STOCKS

News


బుధవారం వార్తల్లోని షేర్లు

Wednesday 31st October 2018
Markets_main1540958885.png-21596

వివిధ వార్తలకు అనుగుణంగా బుధవారం ప్రభావితం పలు కంపెనీల షేర్లు ఇవే..!
కోల్‌ ఇండియా:- నేటి నుంచి కంపెనీలో 3శాతం వాటాను ప్రభుత్వం విక్రయించనుంది. ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) విధానంలో ఒక్కో షేర్‌ను రూ.266కు విక్రయించాలని కేంద్రం నిర్ణయించింది. రెండురోజుల పాటు జరిగే ఈ వాటా విక్రయంతో ప్రభుత్వానికి రూ.5,000 కోట్లు సమకూరుతాయని అంచనా.
డాక్టర్‌ రెడ్డీస్‌:- యూఎస్‌ఎఫ్‌డీ దువ్వాడ మానుఫ్యాక్చరింగ్ యూనిట్‌లో తనిఖీలు పూర్తి చేసింది. తనిఖీల అనంతరం 8 అబ్జర్వేషన్స్‌ ఫారాలను జారీ చేసింది.
ఐఎల్‌&ఎఫ్‌ఎస్‌ ట్రాన్స్‌పోర్టేషన్స్‌:- కంపెనీ ఎండీ పదవికి కే.రామచంద్‌ రాజీనామా చేశారు.
పంజాజ్‌ నేషనల్‌ బ్యాంక్‌:- ఎంసీఎల్‌ఆర్‌ రేట్లను 5 బేసిస్‌ పాయింట్లను పెంచింది. నవంబర్‌ 1 నుంచి పెంచిన రేట్లు అమల్లోకి రానున్నాయి.
ఐఎల్‌&ఎఫ్‌ఎస్‌ ట్రాన్స్‌పోర్టేషన్స్‌:- అక్టోబర్‌ 29, 30 తేదిల్లో 6 ఎన్‌సీడీల చెల్లింపుల్లో విఫలమైంది.
గార్డెన్‌ రిచ్‌ షిప్‌బిల్డర్స్‌&ఇంజనీరింగ్స్‌:- కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖతో కలిసి రూ.2,435 కోట్ల భారీ తరహా ఓడ తయారీకి ఒప్పందాన్ని కుదుర్చుకుంది.  
అలెంబిక్‌ ఫార్మా:- రూ.500 కోట్ల వాణిజ్య పేపర్ల ఇష్యూకు ప్రముఖ రేటింగ్‌ సంస్థ కేర్‌ రేటింగ్‌ను ఎ(+)కు పెంచింది.
క్రిధన్‌ ఇన్ఫ్రా:- సింగపూర్‌లో తన అనుబంధ సంస్థ కేహెచ్‌ ఫోర్జ్‌ రూ.130.50 కోట్ల విలువైన రెండు ప్రాజెక్ట్‌లను దక్కించుకుంది.
మూత్తూట్‌ ఫైనాన్స్‌:- కేంద్ర రిజర్వ్‌ బ్యాంక్‌ ఆమోదం అనంతరం నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీ మూత్తూట్‌ మనీ సంస్థను రూ.110 కోట్లకు దక్కించుకుంది.
బ్లూస్టార్‌:- మహారాష్ట్రలో రూ.115 కోట్లతో కొత్త ప్లాంట్‌ ఏర్పాటుకు బోర్డు ఆమోదం తెలిపింది.
నేడు క్యూ2 ఫలితాలను ప్రకటించే కొన్ని ప్రధాన కంపెనీలు:- ఎల్‌ అండ్‌ టీ, టాటామోటర్స్‌, లుపిన్‌, వేదాంత, కెనరా బ్యాంక్‌, యూనిటైడ్‌ స్పిరిట్‌, డాబర్‌ ఇండియా, సిండికేట్‌ బ్యాంక్‌, ఎస్కార్ట్‌, ప్రిజమ్‌ జాన్సన్‌, నారాయణ హృదయలయా, సిటి నెట్‌వర్క్స్‌, రిలయన్స్‌ నిప్పన్‌ లైఫ్‌ అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌, అదానీ గ్రీన్‌ ఎనర్జీ, ఎన్‌ఆర్‌ అగర్వాల్‌ ఇండస్ట్రీస్‌, డిక్సన్‌ టెక్నాలజీస్‌, మాట్రిమోనీ డాట్‌ కామ్‌, కేఎస్‌బీ, కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌, ఇండోస్టార్‌ క్యాపిటల్‌ ఫైనాన్స్‌, శ్రీకాళహస్తి పైప్స్‌, కాస్ట్రల్‌ ఇండియా, ఆర్బిట్‌ ఎక్స్‌పోర్ట్‌, ఫ్యూచర్‌ లైఫ్‌స్టైల్‌ ఫ్యాషన్స్‌, సుబెక్స్‌, రెపో ఇండియా, జువారీ, ఫిలిటెక్స్‌ ఇండియా, గాంధీ స్పెషల్‌ ట్యూబ్స్‌, మిండా కార్పోరేషన్‌, అజంతా ఫార్మా, ఓరియంట్‌ పేపర్‌, కల్పతరు పవర్‌ ట్రాన్స్‌మిషన్స్‌, బ్లూ డార్ట్‌ ఎక్స్‌ప్రెస్‌, ఎల్‌జీ బాలకృష్ణ, లక్ష్మీ ఎనర్జీ, హానివెల్‌ అటోమెషన్‌, ఇండో టెక్‌ ట్రాన్స్‌ఫార్మర్స్‌, రామ్‌కో ఇండస్ట్రీస్‌, గార్డెన్‌ స్కిల్స్‌ మిల్స్‌, హెచ్‌ఈజీ, రామ్‌ సిస్టమ్స్‌, ధమ్‌పూర్‌ షుగర్స్‌ మిల్స్‌, బాలాపూర్‌ చిని మిల్స్‌, హై టెక్‌ గెర్స్‌.You may be interested

డాక్టర్‌ రెడ్డీస్‌కు యూఎస్‌ఎఫ్‌డీ షాక్‌

Wednesday 31st October 2018

3నెలల కనిష్టానికి పతనమైన షేరు ప్రముఖ ఔషధ కంపెనీ డాక్టర్‌ రెడ్డీస్‌ లాబొరేటరీస్‌కు చెందిన షేరు బుధవారం బీఎస్‌ఈ ట్రేడింగ్‌ ప్రారంభంలోనే 6.50శాతం నష్టపోయింది. విశాఖపట్నంలోని దువ్వాడలోని ఉన్న ఫార్ములేషన్స్‌ తయారీ కేంద్రంలో యూఎస్‌ ఎఫ్‌డీఏ తనిఖీలు పూర్తి చేసింది. 8 రకాల ఉల్లంఘనలకు కంపెనీ పాల్పడినట్లు ఎఫ్‌డీఏ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఫుడ్‌, డ్రగ్‌, కాస్మెటిక్‌ యాక్ట్‌ కింద ఫామ్‌-483ని యూఎస్‌ఎఫ్‌డీ జారీ చేసినట్టు మంగళవారం డాక్టర్‌ రెడ్డీస్‌

స్వల్పలాభాలతో ప్రారంభం

Wednesday 31st October 2018

ప్రపంచ మార్కెట్లు పటిష్టంగా వున్నా, భారత్‌ మార్కెట్‌ బుధవారం నిస్తేజంగా ప్రారంభమయ్యింది. రూపాయి విలువ బాగా తగ్గడం, కనిష్టస్థాయి నుంచి ముడి చమురు ధరలు కోలుకోవడం ఇందుకు కారణం బీఎస్‌ఈ సెన్సెక్స్‌71 పాయింట్ల పెరుగుదలతో 33,963 పాయింట్ల వద్ద ప్రారంభంకాగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 11 పాయింట్ల తగ్గుదలతో 10,209 పాయింట్ల వద్ద మొదలయ్యింది. క్రితం రోజు డాలరు మారకంలో 20 పైసల మేర క్షీణించిన రూపాయి విలువ తాజాగా మరో

Most from this category