STOCKS

News


సాంక్టమ్‌ వెల్త్‌ షార్ట్‌టర్మ్‌ సిఫార్సులు

Friday 10th August 2018
Markets_main1533882929.png-19114

 ఒకటి రెండు నెలల కాలానికి 20 శాతం వరకు రాబడినిచ్చే ఐదు స్టాకులను సాంక్టమ్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ రికమండ్‌ చేస్తోంది...
1. యాక్సిస్‌ బ్యాంక్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 750. స్టాప్‌లాస్‌ రూ. 580. మూడేళ్ల పాటు రూ. 365- 655 రేంజ్‌లో కన్సాలిడేట్‌ అయింది. నెల చార్టుల్లో సౌష్ఠవాకార త్రిభుజాకృతిని ఏర్పరిచింది. తాజాగా అప్‌మూవ్‌ సాధించి నిరోధక ట్రెండ్‌లైన్‌ను దాటేసింది. రెండువారాలుగా వాల్యూంలతో కూడిన అప్‌మూవ్‌ చూపుతోంది. బోలింగర్‌ బ్యాండ్‌, ఆర్‌ఎస్‌ఐ, ఎంఏసీడీ ఇండికేటర్లు పాజిటివ్‌గా మారాయి. 
2. ఇంటలెక్ట్‌ డిజైన్‌ ఎరినా: టార్గెట్‌ రూ. 300. స్టాప్‌లాస్‌ రూ. 237. దీర్ఘకాలిక చార్టుల్లో రూ. 278- 96 స్థాయిలో రౌండింగ్‌ బేస్‌ ఫార్మేషన్‌ చూపింది. ఇటీవల కన్సాలిడేషన్‌ ముగించి అప్‌మూవ్‌ సాధించింది. గత మూడు సెషన్లలో వాల్యూంలతో కూడిన బలమైన ర్యాలీ చూపింది. రూ. 232 వద్ద నెలకొన్న బలమైన నిరోధాన్ని దాటింది. మరోమారు ఆల్‌టైమ్‌ హై రూ. 278ని దాటే దిశగా పయనిస్తోంది. చార్టుల్లో బలమైన మూమెంటమ్‌ కనిపిస్తోంది.
3. కన్సాయ్‌ నెరోలాక్‌ పెయింట్స్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 600. స్టాప్‌లాస్‌ రూ. 490. గత డిసెంబర్‌లో ఆల్‌టైమ్‌ హై రూ. 614ను తాకి క్రమంగా రూ. 465 వరకు క్షీణించింది. రూ. 435- 465 రేంజ్‌లో బహుళ కనిష్ఠాలను ఏర్పరిచి బలమైన మద్దతు సాధించుకుంది. తాజాగా బుల్లిష్‌ ఇన్వర్టెడ్‌ హెడ్‌ అండ్‌ షోల్డర్‌ పాటర్న్‌ ఏర్పరిచింది. తాజా అప్‌మూవ్‌కు వాల్యూంల మద్దతు కూడా ఉంది. బోలింగర్‌ బ్యాండ్‌ పాజిటివ్‌గా విస్తరించింది. ఇతర ఇండికేటర్లు సైతం బుల్లిష్‌గా ఉన్నాయి.
4. ఫిలిప్‌ కార్బన్‌ బ్లాక్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 320. స్టాప్‌లాస్‌ రూ. 265. దీర్ఘకాలిక అప్‌ట్రెండ్‌లో కొనసాగుతూ హయ్యర్‌ టాప్స్‌, బాటమ్స్‌ ఏర్పరుస్తూ వస్తోంది. జనవరిలో ఆల్‌టైమ్‌ హై రూ. 319ని తాకి అనంతరం కరెక‌్షన్‌కు గురై రూ. 188 వరకు దిగివచ్చింది. అక్కడ నుంచి కన్సాలిడేషన్‌లోకి మరలింది. దిగువన డబుల్‌ బాటమ్‌ ఏర్పరిచి మద్దతు పొందింది. రెండు వారాలుగా బుల్లిష్‌గా మారి వాల్యూంలతో కూడిన అప్‌మూవ్‌ చూపుతోంది. గురువారం సెషన్లో ప్రైస్‌ బ్రేకవుట్‌ సాధించింది. ఎంఏసీడీ పాజిటివ్‌ క్రాసోవర్‌ ఏర్పరిచింది. 
5. దీపక్‌ నైట్రేట్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 330. స్టాప్‌లాస్‌ రూ. 265. ఏడాది ఆరంభంలో జీవితకాల గరిష్ఠాన్ని తాకి అనంతరం కరెక‌్షన్‌, కన్సాలిడేషన్‌ చూసింది. రూ. 215- 280 స్థాయిలో ఏడు నెలలుగా కదలాడింది. ఈ వారం బలమైన అప్‌మూవ్‌ను చూపింది. బోలింగర్‌ బ్యాండ్‌ తదితర ఇండికేటర్లు బుల్లిష్‌ ట్రెండ్‌ కొనసాగే సూచనలు ఇస్తున్నాయి. 



You may be interested

జెట్‌ ఎయిర్‌వేస్‌ 10 శాతం డౌన్‌

Friday 10th August 2018

ముంబై:- తొలి త్రైమాసిక ఫలితాల ప్రకటన వాయిదా పడటంతో శుక్రవారం జెట్‌ ఎయిర్‌వేస్‌ షేర్లు నేలచూపులు చూస్తున్నాయి. నేడు బీఎస్‌ఈలో జెట్‌ ఎయిర్‌వేస్‌ షేర్లు రూ.271.55ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. కంపెనీ ఆగస్ట్‌ 09న (నిన్న) నిర్వహించిన బోర్డు సమావేశంలో త్రైమాసిక ఫలితాల విడుదలను వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. అలాగే ఆడిట్‌ ప్యానల్‌ కూడా ఫలితాల ప్రకటనకు నిరాకరించడంతో జెట్‌ ఎయిర్‌వేస్‌ షేర్లు నేటి ట్రేడింగ్‌ ప్రారంభంలోనే 10శాతం వరకు

ఎస్‌బీఐ ఫలితాలు.. ఎలా ఉండొచ్చు?

Friday 10th August 2018

క్యు1 ఫలితాలపై అంచనాలు దేశీయ ప్రభుత్వ బ్యాంకు దిగ్గజం ఎస్‌బీఐ క్యు1 ఫలితాలు శుక్రవారం మధ్యాహ్నం ప్రకటించనుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం ట్రేడింగ్‌లో షేరు దాదాపు 2 శాతం పతనమైంది. గత నెల రోజుల్లో ఈ షేరు సుమారు 19 శాతం ర్యాలీ జరిపింది. గడిచిన మూడు రోజుల్లోనే 3 శాతం పెరిగింది. ఈ నేపథ్యంలో బ్యాంకు ఫలితాలపై మార్కెట్‌ అంచనాలు ఇలా ఉన్నాయి... - రాయిటర్స్‌ పోల్‌ ప్రకారం కేటాయింపులు

Most from this category