STOCKS

News


బుధవారం వార్తల్లోని షేర్లు

Wednesday 16th January 2019
Markets_main1547613878.png-23610

వివిధ వార్తలకు అనుగుణంగా బుధవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు
ఇండోరమా సింథటిక్స్‌:- కంపెనీ ప్రధాన ప్రమోటర్లకు ఈక్విటీ షేర్లను జారీ చేసి రూ.361 కోట్లను నిధుల సమీకరించేందుకు బోర్డు ఆమోదం తెలిపింది. ఇండియా నెదర్లాండ్‌ బీవీ కంపెనీకి ప్రతి షేరు ధర రూ.36 చొప్పున మొత్తం 8.30 కోట్ల ఈక్విటీ షేర్లను జారీ చేసి రూ.299 కోట్లను సమీకరించనుంది. అలాగే సియామ్‌ హోల్డింగ్‌ లిమిటెడ్‌ ప్రతి షేరు ధర రూ.36 చొప్పున మొత్తం 8.30 కోట్ల ఈక్విటీ షేర్లను జారీ చేసి రూ.30 కోట్లను సమీకరించనుంది. 1.7 కోట్ల షేర్లను జారీ చేసి రూ.62 కోట్లను సమీకరించనుంది.
కేపీఐటీ టెక్నాలజీస్‌:- నేషనల్‌ ఇంజనీరింగ్‌ ఇండస్ట్రీస్‌, సెంట్రల్‌ ఇండియా ఇండస్ట్రీస్‌ కంపెనీలకు 9:22 నిష్పత్తిలో మొత్తం 7.7 కోట్ల ఈక్విటీ షేర్లను జారీ చేసేందుకు బోర్డు ఆమోదం తెలిపింది. ఇందుకు రికార్డు తేదినీ జనవరి 25వ తేదిగా నిర్ణయించింది.
డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌:- ఆంధ్రప్రదేశ్‌లో ఫార్మూలేషన్‌ యూనిట్‌ను తనిఖీలు నిర్వహించిన యూఎస్‌ఎఫ్‌డీ నాలుగు 483 అబ్జర్వేషన్‌ ఫాంలను జారీ చేసినట్లు స్టాక్‌ ఎక్చే‍్సంజ్‌లకు సమాచారం ఇచ్చింది.
యస్‌కేఎఫ్‌:- షేర్ల బై బ్యాక్‌ ఇష్యూ  జనవరి 23 నుంచి ఫిబ్రవరి 05వ తేది వరకు కొనసాగుతుందని ప్రకటించింది.
ఓరియంటల్‌ ఎలక్ట్రానిక్స్‌:- కొత్త రకం సీలింగ్‌ ఫ్యాన్లను ప్రీమియం ధరల్లో మార్కెట్‌లో విడుదల చేసింది.
ఫోర్టీస్‌ హెల్త్‌కేర్‌:- కంపెనీ అవసరాలకు కొరకు సిటీ బ్యాంక్‌ నుంచి రూ.1100 కోట్ల రుణాన్ని పొందింది.
డీహెచ్‌ఎఫ్‌ఎల్‌:- ఏస్‌ ఇన్వెస్టర్‌ రాకేష్‌ ఝున్‌ఝున్‌వాలా కంపెనీలో తన మొత్తం వాటాల్లోంచి 0.73శాతం వాటాకు సమానమైన 22.7లక్షల ఈక్విటీ షేర్లను రూ.51 కోట్లకు విక్రయించారు. ఈ విక్రయంలో కంపెనీలో  ఝున్‌ఝున్‌వాలా వాటా 2.46శాతానికి పరిమితమైంది.
నేడు క్యూ3 ఫలితాలను ప్రకటించే కొన్ని ప్రధాన కంపెనీలు:- మైండ్‌ ట్రీ, ఫిలిప్స్‌ కార్బన్‌ బ్లాక్‌, 5పైసా క్యాపిటల్‌, మోతీలాల్‌ ఓస్వాల్‌ సర్వీసెస్‌, హెచ్‌టీ మీడియా, డీసీబీ బ్యాంక్‌You may be interested

10700-10800 పాయింట్ల శ్రేణి కీలక మద్దతు

Wednesday 16th January 2019

మరోమారు నిఫ్టీ కీలకమైన 10870 పాయింట్లను దాటి బలంగా క్లోజయింది. నిఫ్టీ 200 రోజుల డీఎంఏ స్థాయికి పైన ముగియడం పాజిటివ్‌ అంశమని ఎస్‌ఎంసీ గ్లోబల్‌ పేర్కొంది. బుధవారం నిఫ్టీ 10900 పాయింట్లకు అటుఇటుగా కదలాడుతోంది. డెరివేటివ్స్‌ గణాంకాలు పరిశీలిస్తే 10700, 10800 పాయింట్ల వద్ద పుట్‌ రైటింగ్‌, 11000 పాయింట్ల వద్ద కాల్‌ అన్‌వైండింగ్‌ కనిపిస్తోంది. అందువల్ల స్వల్పకాలానికి నిఫ్టీకి 10700- 10800 పాయింట్లు కీలక మద్దతు స్థాయిలుగా

స్వల్పలాభంతో ప్రారంభం

Wednesday 16th January 2019

మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల నడుమ దేశీయ మార్కెట్‌ బుధవారం స్వల్ప లాభంతో ప్రారంభమైంది. సెన్సెక్స్‌ 50 పాయింట్ల లాభంతో 36320 వద్ద, నిఫ్టీ 12 పాయింట్ల లాభంతో 10,899 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. సూచీలకు ఇది వరుసగా రెండోరోజూ లాభాల ప్రారంభం కావడం విశేషం. నిన్న బ్రిటన్‌ పార్లమెంట్‌లో బ్రిగ్జిట్‌ పై జరిగిన ఓటింగ్‌లో బ్రెగ్జిట్‌కు వ్యతిరేకంగా 432 మంది,  202 మంది అనుకూలంగా ఓటు వేశారు. అలాగే అమెరికా

Most from this category