STOCKS

News


సోమవారం వార్తల్లోని షేర్లు

Monday 13th August 2018
Markets_main1534133399.png-19195

ముంబై:- వివిధ వార్తలకు అనుగుణంగా సోమవారం ప్రభావితం అయ్యే షేర్ల వివరాలు
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు:- ఈ బ్యాంకు డిప్యూటీ ఎం.డీ. ప్రకాష్‌ సుక్తంకర్‌ రాజీనామా చేశారు.
అశోక్‌ లేలాండ్‌:- బ్రిటన్‌ తన అనుబంధ సంస్థ ఒప్టరే ఎలక్ట్రిక్‌ డబుల్‌ డెక్కర్‌ వాహనాలను తయారుచేసేందుకు ఆర్డర్లను దక్కించుకుంది.
ఎన్‌బీసీసీ:- సెంట్రల్‌ బోర్డు ఆప్‌ సెకండరీ ఎడ్యూకేషన్‌(హెచ్‌బీఎస్‌ఈ) నుంచి రూ.150 కోట్ల విలువైన ఆర్డర్లును దక్కించుకుంది.
యూనివర్సల్‌ కేబుల్స్‌:- జర్మని ఆధారిత కేబుల్‌ కంపెనీ ఎన్‌కేటీ సంస్థతో భాగస్వామ్య ఒ‍ప్పందాన్ని కుదుర్చుకుంది.
సిప్లా:- యూఎస్‌ మార్కెట్‌లో రియాటేజ్‌ ఔషధ విక్రయాలకు యూఎస్‌ఎఫ్‌డీ నుంచి అనుమతులు దక్కించుకుంది. అలాగే ఎంఎస్‌ఎస్‌ లాబరేటీస్‌ సంస్థతో కలిసి ఎక్సేలోడా ఔషధ విక్రయాలకు భాగస్వామ్య ఒ‍ప్పందాన్ని కుదుర్చుకుంది.  
హిందూజా గ్లోబల్‌ సెల్యూషన్స్‌:- మనీ అడ్వైజ్‌ సర్వీసెస్‌ సంస్థకు రెండేళ్ల సేవలు అందించేందుకు ఒప్పందాన్ని కుదుర్చుకుంది. 
వెల్‌స్పాన్‌ కార్పో:- 51 మిలియన్‌ డాలర్ల విలువైన పైపులు సరఫరా చేసేందుకు ఒప్పందాన్ని కుదర్చుకుంది.
జెట్‌ ఎయిర్‌వేస్‌:- ఆర్థిక సంక్షోభం నుంచి గట్టేక్కేందుకు ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థలకు 400 మిలియన్‌ డాలర్ల విలువైన వాటాను విక్రయించేందుకు సన్నాహాలు సిద్ధం చేస్తోంది.
ఫ్యూచర్స్‌ రిటైల్‌:- అమెజాన్‌ సంస్థతో కలిసి పనిచేసేందుకు ఆసక్తి చూపుతోంది.
నేడు క్యూ1 ఫలితాలను ప్రకటించే కొన్ని ప్రధాన కంపెనీలు:-
టాటా స్టీల్‌, అబాట్‌ ఇండియా, అపెక్స్‌ ఫ్రోజెన్స్‌ ఫుడ్స్‌, అశోకా బిల్డ్‌కాన్‌, అస్ట్రాజెనికా ఫార్మా, కేడిల్లా హెల్త్‌కేర్‌, కేర్‌ రేటింగ్స్‌, కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌, ధావన్‌ హౌసింగ్స్‌, డ్రెజింగ్‌ కార్పోరేషన్‌ ఆఫ్‌ ఇండియా, ఫినిక్స్‌ కేబుల్స్‌, గోద్రేజ్‌ ఇండస్ట్రీస్‌, హిందూస్థాన్‌ ఏరోనాటికల్స్‌, జైన్‌ ఇరిగేషన్స్‌, ఆయిల్‌ ఇండియా, ఒరాకిల్‌ ఫైనాన్షియల్‌, రెప్కో హోమ్‌ ఫైనాన్స్‌, సద్భవన్‌ ఇంజనీరింగ్స్‌, శిల్పా మెడికేర్‌, సన్‌టెక్‌ రియాల్టి, టాటా కెమికల్స్‌, వర్థమాన్‌ టెక్స్‌టైల్స్‌.You may be interested

11,350 దిగువకు నిఫ్టీ

Monday 13th August 2018

మార్కెట్‌ నష్టాలు మరింత పెరిగాయి. నిఫ్టీ 11,350 దిగువకు వచ్చేసింది. 80 పాయిట్ల క్షీణతతో 11,349 వద్ద ట్రేడవుతోంది. ఇక సెన్సెక్స్‌ ఏకంగా 267 పాయింట్ల క్షీణతతో 37,602 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.  అమెరికా మార్కెట్లు శుక్రవారం క్షీణించడం, ఆసియా మార్కెట్లు కూడా సోమవారం నష్టాలోనే ట్రేడవుతుండటం, టర్కీ లిరా క్షీణించడంతో యూరో ఏడాది కనిష్ట స్థాయికి పడిపోవడం, ఇరాన్‌పై అమెరికా ఆంక్షల కారణంగా క్రూడ్‌ ఆయిల్‌ ధరలు పెరగడం, గ్లోబల్‌

నిలువునా పతనమైన రూపాయి..

Monday 13th August 2018

భారత్‌ కరెన్సీ రూపాయి జీవిత కాల కనిష్ట స్థాయికి పతనమైంది. సోమవారం అమెరికా డాలర్‌తో పోలిస్తే భారీగా పడిపోయింది. కొత్త రికార్డ్‌ కనిష్ట స్థాయికి క్షీణించింది. టర్కీ ఆర్థిక సంక్షోభ భయాల నేపథ్యంలో వర్ధమాన మార్కెట్ల కరెన్సీలన్నీ నష్టాల్లోనే ట్రేడ్‌ అవుతుండటం ఇందుకు కారణం. ఉదయం 9:13 సమయంలో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి 69.46 వద్ద ట్రేడవుతోంది. తన మునపటి ముగింపు 68.84తో పోలిస్తే ఏకంగా 0.9 శాతం (63పైసలు) క్షీణించింది.

Most from this category