STOCKS

News


ఏడాదికాలానికి టాప్‌ రికమండేషన్లు

Wednesday 9th January 2019
Markets_main1547019017.png-23483

వచ్చే సంవత్సర కాలంలో 15- 100 శాతం రాబడినిచ్చే సత్తా ఉన్న టాప్‌ స్టాక్‌ ఐడియాలను బ్రోకరేజ్‌లు రికమండ్‌ చేస్తున్నాయి.
సెంట్రమ్‌ సిఫార్సులు
1. బజాజ్‌ ఆటో: టార్గెట్‌ రూ. 3075. దేశంలో బలమైన ద్వి, త్రి చక్రవాహన ఉత్పత్తిదారు. భారత్‌నుంచి అతిపెద్ద ద్వి, త్రిచక్రవాహన ఎగుమతిదారు. 21 దేశాలకు కంపెనీ తన వాహనాలను ఎగుమతి చేస్తోంది. బలమైన బైక్‌ పోర్టుఫోలియో ఉంది. బీఎస్‌ 4 నిబంధనల అమలు, ట్రాక్టర్‌ విక్రయాలు టాప్‌ అవుట్‌ కావడం తదితర స్వల్ప సమస్యలున్నా, దేశీయ మార్కెట్లో బలంగా కొనసాగుతోంది. 
2. ఎస్‌బీఐ: టార్గెట్‌ రూ. 350. క్రెడిట్‌ పరంగా పరిస్థితులు మెరుగయ్యాయి. ఎన్‌పీఏ అకౌంట్లలో రికవరీ కొనసాగుతోంది. లోన్‌గ్రోత్‌ జోరు చూపుతోంది. ఎన్‌ఐఎం క్రమంగా 2.7 శాతానికి చేరవచ్చని అంచనా. స్లిపేజ్‌లు తగ్గుతున్నాయి. క్యు3, క్యు4లో ఫలితాలు బాగుండవచ్చు. వాల్యూషన్లు ఇప్పటికీ ఆకర్షణీయంగానే ఉన్నాయి. 
కార్వీ సిఫార్సులు
1. హెచ్‌సీఎల్‌టెక్‌: టార్గెట్‌ రూ. 1167. ఇటీవల కాలంలో మెరుగైన ప్రదర్శన జరుపకున్నా, రెవెన్యూ ఉత్పత్తిలో మంచి సత్తా ఉంది. ఆర్గానిక్‌ వృద్ది ఊపందుకోవడం, కొత్త ఉత్పత్తులు, ప్లాట్‌ఫామ్‌ల కారణంగా ఎర్నింగ్స్‌లో రీరేటింగ్‌ ఉండొచ్చు. ఐఎంబీ డీల్‌తో బడా డీల్స్‌ మరిన్ని కుదుర్చుకునే సత్తా కనిపిస్తోంది. త్వరలో స్టాక్‌ ధరకు రీరేటింగ్‌ లభించే అవకాశాలున్నాయి. 
2. హెచ్‌యూఎల్‌: టార్గెట్‌ రూ. 2138. జీఎస్‌కే కన్జూమర్‌ను సొంతం చేసుకోవడంతో వాల్యూషన్‌ మరింత పెంచుకుంది. వైవిధ్యభరిత పోర్టుఫోలియోతో దూసుకుపోతోంది. వ్యయ నియంత్రణా విధానాలు ఫలితాలు ఇస్తున్నాయి. 
3. ఐసీఐసీఐ బ్యాంకు: టార్గెట్‌ రూ. 440. రికవరీ బాటలో ఉంది. స్థిరమైన కోర్‌ ఆపరేటింగ్‌ గణాంకాలు నమోదు చేస్తోంది. ఎన్‌పీఏల్లో మెరుగుదల కనిపిస్తోంది. రిటైల్‌ స్లిపేజ్‌లు తగ్గుముఖం పట్టాయి. 
4. ఎల్‌అండ్‌టీ: టార్గెట్‌ రూ. 1700. వివిధ రంగాల్లో, వివిధ ప్రాంతాల్లో ప్రాజెక్టులు నిర్వహిస్తోంది. తోటి కంపెనీలతో పోలిస్తే బలమైన బాలెన్స్‌ షీటు ఉంది. ఆర్డర్‌ బుక్‌ కిక్కిరిసిపోతోంది. క్యాపెక్స్‌ సైకిల్‌ రికవరీ జాప్యం అయితే కాస్త రిస్కు ఎదుర్కోవాల్సిఉంటుంది.
5. ఓఎన్‌జీసీ: టార్గెట్‌ రూ. 210. బలమైన ఫలితాలు నమోదు చేస్తోంది. హెచ్‌పీసీఎల్‌, ఎంఆర్‌పీఎల్‌ సొంతం చేసుకోవడంతో వాల్యూ అన్‌లాకింగ్‌ జరగవచ్చు. మార్జిన్లు మరింత పెరిగే ఛాన్సులున్నాయి.
6. టాటామోటర్స్‌: టార్గెట్‌ రూ. 259. లగ్జరీ కార్ల డిమాండ్‌ సన్నగిల్లడంతో స్వల్పకాలానికి మార్జిన్లపై ఒత్తిడి ఉండొచ్చు. కానీ దీర్ఘకాలానికి మేనేజ్‌మెంట్‌ తీసుకునే చర్యలు ఫలితాలిస్తాయి. ఇటీవల స్టాకులో వచ్చిన కరెక‌్షన్‌తో వాల్యూషన్లు చాలా ఆకర్షణీయంగా మారాయి. జేఎల్‌ఆర్‌ వ్యాపారంలో క్రమానుగత వృద్ది ఉంటుందని అంచనా. 
7. యస్‌బ్యాంక్‌: టార్గెట్‌ రూ. 410. గత త్రైమాసికంలో నిరాశాపూరిత ఫలితాలు చూపింది. అసెట్‌ క్వాలిటీ సైతం పేలవంగా మారింది. స్లిపేజ్‌లు అనుకున్నదానికన్నా ఎక్కువయ్యాయి. కానీ ఇకమీదట బ్యాంకు మంచి రికవరీ చూపే ఛాన్సులు కనపడుతున్నాయి. వాల్యూషన్లు కూడా బాగానే ఉన్నాయి. You may be interested

జీవితకాల గరిష్టానికి ఐసీఐసీఐ

Wednesday 9th January 2019

ఐసీఐసీఐ బ్యాంకు షేరు బుధవారం కొత్త జీవిత కాల గరిష్టాన్ని నమోదు చేసింది. బ్రోకరేజ్‌ సంస్థ మోర్గాన్‌ స్టాన్లీ షేరు టార్గెట్‌ ధరను పెంచడం ఇందుకు తోడ్పాటును అందించింది. బ్యాంకు ఆస్తుల నాణ్యతో పాటు, ఆదాయాలు క్రమంగా వృద్ధి చెందాయి. కావున షేరు టార్గెట్‌ ధరను రూ.460ల నుంచి రూ.510లకు పెంచుతున్నాయి. అలాగే ఇదివరకు షేరుకు కేటాయించిన అండర్‌ వెయిట్‌ రేటింగ్‌ను యథాతధంగా కొనసాగిస్తున్నామని మోర్గాన్‌ స్టాన్లీ తన నివేదికలో

ఇన్ఫోసిస్‌కు బైబ్యాక్‌ బూస్టింగ్‌

Wednesday 9th January 2019

3శాతం ర్యాలీ చేసిన షేర్లు షేర్ల బై బ్యాక్‌ అంశం తెరపైకి రావడంతో సాంకేతిక సేవల సంస్థ ఇన్ఫోసిస్‌ షేర్లు బుధవారం 3శాతం లాభపడ్డాయి. ఇన్వెస్టర్ల, ప్రమోటర్లు నుంచి ఈక్విటీ షేర్లను తిరిగి కొనుగోలు చేసే ప్రక్రియ(బై బ్యాక్‌) అంశంపై చర్చించేందుకు కంపెనీ బోర్డు జనవరి 11న బోర్డు సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ మేరకు మంగళవారం మార్కెట్‌ ముగింపు అనంతరం ఇన్ఫోసిస్‌ ఒక ప్రకటనలో తెలిపింది. ఫలితంగా నేడు బీఎస్‌ఈలో ఇన్ఫోసిస్‌

Most from this category