STOCKS

News


స్వల్పకాలానికి ఎస్‌ఎంఎస్‌ గ్లోబల్‌ సిఫార్సులు

Wednesday 18th July 2018
Markets_main1531896553.png-18431

వచ్చే ఒకటి రెండు నెలల్లో దాదాపు 13 శాతం వరకు రాబడినిచ్చే స్టాకులను ఎస్‌ఎంఎస్‌ గ్లోబల్‌ సంస్థ రికమండ్‌ చేస్తోంది. 
1. వీ2 రిటైల్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 475. స్టాప్‌లాస్‌ రూ. 390. ఇటీవల రూ. 495 స్థాయిని తాకిన అనంతరం ప్రాఫిట్‌ బుకింగ్‌ వచ్చింది. దీంతో మారోమారు 200 రోజుల డీఎంఏ స్థాయి కిందకు వచ్చి మద్దతు పొందింది. రూ. 380 స్థాయిల్లో డబుల్‌ బాటమ్‌ ఏర్పడింది. ఇక్కడనుంచి పైకి ఎగిసి స్వల్పకాలిక డీఎంఏలను అధిగమించింది. ఇటీవలే అధోముఖ వాలురేఖను పైవైపుగా ఛేదించుకొని పాజిటివ్‌ బ్రేకవుట్‌ చూపింది. 
2. మారికో: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 382. స్టాప్‌లాస్‌ రూ. 323. నాలుగువారాలుగా రూ. 320- 350 రేంజ్‌లో కదలాడుతోంది. గతవారం ఈ స్థాయిలను దాటి పైవైపుకు బ్రేకవుట్‌ సాధించింది. వాల్యూంలు కూడా బాగున్నాయి. ఆర్‌ఎస్‌ఐ స్టోకాస్టిక్‌ ఇండికేటర్లు పాజిటివ్‌గా కనిపిస్తున్నాయి. చార్టుల్లో మరో అప్‌మూవ్‌ సంకేతాలున్నాయి. రూ. 345- 350 రేంజ్‌లో కొనుగోలు చేయవచ్చు. 
3. ఏసియన్‌ పెయింట్స్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 1520. స్టాప్‌లాస్‌ రూ. 1310. బుల్లిష్‌ ఫ్లాగ్‌ పాటర్న్‌ నుంచి అప్‌ బ్రేకవుట్‌ ఇచ్చి రూ. 1300 స్థాయిని దాటింది. అనంతరం కన్సాలిడేషన్‌కు గురై రూ. 1350- 1390 రేంజ్‌లో కదలాడింది. ఈ సమయంలో ఒక చతురస్రాకార పాటర్న్‌ను ఏర్పరిచింది. ఈ పాటర్న్‌ నుంచి బయటపడితే(రూ. 1390 స్థాయి దాటితే) కొనుగోళ్లు పెరుగుతాయి. 



You may be interested

పీఎస్‌యూ బ్యాంకు షేర్లలో లాభాల స్వీకరణ

Wednesday 18th July 2018

ముంబై:- ప్రభుత్వరంగ బ్యాంకు షేర్లలో బుధవారం లాభాల స్వీకరణ చోటుచేసుకుంటుంది. ఎన్‌పీఏలతో సతమతమవుతున్న ఐదు ప్రభుత్వ రంగ బ్యాంకులకు కేంద్రం రూ.11వేల కోట్ల మూలధనాన్ని సమకూర్చనుందనే వార్తలో క్రితం ట్రేడింగ్‌లో పీఎస్‌యూ బ్యాంకు షేర్లు భారీగా లాభపడిన సంగతి తెలిసిందే. నేటి ట్రేడింగ్‌ ప్రారంభం నుంచే ఇన్వెస్టర్లు పీఎస్‌యూ బ్యాంకు షేర్లలో లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో క్రితం రోజు ఆర్జించిన లాభాలన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. ఎన్‌ఎస్‌ఈలో ఈ రంగ షేర్లకు ప్రాతనిథ్యం

షేర్ల ధర తగ్గింది.. ప్రమోటార్ల వాటా పెరిగింది..

Wednesday 18th July 2018

దేశీ ఈక్విటీ మార్కెట్‌లో జూన్‌ క్వార్టర్‌లో తీవ్ర ఒడిదుడుకులున్నాయి. మరీముఖ్యంగా మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌లో అస్థిరత ఉండేది. బీఎస్‌ఈ సెనెక్స్‌ 6.5 శాతం పెరిగితే బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌లు వరుసగా 4.54 శాతం, 7.83 శాతం క్షీణించాయి. జూన్‌ క్వార్టర్‌లో వివిధ రంగాలకు చెందిన 100కిపైగా కంపెనీల ప్రమోటర్లు తమ తమ సంస్థల్లో వాటాలను పెంచుకున్నారు. ప్రమోటార్లు సాధారంగా స్టాక్‌కు వ్యాల్యు ఉన్నా, బిజినెస్‌లో పాజిటివ్‌ చర్య

Most from this category