News


బుధవారం వార్తల్లోని షేర్లు

Wednesday 17th October 2018
Markets_main1539750269.png-21227

వివిధ వార్తలకు అనుగుణంగా బుధవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు
దీపక్‌ ఫెర్టిలైజర్స్‌:- తన ప్రమోటర్‌ గ్రూప్‌ సంస్థ రోబూస్ట్‌ మార్కెటింగ్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీకి ఈక్విటీ షేర్లను జారీ చేసేందుకు సెక్యూరిటీస్‌ అలాంట్‌మెంట్‌ కమిటీ ఆమోదం తెలిపింది. రూ.10లు ముఖవిలువ కలిగిన ప్రతి షేరు ధర రూ.298.79ల వద్ద మొత్తం రూ.64లక్షల ఈక్విటీ షేర్లను ప్రమోటర్‌ గ్రూప్‌కు కేటాయిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది.
అబాన్‌ ఆఫ్‌షోర్స్‌:- యూకే కాంటినెంటల్‌ షెల్ప్‌ ప్రాడెక్ట్స్‌ 100శాతం వాటాను కొనుగోలు చేసి 50శాతం వాటాను అమ్మివేసింది.
ఎల్‌ అండ్‌ టీ టెక్నాలజీస్‌:- గ్రాఫైన్‌ సెమికండక్టర్‌ సర్వీసెస్‌లో 100శాతం వాటాను కొనుగోలు చేసింది.
కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌:- బై బ్యాంక్‌ ప్రక్రియకు బోర్డు ఆమోదం తెలిపింది. ఇష్యూలో భాగంగా కంపెనీ ప్రతి షేరు ధర రూ.455ల వద్ద మొత్తం 4.39 మిలియన్‌ ఈక్విటీ షేర్లను తిరిగి కొనుగోలు చేసుకోనుంది.
అదానీ గ్రీన్‌ ఎనర్జీ:- తన అనుబంధ సంస్థ అదానీ విండ్‌ ఎనర్జీని విలీనం చేసుకునే ప్రక్రియను పూర్తి చేసింది.
జేఎస్‌డబ్లూ‍్య స్టీల్‌:- భూషణ్‌ స్టీల్‌ రుణదాతలు జేఎస్‌డబ్లూ‍్య స్టీల్‌ వేసిన టెండర్‌కే సుముఖత చూపుతున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఐఎల్‌&ఎఫ్‌ఎస్‌:- రూ.100 కోట్ల డిఫాల్డ్‌ రుణాన్ని మంగళవారం చెల్లించింది.
లెమన్‌ ట్రీ హోటల్స్‌:- ముంబైలో జూలై 2109 వరకు 700 గదుల హోటల్‌ను లీజ్‌కు తీసుకుంది.
నేడు క్యూ2 ఫలితాలను వెల్లడించే కొన్ని ప్రధాన కంపెనీలు:- రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఏసీసీ, హావెల్స్‌ ఇండియా, ఆదిత్యా బిర్లా మనీ, సియెంట్‌, మెండ్‌ట్రీ, రెస్పాన్సీవ్‌ ఇండస్ట్రీస్‌, ఎన్‌ఐఐటీ టెక్నాలజీస్‌, మెఫాసిస్‌, డీసీబీ బ్యాంక్‌, 5పైసా క్యాపిటల్‌.You may be interested

ఫ్యూచర్‌ రిటైల్‌తో తుది దశకు అమెజాన్‌ సంప్రదింపులు

Wednesday 17th October 2018

న్యూఢిల్లీ: ఆన్‌లైన్‌ ఈ రిటైల్‌ దిగ్గజం అమెజాన్‌ కిషోర్‌ బియానీకి చెందిన ఫ్యూచర్‌ రిటైల్‌లో వాటా తీసుకోవడం దాదాపు ఖాయమయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఈ రెండు సంస్థల మధ్య గత కొన్ని నెలలుగా చర్చలు జరుగుతున్నట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ చర్చలు పురోగతికి చేరాయని, 3-4 వారాల్లో నిర్ణయం వెలువడచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. చర్చలు పురోగతిలో ఉన్నాయని, రూ.2,000 కోట్లకు పైగా పెట్టుబడితో వాటా

ఇంధన ధరల్లో ప్రభుత్వ జోక్యం లేదు

Wednesday 17th October 2018

న్యూఢిల్లీ: పెట్రోలియం ఉత్పత్తులపై నియంత్రణ ఎత్తివేసిన నేపథ్యంలో వాటి ధరల విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోదని కేంద్ర చమురు శాఖ మంత్రి ధర్మే్ంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు. అంతర్జాతీయ విధానాలకు అనుగుణంగా రేట్లు నిర్ణయించుకునేందుకు ప్రభుత్వ రంగ చమురు రిటైల్ సంస్థలకు పూర్తి స్వేచ్ఛ ఉందని ఇండియా ఎనర్జీ ఫోరం సదస్సులో పాల్గొన్న సందర్భంగా విలేకరులకు ఆయన చెప్పారు.  ఇటీవలే పెట్రోల్‌, డీజిల్‌పై రూ.1.50 మేర ఎక్సయిజ్ సుంకాన్ని తగ్గించిన

Most from this category