STOCKS

News


బుధవారం వార్తల్లోని షేర్లు

Wednesday 14th November 2018
Markets_main1542170026.png-21968

వివిధ వార్తలకు అనుగుణంగా బుధవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు ఇవి
జీఎంటర్‌టైన్‌మెంట్‌:- కంపెనీ ప్రమోటర్‌ గ్రూప్‌ 50శాతం వాటాను కంపెనీ వ్యూహాత్మక భాగస్వామికి విక్రయించారు.
జెట్‌ ఎయిర్‌వేస్‌:- కంపెనీని టాటాగ్రూప్‌ కొనుగోలు చేస్తుందనే వార్తలను ఖండించింది.
హిందాల్కో:- బ్రెజిల్‌లో అల్యూమినియం ఉత్పత్తితో పాటు రిసైక్లింగ్‌ ఉత్పాదకతను పెంచేందుకు తన అనుబంధ సంస్థ ‘‘నావిలస్‌’’ రూ.1200 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది.
వాల్‌చంద్‌నగర్‌ ఇండస్ట్రీస్‌:- రూ.200 కోట్లకు మించకుండా సెక్యూరిటీల జారీ చేసేందుకు బోర్డు ఆమోదం తెలిపింది.
ఇన్ఫోసిస్‌:- టెక్సాస్‌లో టెక్నాలజీస్‌, ఇన్పోవేస్‌ హబ్‌ను ప్రారంభించనుంది. ఈ హబ్‌లో 2020 నాటికి కల్లా 500 మంది అమెరికన్లకు ఉపాధి కల్పన లక్ష్యంగా పెట్టుకుంది.
బీపీసీఎల్‌:- కంపెనీ చీప్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌గా ఎన్‌.విజయగోపాల్‌ ఈ నవంబర్‌ 14నుంచి పదవీబాధ్యతలు స్వీకరించనున్నారు.
నేడు క్యూ2 ఫలితాలను ప్రకటించనున్న కొన్ని ప్రధాన కంపెనీలు:-
మహీంద్రా అండ్‌ మహీంద్రా, అపోలో హాస్పిటల్స్‌ ఎంటర్‌ప్రైజెస్‌, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, సీఈఎస్‌సీ, జీఎమ్‌ఆర్‌ ఇన్‌ఫ్రా, జీవీకే పవర్‌ అండ్‌ ఇన్‌ఫ్రా, ఐడీబీఐ బ్యాంక్‌, కాక్స్‌ అండ్‌ కింగ్స్‌, ఎమ్‌ఆర్‌పీఎల్‌, ఎన్‌బీసీసీ, ఎన్‌హెచ్‌పీసీ, పేజ్‌ ఇండస్ట్రీస్‌, పీసీ జ్యుయలర్‌, రెప్కో హోమ్‌ ఫైనాన్స్‌, థెర్మాక్స్‌, యూనిటెక్‌,  డెన్‌ నెట్‌వర్క్స్‌, కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్‌, ఇన్పీబీమ్‌ అవెన్యూస్‌, ఇప్కా ల్యాబ్స్‌, కావేరి సీడ్‌, ఎస్‌ఎమ్‌ఎల్‌ ఇసుజు, సువెన్‌ లైఫ్‌ సైన్సెస్‌, వీనస్‌ రెమిడీస్‌, వీడియోకాన్‌, వీఐపీ ఇండస్ట్రీస్‌.



You may be interested

స్థిరంగా పసిడి ధర

Wednesday 14th November 2018

ప్రపంచమార్కెట్లో పసిడి ధర బుధవారం స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. ఆసియా మార్కెట్లో భారత వర్తమానకాల ప్రకారం ఉదయం గం.10:00లకు ఔన్స్‌ పసిడి ధర 1.20డాలర్లు స్వల్పంగా పెరిగి 1203 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. గతరాత్రి అమెరికా మార్కెట్ల నష్టాల ముగింపు ప్రభావంతో నేడు ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు పసిడి ఫ్యూచర్ల కొనుగోళ్లు, అమ్మకాలపై ఆచూతూచి వ్యవహరిస్తున్నారు. మరోవైపు పసిడి ధరపై

2 నెలల గరిష్టానికి రూపీ

Wednesday 14th November 2018

ఇండియన్‌ రూపాయి బలపడింది. రెండు నెలల గరిష్ట స్థాయిల వద్ద ట్రేడవుతోంది. క్రూడ్‌ ధరల తగ్గుదల బాగా కలిసొచ్చింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి బుధవారం 50 పైసలకుపైగా లాభపడింది. 72.16 వద్ద ప్రారంభమైంది. కాగా రూపాయి మంగళవారం 72.67 వద్ద ముగిసింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్‌ రూపాయి సెప్టెంబర్‌ 21న తొలిసారిగా 72 స్థాయికి పడిపోయింది. అమెరికా డబ్ల్యూటీఐ క్రూడ్‌ ఆయిల్‌ ఫ్యూచర్స్‌ ధర బ్యారెల్‌కు 55.66

Most from this category