STOCKS

News


కరెక్షన్‌ తర్వాత పరుగులు తీసే షేర్లు ఏవి?

Wednesday 14th November 2018
Markets_main1542134109.png-21962

రెండు నెలల కరెక్షన్‌ తర్వాత మార్కెట్లు కుదురుకునే క్రమంలో ఉన్నాయి. ఈ స్థాయిలోనే స్థిరపడతాయా? లేక మరికాస్త దిద్దుబాటు ఉంటుందా? అన్నది రానున్న రాష్ట్రాల ఎన్నికల తర్వాత తేలిపోనుంది. అయితే, కరెక్షన్‌ తర్వాత రికవరీ, ర్యాలీలో పాల్గొనే షేర్లు ఏవై ఉంటాయి? అన్న ఆసక్తి ఇన్వెస్టర్లలో ఉండడం ఆశర్యమేమీ కాదు. దీనిపై ఎలారా క్యాపిటల్‌ ఓ అధ్యయనం చేసి ర్యాలీ చేయడానికి ఎక్కువ అవకాశం ఉన్న షేర్ల వివరాలను వెల్లడించింది. 

 

2006 నుంచి ఈ ఏడాది మార్చి మధ్య చోటు చేసుకున్న మార్కెట్‌ కరెక్షన్లపై ఎలారా క్యాపిటల్‌ అధ్యయనం చేసింది. ఈ కాలంలో మార్కెట్లు 10 శాతానికి పైగా 16 సందర్భాల్లో కరెక్షన్‌కు గురి కాగా... అనంతరం జరిగిన ర్యాలీల్లో 12-13 సందర్భాల్లో పెరిగిన షేర్లతో ఎలారా ఓ జాబితా రూపొందించింది. కరెక్షన్‌ ముగిసిన తర్వాత ఒక్క నెలలోనే ఈ స్టాక్స్‌ 11-19 శాతం మధ్య రాబడులను ఇచ్చినట్టు ఎలారా నివేదిక తెలియజేస్తోంది. అదే సమయంలో నిఫ్టీ-50 9.5 శాతం మేర పెరిగినట్టు తెలుస్తోంది. అంటే నిఫ్టీకి మించి పనితీరు చూపించాయి. ఎలారా రూపొందించిన జాబితాలో రిలయన్స్‌ ఇన్‌ఫ్రా, జిందాల్‌ స్టీల్‌, సెంచురీ టెక్స్‌టైల్స్‌, హిందాల్కో, టాటాస్టీల్‌, రిలయన్స్‌ క్యాపిటల్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంకు, టీవీఎస్‌ మోటార్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు తదితర షేర్లు ఉన్నాయి.

 

మొత్తం 16 మార్కెట్‌ కరెక్షన్ల తర్వాత జరిగిన ర్యాలీల్లో... హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు 14 సార్లు, బజాజ్‌ ఫైనాన్స్‌ 13 సార్లు, యస్‌ బ్యాంకు 13, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ 11, హావెల్స్‌ 11, యునైటెడ్‌ బ్రూవరీస్‌ 11, శ్రీరామ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఫైనాన్స్‌ 12, ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ 11, ఎక్సైడ్‌ 11, చోళమండలం ఇన్వెస్ట్‌మెంట్‌ 11, రామ్కో సిమెంట్‌ 10, టాటా గ్లోబల్‌ 11, సుప్రీం ఇండస్ట్రీస్‌ 13, సెంచురీ టెక్స్‌టైల్స్‌ 13, అజంతా ఫార్మా 10, దివాన్‌ హౌసింగ్‌ 11, రిలయన్స్‌ క్యాపిటల్‌ 12 సందర్భాల్లో మంచి పనితీరు చూపించాయి. ఇక చారిత్రకంగా చూస్తే, కరెక్షన్లలోనూ, ఆ తర్వాత మార్కెట్‌ రికవరీల్లోనూ మంచి పనితీరు చూపించిన వాటిల్లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, (32 సందర్భాల్లో 29 సార్లు), డాబర్‌ (24 సందర్భాలు), ఎక్సైడ్‌ ఇండస్ట్రీస్‌, సుప్రీం ఇండస్ట్రీస్‌, గృహ్‌ ఫైనాన్స్‌, పీఐ ఇండస్ట్రీస్‌, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, క్రిసిల్‌ కనీసం 23 సందర్భాల్లో మంచి పనీతీరు చూపించినట్టు ఎలారా క్యాపిటల్‌ తెలియజేసింది. You may be interested

భార్యా భర్తలకూ ఒకటే పాలసీ.. చూడాల్సినవివే...

Wednesday 14th November 2018

జాయింట్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ... జీవిత భాగస్వాములు ఇద్దరికీ కలిపి బీమా రక్షణ అందించే ఏకైక పాలసీ. భార్య గృహిణి అయిటే టర్మ్‌ పాలసీ తీసుకోవడం సాధ్యం కాదు. భాగస్వాములు ఇద్దరూ ఉద్యోగులు అయితే ఎవరికి వారే టర్మ్‌ పాలసీలు తీసుకోవచ్చు. అయితే ప్రీమియం ఎక్కువగా ఉంటుంది. కానీ, కాస్త తక్కువ ప్రీమియానికే, భార్య గృహిణి అయినప్పటికీ లభించే పాలసీయే... జాయింట్‌ లైఫ్‌ టర్మ్‌ పాలసీ. దీనికి సంబంధించిన వివరాలు

ఆకర్షిస్తున్న 5 బ్యాంకు స్టాక్స్‌!

Wednesday 14th November 2018

దేశ ఆర్థిక వ్యవస్థతో ముడిపడిన బ్యాంకింగ్‌ రంగం చారిత్రకంగా చూస్తే ఇన్వెస్టర్లకు లాభాలను పంచుతూ వస్తోంది. అయితే, ఎన్‌పీఏల సమస్యలతో ఇటీవలి కాలంలో బ్యాంకింగ్‌ స్టాక్స్‌ కళ తప్పాయి. అయితే, ఇది స్వల్ప కాలం పాటు ఉండే సమస్యే. దీని కారణంగా బ్యాంకింగ్‌ స్టాక్స్‌ చాలా వరకు విలువల పరంగా ఆకర్షణీయ స్థా‍యికి దిగొచ్చాయి. ‘‘క్రెడిట్‌ వృద్ధి మోస్తరుగా ఉంది. పీఎస్‌యూ బ్యాంకులు తమ డిపాజిట్‌ బేస్‌ను పెంచుకున్నాయి. రుణ

Most from this category