STOCKS

News


శుక్రవారం వార్తల్లోని షేర్లు

Friday 4th January 2019
Markets_main1546573989.png-23395

వివిధ వార్తలకు అనుగుణంగా శుక్రవారం ప్రభావిత‌మ‌య్యే షేర్ల వివ‌రాలు ఇవి
స‌న్ ఫార్మా:- పోలా ఫార్మా కొనుగోలు ప్రక్రియ‌ను పూర్తి చేసింది. పోలా ఫార్మా కొనుగోలుతో ప్రపంచవ్యాప్తంగా తమ చర్మ సంబంధింత ఔషధ విభాగం మరింత పటిష్టమవుతోందని పేర్కోంది.
హెచ్‌డీఎఫ్‌సీ స్టాండ‌ర్ లైఫ్ ఇన్సూరెన్స్:- కంపెనీ ఎండీ&సీఈవో ప‌ద‌వికి విభా ప‌డాల్కర్ నియ‌మానికి షేర్‌హోల్డర్ల అనుమ‌తి ద‌క్కించుకుంది.
టొరెంటా ఫార్మా:- థానే ప‌ట్టణానికి 20 ఏళ్ల పాటు విద్యుత్‌ను స‌ర‌ఫ‌రా చేసేందుకు ఆర్డర్లను దక్కించుకుంది.
ఎన్‌హెచ్‌పీసీ:-  రాజస్థాన్‌లోని పాన్‌బ‌తి-3 యూనిట్ మూసివేత కార‌ణంగా రూ.30.14 కోట్ల న‌ష్టం వాటిల్లిన‌ట్లు స్టాక్ ఎక్స్చేంజ్‌లకు స‌మాచారం ఇచ్చింది.
ఫ్యూచ‌ర్ ఎంట‌ర్‌ప్రైజెస్‌:- ఎన్‌సీడీల జారీ ద్వారా రూ.750 కోట్లను స‌మీక‌రించిన‌ట్లు తెలిపింది.
ప‌వ‌ర్ గ్రిడ్ కార్పోరేష‌న్:- హర్యానా పవర్‌ ప్రాజెక్ట్‌లో రూ.400 కోట్ల పెట్టుబ‌డులు పెట్టేందుకు బోర్డు ఆమోదం తెలిపింది.
మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా ఫైనాన్షియ‌ల్ స‌ర్వీసెస్‌:- నాన్ క‌న్వర్టబుల్ డిబెంచ‌ర్ల జారీ ద్వారా కంపెనీ రూ.3500 కోట్ల స‌మీక‌ర‌ణ‌కు ప్రణాళిక సిద్ధం చేసింది.
ఎల్ అండ్ టీ క‌న్‌స్ట్రక్షన్‌:- దేశీయ మార్కెట్లో రూ.1,060 కోట్ల విలువైన ఆర్డర్లను ద‌క్కించుకుంది.
అలెంబిక్ ఫార్మా:- ప్రమీప్లోల్ డైహైడ్రోక్లోరైడ్ ఔష‌ధాల‌కు యూఎస్ఎఫ్‌డీఏ నుంచి అనుమ‌తులు ద‌క్కించుకుంది.
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా:- ఈఎస్ఎస్‌పీఎస్ ప‌థ‌కంలో భాగంగా ఉద్యోగుల‌కు ఈక్విటీ షేర్ల‌ను జారీ చేసి రూ.600 కోట్ల స‌మీక‌రిస్తున్నట్లు కంపెనీ తెలిపింది.
హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్‌ :- మరోసారి అతిపెద్ద మ్యూచువల్‌ ఫండ్‌ కంపెనీగా అవతరించింది. గత నెల చివరి నాటికి మొత్తం హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్‌ ఆస్తులు రూ.3.35లక్షల కోట్లుగా ఉన్నాయి.
శ్రీరామ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఫైనాన్స్‌:- రూ.1000 కోట్ల ముఖవిలువ కలిగిన ఎన్‌సీడీల జారీ ద్వారా రూ.700 కోట్లు సమీకరించనుంది. ఈ ఇష్యూ ఈ నెల 7న ప్రారంభమై 31న ముగుస్తుంది. 3,5, 10 ఏళ్ల పరిమితితో ఈ ఎన్‌సీడీలను జారీ చేస్తుంది.
జాగరణ్‌ ప్రకాశన్‌:- ఎన్‌సీడీల జారీ ద్వారా రూ.300 కోట్లు సమీకరించనుంది.
రిలయన్స్‌ కమ్యూనికేషన్‌:- స్పెక్ట్రమ్‌ అమ్మకం విషయంలో ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వట్లేదని సుప్రీం కోర్టును ఆశ్రయించింది. రిలయన్స్‌ ధాఖలు  చేసిన పిటిషన్ జనవరి 07న సుప్రీం కోర్టు ధర్మాసనం ముందుకు రానుంది.You may be interested

జీఎంఆర్‌కు మలేషియా ఎయిర్‌పోర్ట్స్‌ షాక్‌

Friday 4th January 2019

షేర్‌ పర్చేజ్‌ అగ్రిమెంట్‌ రద్దు డీల్‌ విలువ రూ.530 కోట్లు హైదరాబాద్‌: జీఎంఆర్‌ గ్రూప్‌నకు మలేషియా ఎయిర్‌పోర్ట్స్‌ హోల్డింగ్ బెర్హడ్‌ (ఎంఏహెచ్‌బీ) షాక్‌ ఇచ్చింది. జీఎంఆర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు చెందిన జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌ లిమిటెడ్‌తో కుదిరిన షేర్‌ పర్చేజ్‌ అగ్రిమెంట్‌ను రద్దు చేస్తున్నట్టు తేల్చిచెప్పింది. జీఎంఆర్‌ హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో తమకున్న 11 శాతం వాటాను జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌కు విక్రయించేందుకు ఎంఏహెచ్‌బీ గతేడాది ఫిబ్రవరిలో అంగీకరించింది. ఈ మేరకు ఇరు సంస్థల మధ్య ఒప్పందం

10,700 పాయింట్ల వద్ద నిఫ్టీ ప్రారంభం

Friday 4th January 2019

సెన్సెక్స్‌ 77 పాయింట్లు అప్‌ గత రెండు రోజులుగా తీవ్రంగా క్షీణించిన భారత్‌ మార్కెట్‌ శుక్రవారం స్వల్పలాభాలతో మొదలయ్యింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఇండెక్స్‌ 27 పాయింట్ల గ్యాప్‌అప్‌తో 10,700 పాయింట్ల వద్ద ప్రారంభంకాగా, బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 77 పాయింట్ల లాభంతో 35,590 పాయింట్ల వద్ద ఓపెన్‌ అయ్యింది. ట్రేడ్‌వార్‌ ముగుస్తుందన్న అంచనాలు, చైనా 21 బిలియన్‌ డాలర్ల విలువైన భారీ రైల్వే ప్రాజెక్టుల నిర్మాణాన్ని ప్రకటించడంతో ఆసియా సూచీలు పాజటివ్‌ ట్రేడింగ్‌

Most from this category