News


ఈ షేర్లు కొనొచ్చు

Monday 10th June 2019
Markets_main1560152855.png-26198

ఎన్‌బీసీసీ:    కొనొచ్చు
బ్రోకరేజ్‌ సంస్థ: ఐసీఐసీఐ డైరెక్ట్‌
ప్రస్తుత ధర: రూ.61
టార్గెట్‌ ధర: రూ.77

ఎందుకంటే: ఈ ప్రభుత్వ రంగ నిర్మాణ రంగ కంపెనీ గత ఆర్థిక సంవత్సర నాలుగో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. ఆదాయం 9 శాతం వృద్ధితో రూ.2,353 కోట్లకు పెరగ్గా, నిర్వహణ లాభ మార్జిన్‌ 1 శాతం మేర తగ్గి 7.5 శాతానికి పరిమితమైంది. పన్ను వ్యయాలు తక్కువగా ఉండటంతో నికర లాభం 8 శాతం వృద్ధితో రూ.153 కోట్లకు పెరిగింది.  గత ఆర్థిక సంవత్సరంలో రూ.12,500 కోట్ల ఆర్డర్లను సాధించింది. దీంతో మొత్తం ఆర్డర్లు రూ.80,000 కోట్లకు చేరాయి. ఇది గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆర్జించిన మొత్తం ఆదాయానికి దాదాపు 8 రెట్లు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.15,000 కోట్లకు మించిన ఆర్డర్లు రాగలవని కంపెనీ అంచనా వేస్తోంది. జైప్రకాశ్‌ ఇన్‌ఫ్రాటెక్‌ ప్రాజెక్ట్‌లపై నిర్ణయం ఈ నెల 10న వెలువడుతుందని అంచనా. ఈ డీల్‌ ఎన్‌బీసీసీకే లభిస్తే,  21,000 గృహాల నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంటుంది. దీని కోసం ఈ కంపెనీ రూ.200-300  కోట్లు ఇన్వెస్ట్‌ చేసే అవకాశాలున్నాయి. ఈ ప్రాజెక్ట్‌ పూర్తయితే, 2,500 ఎకరాల భూమి, ఒక కోటి చదరపుటడుగుల ఫ్లోర్‌స్పేస్‌ ఇండెక్స్‌(ఎఫ్‌ఎస్‌ఐ)లు ఎన్‌బీసీసీకి మిగులుతాయి. రానున్న క్వార్టర్లలో ప్రాజెక్ట్‌ల అమలు అంతంతమాత్రంగానే ఉండనున్నా, మరిన్ని ఆర్డర్లు రానున్నాయి. వివిధ ప్రాజెక్ట్‌లకు సంబంధించిన ఆమోదాలు లభించే అవకాశాలు మెరుగయ్యాయి. ఫలితంగా ప్రాజెక్ట్‌ల అమలు మెరుగుపడవచ్చు. మొత్తం మీద రెండేళ్లలో ఆదాయం 27 శాతం చక్రగతివృద్ధితో రూ.15,973 కోట్లకు పెరుగుతుందని భావిస్తున్నాం. నికర లాభం కూడా రెండేళ్లలో 28 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి చెందగలవని అంచనా. 


ఐషర్‌ మోటార్స్‌ :    కొనొచ్చు
బ్రోకరేజ్‌ సంస్థ: మోతిలాల్‌ ఓస్వాల్‌
ప్రస్తుత ధర: రూ.19,880
టార్గెట్‌ ధర: రూ.23,500

ఎందుకంటే: కంపెనీకి చెందిన రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌(ఆర్‌ఈ-బుల్లెట్‌ బైక్‌)ల డిమాండ్‌ బలహీనంగా ఉంటోంది. ఈ బైక్‌ పునరుజ్జీవనం పొందిన 2008 నుంచి చూస్తే, డిమాండ్‌ బలహీనంగా ఉండటం ఇదే మొదటిసారి. కొత్త పోటీదారు (జావా) మార్కెట్లోకి వస్తున్నప్పటికీ,  డిమాండ్‌ తగ్గడం సాధారణ (సైక్లికల్‌)మేనని,  కంపెనీ భావిస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్‌ వరకూ అమ్మకాలు అంతంతమాత్రంగానే ఉండనున్నప్పటికీ, ఆ తర్వాత రికవరీ కాగలవని కంపెనీ అంచనా వేస్తోంది. ఈ బైక్‌ల నాణ్యతను మరింత మెరుగుపరచడానికి, డిస్ట్రిబ్యూషన్‌ నెట్‌వర్క్‌ను మరింత విస్తరించడానికి, బ్రాండ్‌ వేల్యూను పెంచడానికి కంపెనీ ప్రయత్నాలు చేస్తోంది. భారత్‌తో సహా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రీమియమ్‌ బైక్‌లకు పెరుగుతున్న డిమాండ్‌ను అందిపుచ్చుకునే అవకాశాలపై దృష్టి పెట్టింది. 250-750 సీసీ కేటగిరీ సెగ్మెంట్లలలో మార్కెట్‌ను మరింతగా పెంచుకునే ప్రయత్నాలు చేస్తోంది. పదేళ్లలో వాహన పరిశ్రమ సాధించే వృద్ధికి రెండు రెట్ల వృద్ది సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. తన బైక్‌లను భారత్‌ స్టేజ్‌ సిక్స్‌(బీఎస్‌6) ప్రమాణాలకు అప్‌గ్రేడ్‌ చేస్తోంది. అమ్మకాలు అంతంతమాత్రంగానే ఉన్న ఉత్తర ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ తదితర రాష్ట్రాల్లో మార్కెటింగ్‌ జోరుగా చేస్తోంది. కొత్త వేరియంట్లలో ఎగుమతులు పెంచుకునే ప్రయత్నాలు చేస్తోంది. కొత్తగా సీఈఓగా వచ్చిన వినోద్‌ దాసరి అనుభవం, నైపుణ్యం కంపెనీకి మేలు చేయగలవు. రెండేళ్లలో అమ్మకాలు 6 శాతం చక్రగతిన వృద్ధి చెందగలవని, మార్జిన్లు 29 శాతం రేంజ్‌లో నిలకడగానే ఉండగలవని అంచనా వేస్తున్నాం. 



You may be interested

బీమాకు యులిప్‌లు వద్దు !

Monday 10th June 2019

ప్ర: ఈక్విటీ లింక్డ్‌ సేవింగ్స్‌ స్కీమ్‌(ఈఎల్‌ఎస్‌ఎస్‌)ల్లో కొంత,  యూనిట్‌ లింక్డ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ(యుఎల్‌ఐపీ-యులిప్‌)ల్లో కొంత చొప్పున ఇన్వెస్ట్‌ చేద్దామనుకుంటున్నాను. ఇది సరైన నిర్ణయమేనా ?  -రేవంత్‌, విజయవాడ  జ: బీమా తీసుకోవాలనుకుంటే టెర్మ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలే తీసుకోవాలి. అంతేకాని యులిప్‌(యూనిట్‌ లింక్డ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ)లను అస్సలు ఏ మాత్రం పరిగణించకూడదు. యులిప్‌ల్లో ఇన్వెస్ట్‌ చేయడం వల్ల  అదాయపు పన్ను చట్టం, సెక్షన్‌ 80 సి కింద పన్ను ప్రయోజనాలు లభించినప్పటికీ, బీమా, మదుపుకు

రిలయన్స్‌ పవర్‌కు రూ.3,558 కోట్ల నష్టం

Monday 10th June 2019

న్యూఢిల్లీ: అనిల్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ పవర్‌ మార్చి త్రైమాసికంలో రూ.3,558.51 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.189 కోట్ల లాభం రావడం గమనార్హం. 2018-19 పూర్తి ఆర్థిక సంవత్సరానికి కంపెనీ రూ.2,952 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. అంత్రక్రితం ఆర్థిక సంవత్సరంలో లాభం రూ.840 కోట్లుగా ఉంది. డిబెంచర్ల జారీ ద్వారా నిధులు సమీకరించాలని ఈ నెల 8న జరిగిన బోర్డు సమావేశంలో నిర్ణయించింది. 

Most from this category