News


బుధవారం వార్తల్లోని షేర్లు

Wednesday 9th January 2019
Markets_main1547006269.png-23473

వివిధ వార్తలకు బుధవారం ప్రభావితం అయ్యే షేర్ల వివరాలు
ఇండియన్‌ బ్యాంక్‌:- ఎప్లాయిస్‌ షేర్‌ పర్చేజ్‌ స్కీమ్‌, ఏటీ1, టైర్‌ 2 బాండ్ల జారీ ద్వారా నిధుల సమీకరణకు బోర్డు ఆమోదం తెలిపింది.
ఎన్‌ఎమ్‌డీసీ:- ఆర్థిక మంత్రిత్వశాఖ మంగళవారం రూ.1000 కోట్ల విలువైన షేర్ల బైబ్యాక్‌ ఇష్యూకు ఆమోదం తెలిపింది. ఇష్యూలో భాగంగా కంపెనీ 3.23శాతానికి సమానమైన 10.20 కోట్ల ఈక్విటీ షేర్లను ప్రతి షేరు ధర రూ.98ల వద్ద తిరిగి కొనుగోలు చేయనుంది. ఇందుకు రికార్డు తేదిని జనవరి 18వ తేదిగా కంపెనీ నిర్ణయించింది.
టాటా స్టీల్‌:- ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో కంపెనీ అ‍మ్మకాలు తగ్గాయి. ఈ క్యూ3లో కంపెనీ 6.77 మిలియన్‌ టన్నుల అ‍మ్మకాలు జరిగినట్లు కంపెనీ ప్రకటించింది.
ఓరియంటల్‌ బ్యాంక్‌ కామర్స్‌:- ప్రభుత్వానికి ఈక్విటీ షేర్ల కేటాయింపు ద్వారా రూ.5,500 కోట్లను సమీకరించేందుకు బోర్డు ఆమోదం తెలిపింది.
క్రిధన్‌ ఇన్ఫ్రా:- సింగపూర్‌ అనుబంధ సంస్థ స్వీ హాంగ్‌ రూ.167 కోట్ల విలువైన ఆర్డర్లు దక్కించుకుంది.
వేదాంత:- ఇటీవల సెర్టిలైట్‌ కాపర్‌ ప్లాంట్‌కు పునఃప్రారంభానికి ఆమోదం తెలిపిన నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యూనల్‌ ఆర్డర్లను సుప్రీం కోర్టు సమర్ధించింది.
పీఎంసీ ఫిన్‌కార్ప్‌:- విష్ణు భవన్‌ ఆగర్వాల్‌ రాజీనామాకు బోర్డు ఆమోదం తెలిపింది.
యస్‌ బ్యాంక్‌:- కొత్త ఛైర్మన్‌ అంశంపై చర్చించేందుకు నేడు బోర్డు సమావేశం కానుంది.
ఐటీసీ:- మహారాష్ట్రకు చెందిన బాంబూ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ సెంటర్‌(బీఆర్‌టీసీ)తో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. మంగళ్‌దీప్‌ బ్రాండ్‌ కింద తాము మార్కెట్‌ చేస్తున్న అగరుబత్తీల తయారీకి అవసరమైన సువాసన భరిత చెక్కలను ముడి పదార్ధాలను  సరఫరాల కోసం ఈ ఒప్పందం కుదుర్చుకున్నామని పేర్కొంది.
భారత్‌ డైనమిక్స్‌:- లాంచర్లు, యాంటీ ట్యాంక్‌ గైడెడ్‌ మిస్సైల్స్‌ తయారు చేసి సరఫరా చేసే కాంట్రాక్ట్‌ను భారత సైన్యం నుంచి పొందింది. ఈ కాంట్రాక్ట్‌ విలువ రూ.760 కోట్లు. ఈ మిస్సైల్స్‌, లాంచర్లను హైదరాబాద్‌ సమీపంలోని భానూర్‌ యూనిట్‌లో రష్యా దేశం సాంకేతిక సహకారంతో తయారు చేస్తామని తెలిపింది.
ఆర్‌జీఐఏ:- శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం గ్రౌండ్‌ హ్యాండ్లింగ్‌ ఆపరేషన్స్‌ బాధ్యతలను టర్కీకి చెందిన సెలెబి ఏవియేషన్‌ హోల్డింగ్‌ దక్కించుకుంది.
ట్రాన్స్‌జీన్‌ బయోటెక్‌ :- నోటి ద్వారా ఇన్సులిన్‌ను తీసుకోవడానికి వీలుగా కంపెనీ అభివృద్ధి చేసిన సాంకేతిక పరిజ్ఞానానికి యూఎస్‌ఏ పేటెంటు లభించింది.



You may be interested

సెన్సెక్స్‌ 200 పాయింట్లు గ్యాప్‌అప్‌

Wednesday 9th January 2019

నిఫ్టీ 10,850 పాయింట్ల పైకి తాజా అమెరికా-చైనా చర్చలతో ఏడాదికాలంగా ఇన్వెస్టర్లను కలవరపెడుతున్న ట్రేడ్‌వార్‌. ముగుస్తుందన్న అంచనాల ఫలితంగా బుధవారం భారత్‌ సూచీలు భారీ గ్యాప్‌అప్‌తో ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 200 పాయింట్లు జంప్‌ చేసి 36,180 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 60 పాయింట్ల లాభంతో 10,862 పాయింట్ల వద్ద ఆరంభమయ్యాయి. 7,8 తేదీల్లో ఇరు దేశాల మధ్య జరిగిన వాణిజ్య చర్చల కాలపరిమితిని అనూహ్యంగా మూడోరోజుకు సైతం పొడిగించడంతో ఒక ఒప్పందం

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 80 పాయింట్లు జంప్‌

Wednesday 9th January 2019

అమెరికా, చైనాల మధ్య జరిగిన వాణిజ్య చర్చలు ఫలప్రదంగా ముగుస్తాయన్న అంచనాలతో సింగపూర్‌లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 70 పాయింట్ల పెరిగింది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీతో అనుసంధామై ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ బుధవారం ఉదయం గం.8:50ని. లకు 10,918 వద్ద కదులుతుంది. క్రితం రోజు ఇక్కడ నిఫ్టీ ఫ్యూచర్‌ స్పాట్‌తో పోలిస్తే 48 పాయింట్ల ప్రీమియంతో 10,848 పాయింట్ల వద్ద ముగిసింది. ఆసియా మార్కెట్లు సైతం పాజిటివ్‌ ట్రేడ్‌ అవుతున్నాయి. జపాన్‌ నికాయ్‌

Most from this category