట్లతో ఉంటాయి. ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఓటమి పాలవుతుందని ఇప్పుడే అంచనా వేయడం కష్టం. స్వల్ప కాలంలో మాత్రం అనూహ్య కదలికలు ఉంటాయి. కాంట్రా పొజిషన్‌ను తీసుకోవచ్చు’’ అని శామ్కో సెక్యూరిటీస్‌ సీఈవో జిమీత్‌ మోదీ తెలిపారు. 

 

స్టాక్స్‌ కొనుగోలు చేసుకోవచ్చా...?
నాణ్యమైన స్టాక్స్‌ను కొనుగోలు చేసుకోవచ్చా? అన్న ప్రశ్నకు కొద్ది కొద్దిగా అని నిపుణులు సూచించారు. 64 శాతం మంది ఇలా చెప్పగా, మిగిలిన వారు భారీ ఫాల్‌ జరిగితే ఏక మొత్తంలో కొనుగోలు చేస్తామని చెప్పడం విశేషం. స్మాల్‌, మిడ్‌ క్యాప్స్‌లో నాణ్యమైన స్టాక్స్‌లోనే ఉండాలని, మిగిలిన వాటి నుంచి బయటపడాలని సూచిస్తున్నారు. అదే సమయంలో మంచి స్టాక్స్‌ను కొనుగోలు చేసుకోవచ్చని ఎపిక్‌ రీసెర్చ్‌ సీఈవో ముస్తఫా నదీమ్‌ సూచించారు. You may be interested

దేశవ్యాప్తంగా 60 ఎల్‌పీజీ బాట్లింగ్ ప్లాంట్లు

Saturday 22nd December 2018

న్యూఢిల్లీ: ప్రభుత్వం, ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ) విధానంలో మూడు ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు 60 ఎల్‌పీజీ బాట్లింగ్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నాయి. ఇందుకోసం ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తి చేసినట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) చైర్మన్ సంజీవ్ సింగ్ తెలిపారు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన (పీఎంయూవై) కింద కొత్తగా 5.87 కోట్ల కనెక్షన్లు మంజూరైన నేపథ్యంలో వంట గ్యాస్ సరఫరా కోసం బాట్లింగ్ సామర్ధ్యం మరింత

భారీగా పడిన స్టాక్స్‌... పెరిగిన ప్రమోటర్ల వాటా

Friday 21st December 2018

2018 సంవత్సరంలో కొన్ని కంపెనీల షేర్లు వివిధ కారణాల నేపథ్యంలో పతనాలను చవిచూశాయి. ఆశ్చర్యకరంగా ఈ కంపెనీల్లో ప్రమోటర్ల వాటా స్వల్పంగా పెరిగింది. ఆ వివరాలే ఇవి....   మన్‌పసంద్‌ బెవరేజెస్‌ గుజరాత్‌ కేంద్రంగా పనిచేసే పళ్ల రసాల తయారీ కంపెనీ. ఈ ఏడాది ఈ స్టాక్‌ 80 శాతం పడిపోయింది. ప్రమోటర్ల వాటా మాత్రం 0.36 శాతం పెరిగింది. జూన్‌ క్వార్టర్‌ ఫలితాలకు ముందు, కంపెనీ సమాచారం ఇవ్వడం లేదంటూ ఆడిటింగ్‌ సంస్థ

Most from this category