STOCKS

News


గురువారం ప్రభావిత షేర్లు

Thursday 27th December 2018
Markets_main1545882580.png-23246

వివిధ వార్తలను అనుగుణంగా గురువారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు
సన్‌ఫార్మా:- పేటెంట్‌ ఉల్లంఘన కేసులో తన అనుబంధ సంస్థ డీయుఎస్‌ఏ ఫార్మాస్యూటికల్స్‌ కంపెనీకి కోర్టు నుంచి ఊరట లభించింది.
ఎన్‌టీపీసీ:- బిల్హాపూర్‌ సోలార్‌ పీవీ ప్రాజెక్ట్స్‌, ఆరియా  సోలార్‌ ప్లాంట్‌లలో పెట్టుబడులు పెట్టేందుకు బోర్డు అనుమతులు ఇచ్చింది.
టాటా గ్లోబల్‌ బేవరీజెస్‌:- కేర్‌ రేటింగ్‌ సం‍స్థ ఇటీవల జారీ రూ.715 కోట్ల విలువైన కమర్షియల్‌ పేపర్ల ఇష్యూకు ఎ(+) రేటింగ్‌ను కేటాయించింది.
విస్తా ఫార్మాస్యూటికల్స్‌:- కంపెనీ ప్రమోటలర్‌ వసంత్‌ అలీకి 8.37లక్షల ఈక్విటీ షేర్లను జారీకి బోర్డు ఆమోదం తెలిపింది.
హిందూస్థాన్‌ యూనిలివర్‌:- జీఎస్టీలో పన్ను రేట్ల తగ్గింపు ప్రయోజనాన్ని వినియోగదారులకుఎ బదిలీ చేయలేదని అక్రమ లాభాల వ్యతిరేక విభాగం జారీ చేసిన నోటిసులకు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయిస్తున్నట్లు హెచ్‌యూఎల్‌ తెలిపింది. చాలా ఉత్పత్తులపై పన్ను రేటును 28శాతం నుంచి 18శాతానికి తగ్గించిన్పటికీ, ఈ మేరకు రేట్లను తగ్గించకుండా పూర్వపు ధరలకు వస్తువులును విక్రయించి రూ.383.55 కోట్ల అక్రమ లాభార్జనను పొందినట్లు ఎన్‌ఏఏ హెచ్‌యూఎల్‌ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.
మేవానా షుగర్స్‌:- కంపెనీ అదనపు డైరెక్టర్‌గా మంజు విరా గుప్తా నియమితులయ్యారు.
లేషా ఇండస్ట్రీస్‌:- ప్రస్తుతం రూ.10 ముఖవిలువ కలిగిన ఈక్విటీ షేర్లను రూ.1 ముఖవిలువగా విభజించేందుకు బోర్డు ఆమోదం తెలిపింది.
వైకేఎం ఇండస్ట్రీస్‌:- కంపెనీ ప్రమోటర్‌ అనిల్‌ జైన్‌ కంపెనీకి చెందిన 6.60లక్షల ఈక్విటీ షేర్లను డిసెంబర్‌ 28 నుంచి 31 తేది వరకు ఓపెన్‌ ఆఫర్‌ పద్ధతిలో విక్రయానికి సిద్ధమయ్యారు.
బ్లూకాస్ట్‌ హోటల్స్‌:- కంపెనీ ఛీప్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌గా దిలీప్‌ భగ్తానీ రాజీనామా చేశారు.You may be interested

గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌

Thursday 27th December 2018

సెన్సెక్స్‌ 36,000పైన, నిఫ్టీ 10,800 పైన అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో గురువారం భారత్‌ మార్కెట్‌ గ్యాప్‌అప్‌తో ప్రారంభమయ్యింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 350 పాయింట్ల పెరుగుదలతో 36,041 పాయింట్ల వద్ద ప్రారంభంకాగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ88 పాయింట్ల గ్యాప్‌అప్‌తో 10,818 పాయింట్ల వద్ద మొదలయ్యింది. గత రాత్రి అమెరికా స్టాక్‌ సూచీలు 5 శాతం ర్యాలీ జరిపిన ప్రభావంతో ఆసియా సూచీలు సైతం పాజిటివ్‌గా ట్రేడవుతున్న ప్రభావం ఇక్కడి మార్కెట్‌పై పడింది. మెటల్‌ షేర్లు

మిడ్‌క్యాప్‌ ఐటీ కంపెనీలు ఆకర్షణీయం: పొరింజు

Wednesday 26th December 2018

వచ్చే ఏడాది స్టాక్స్‌ కొనుగోలుకు అద్భుత అవకాశాలు ఉంటాయని ప్రముఖ ఇన్వెస్టర్‌, ఈక్విటీ ఇంటెలిజెన్స్‌ ఇండియా సంస్థ ఎండీ పొరింజు వెలియాత్‌ అన్నారు. ఇది బోటమ్‌అప్‌ విధానంలో ఉంటుందన్నారు. ఎంపిక చేసిన స్టాక్స్‌ కొనుగోళ్లపై దృష్టి సారించొచ్చని సూచించారు. నిఫ్టీకి బయట మంచి వృద్ధికి అవకాశాలున్న స్టాక్స్‌ ఎన్నో ఉన్నాయని పేర్కొ‍న్నారు. 2019లో స్మాల్‌ క్యాప్‌, మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌ రివకరీ అవుతాయన్న ఆశాభవం వ్యక్తం చేశారు. పొరింజు స్మాల్‌క్యాప్‌ సిగార్‌గా

Most from this category