STOCKS

News


శుక్రవారం వార్తల్లోని షేర్లు

Friday 28th December 2018
Markets_main1545968051.png-23269

వివిధ వార్తలను అనుగుణంగా శుక్రవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు ఇవి
టాటా స్టీల్‌ బీఎస్‌ఎల్‌:- కంపెనీ చెందిన రూ.21వేల కోట్ల విలువైన ధీర్ఘకాలిక బ్యాంకు రుణానికి కేర్‌ రేటింగ్‌ సంస్థ ఎఎ(స్థిరత్వం) రేటింగ్‌ను కేటాయించింది.
యూనైటెడ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా:- ఫ్రిపరెన్షియల్‌ బేసిస్‌ పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం ఈక్విటీ క్యాపిటల్‌ రూపంలో రూ.2159 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది.
కన్సాయ్‌ నెరోలాక్‌ పెయింట్స్‌:- షేర్‌ పర్చే‍‍జ్‌ అగ్రిమెంట్‌ పద్ధతిలో ఫెర్మా కన్‌స్ట్రక్చన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో 100శాతం వాటాను రూ.30 కోట్లకు కొనుగోలు చేసింది.
మెజాస్కో:- షేర్ల రైట్స్‌ ఇష్యూకు రికార్డు తేదిని జనవరి 07ను నిర్ణయించింది.
ఒడిశ్శా సిమెంట్స్‌:- కంపెనీ షేర్ల ముఖ విలువను రూ.10ల నుంచి రూ.2లకు తగ్గించేందుకు జనవరి 08వ తేదిని రికార్డు తేదిగా నిర్ణయించింది.
హెచీసీసీ:- రైట్స్‌ ఇష్యూ ద్వారా ఈక్విటీ షేర్లను జారీ చేసి రూ.500 కోట్ల నిధుల సమీకరణను పూర్తి చేసింది
లెమన్‌ ట్రీ హోటల్స్‌:- అంతర్జాతీయ ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థ వార్‌బర్గ్‌ పిన్కస్‌తో కలిసి జాయింట్‌ వెంచర్‌ను ఏర్పాటు చేసింది. రెంటల్‌ హౌసింగ్‌ ప్రాజెక్ట్‌ల అభివృద్ధి కోసం ఈ జేవి రూ.3వేల కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ఈ జేవీలో వార్‌బర్గ్‌ పిన్కస్‌ విభాగానికి 68శాతం, లెమన్‌ ట్రీ హోటల్స్‌కు 30శాతం చొప్పున వాటాలుంటాయి. మిగిలిన 2శాతం లెమన్‌ ట్రీ వ్యవస్థాపకులు పతంజలి కేశ్వానికి ఉంటాయి.
ఎల్‌ అండ్‌ టీ:- రూ.2,357 కోట్ల విలువైన ఆర్డర్లను దక్కించుకుంది. ఇందులో ఆం‍ధ్రప్రదేశ్‌కు చెందిన సీఆర్‌డీఏ నుంచి రూ.1,281 కోట్ల విలువైన పనులు, మధ్యప్రదేశ్‌ నుంచి రూ.1076 కోట్ల ఆర్డర్లులున్నట్లు కంపెనీ తెలిపింది.
డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌:- డయాలిసిస్‌ రోగులకు వాడే సెవెలామిర్‌ కార్బొనేట్‌ ఔషదాన్ని అమెరికా మార్కెట్లోకి విడుదల చేసింది. అమెరికాలో ఈ ఔషధాలకు రూ.10.1 కోట్ల డాలర్ల మార్కెట్‌ ఉన్నట్లు కంపెనీ తెలిపింది
అశోకా బిల్డ్‌కాన్‌:- నాన్‌ కన్వర్టబుల్‌ డిబెంచర్ల జారీ ద్వారా కంపెనీ రూ.150 కోట్ల సమీకరణకు బోర్డు ఆమోదం తెలిపింది.
కేంద్ర ప్రభుత్వం 7 ప్రభుత్వరంగ బ్యాంకులకు రూ.28615 కోట్ల మూలధనాన్ని అందించేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో నేడు ప్రభుత్వ రంగ బ్యాంకు షేర్ల ట్రేడింగ్‌ చురుగ్గా ఉండవవచ్చని మార్కెట్‌ విశ్లేషలంటున్నారు.You may be interested

10800 పైన ప్రారంభమైన నిఫ్టీ

Friday 28th December 2018

బ్యాంకింగ్‌, ఆర్థిక రంగ షేర్ల అండతో శుక్రవారం మార్కెట్‌ లాభాలతో ప్రారంభమైంది.  సెన్సెక్స్‌ 150 పాయిం‍ట్ల లాభంతోనూ, నిఫ్టీ 10,800 పైన ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. నేటి డాలర్‌ మారకంలో రూపాయి(20పైసలు లాభం) బలపడటం సూచీలకు ఉత్సాహానిచ్చింది. ఉదయం గం.9:25 ని.లకు సెన్సెక్స్‌ 220 పాయింట్ల లాభంతో 36వేల పైన 36,029 వద్ద, నిఫ్టీ సూచి 67.55 పాయింట్లు పెరిగి 10,847.35 ‍వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఎన్‌ఎస్‌ఈలోని ఒక్క ఎఫ్‌ఎంజీసీ సూచి

పన్ను ఆదా కోసం... ఈ ఐదు ఫండ్స్‌

Friday 28th December 2018

మార్చితో ముగిసే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పన్ను ఆదా కోసం పెట్టుబడులు పెట్టాలనుకునే వారి ముందున్న మెరుగైన సాధనాల్లో ఈక్విటీ లింక్డ్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ (ఈఎల్‌ఎస్‌ఎస్‌) కూడా ఒకటి. సెక్షన్‌ 80సీ కింద రూ.1.5 లక్షల వరకు ఆదాయంపై పన్ను మినహాయింపునకు ఈఎల్‌ఎస్‌ఎస్‌ సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేసుకోవాలంటూ వెల్త్‌ మేనేజర్లు ఎక్కువగా సూచిస్తుంటారు. ఎందుకంటే పన్ను ఆదా కోసం ఉపయోగపడే సాధనాల్లో తక్కువ లాకిన్‌ పీరియడ్‌ మూడేళ్లు కలిగి ఉన్న

Most from this category