STOCKS

News


75% వరకు రాబడికి 7 సిఫార్సులు

Tuesday 27th November 2018
Markets_main1543315125.png-22420

వచ్చే 6-18 నెలల కాలంలో మంచి రాబడిని ఇవ్వగలిగిన 7 షేర్లను పలు ప్రముఖ బ్రోకింగ్‌ కంపెనీలు సిఫార్సుచేస్తున్నాయి. దీర్ఘకాల పెట్టుబడి లక్ష్యంతో ఈ షేర్లలో ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా 75 శాతం వరకు రాబడిని పొందవచ్చని సూచిస్తున్నాయి. 

ఆర్తి డ్రగ్స్ | బ్రోకరేజ్ సంస్థ: ఆనంద్ రాఠీ | రేటింగ్: కొనొచ్చు | టార్గెట్ ధర: రూ.745 | రాబడి అంచనా: 36 శాతం
కంపెనీ సామర్ధ్య పెంపు, నూతన ఉత్పత్తుల విడుదల, పెరుగుతున్న మార్కెట్‌ వాటా అంశాల ఆధారంగా ఈ షేరను సిఫార్సు చేస్తున్నట్లు ఆనంద్ రాఠీ వెల్లడించింది. 2018-21 ఆర్థిక సంవత్సరాలలో ఆదాయం, నికర లాభం.. 14 శాతం, 21 శాతం చొప్పున చక్రగతి వృద్ధిరేటును సాధించవచ్చని అంచనావేసింది.

జామ్నా ఆటో ఇండస్ట్రీస్ | బ్రోకరేజ్ సంస్థ: స్టీవర్ట్ & మేకర్టిచ్ | రేటింగ్: కొనొచ్చు | టార్గెట్ ధర: రూ.128 | రాబడి అంచనా: 75 శాతం
అత్యాధునిక టెక్నాలజీతో ఉత్పత్తులను విడుదలచేస్తున్న ఈ కంపెనీ మార్కెట్‌ వాటా పెరుగుతోందని బ్రోకరేజ్‌ సంస్థ విశ్లేషించింది. 2018 నుంచి ఈపీఎస్‌ 19 శాతం చొప్పున చక్రగతి వృద్ధిరేటును సాధిస్తుందని అంచనా. 2021లో రూ.6.4గా వెల్లడించింది.

ఆస్ట్రల్ పోలీ టెక్నిక్ | బ్రోకరేజ్ సంస్థ: ఈస్ట్ ఇండియా సెక్యూరిటీస్ | రేటింగ్: అక్యూమిలేట్‌ | టార్గెట్ ధర: రూ.1,184 | రాబడి అంచనా: 12.5 శాతం
సీపీవీసీ పైపుల ధరలను 3-4 శాతం పెంచింది. పాలిమర్‌ ప్రొడక్ట్‌ పోర్టిఫోలియోను బలపేతం చేస్తున్నట్లు విశ్లేషించింది. కంపెనీ గైడెన్స్‌ 15 శాతంగా యాజమాన్యం వెల్లడించినట్లు తెలిపింది.

మారికో | బ్రోకరేజ్ సంస్థ: ఐసీఐసీఐ డైరెక్ట్‌ | రేటింగ్: కొనొచ్చు | టార్గెట్ ధర: రూ.410 | రాబడి అంచనా: 16 శాతం
వస్తు సేవల పన్ను అమలు అనంతరం.. అసంఘటిత నూనెల మార్కెట్‌లో ఈ సంస్థ అత్యధిక ప్రయోజనాన్ని పొందింది. 2018-20 ఆర్థిక సంవత్సరాలలో అంచనా ఆదాయం 16.6, నికర లాభం 22.5 చొప్పున చక్రగతి వృద్ధిరేటును సాధిస్తుందని అంచనా.

హిమాద్రి స్పెషాలిటీ | బ్రోకరేజ్ సంస్థ: ఐసీఐసీఐ డైరెక్ట్‌ | రేటింగ్: కొనొచ్చు | టార్గెట్ ధర: రూ.160 | రాబడి అంచనా: 16 శాతం
2018-20 ఆర్థిక సంవత్సరాల్లో అమ్మకాల వృద్ధి 23.4 చొప్పున చక్రగతి వృద్ధిరేటును సాధిస్తుందని అంచనా. 

సింపుల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ | బ్రోకరేజ్ సంస్థ: ఐసీఐసీఐ డైరెక్ట్‌ | రేటింగ్: హోల్డ్ | టార్గెట్ ధర: రూ.230 | రాబడి అంచనా: 7 శాతం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.7,000-8,000 కోట్ల ఆర్డర్‌ ఇన్‌ఫ్లో ఉండనుందని యాజమాన్యం ధీమా వ్యక్తం చేస్తున్నట్లు తెలిపింది. 

షైలీ ఇంజినీరింగ్ ప్లాస్టిక్స్ | బ్రోకరేజ్ సంస్థ: ఐసీఐసీఐ డైరెక్ట్‌ | రేటింగ్: కొనొచ్చు | టార్గెట్ ధర: రూ.1,120 | రాబడి అంచనా: 25 శాతం
సామర్థ్యంలో పెంపు వల్ల అమ్మకాలు 2.3 రెట్లు పెరగవచ్చని అంచనావేసింది. ఫార్మా ప్యాకేజింగ్‌, ఫర్నీచర్‌ విభాగంలో వృద్ధి ఉండనుందని భావిస్తోంది.

ఇవి కేవలం విశ్లేషకులు అభిప్రాయాలు మాత్రమే. ఇన్వెస్టర్లు తమ సొంత అధ్యయనం తరువాత మాత్రమే తుది నిర్ణయం తీసుకోవడం మంచిదని సాక్షీబిజినెస్‌డాట్‌కామ్‌ సూచన.



You may be interested

ఎఫ్‌డీఏ నిర్ణయంతో ఈ ఫార్మా కంపెనీలకు ప్లస్‌

Wednesday 28th November 2018

అమెరికాలోని మోర్గాన్‌టౌన్‌లోని మైలాన్‌ ప్లాంట్‌కు యూఎస్‌ఎఫ్‌డీఏ హెచ్చరిక లేఖ జారీ చేయడం మూడు భారత ఫార్మా కంపెనీలకు కలిసొస్తుందని మోతీలాల్‌ ఓస్వాల్‌ సంస్థ ఓ నివేదికలో వెల్లడించింది. మైలాన్‌ కేంద్రంలో ఉత్పత్తి తగ్గడం వల్ల సన్‌ఫార్మా, అరబిందో ఫార్మా, క్యాడిలా హెల్త్‌కేర్‌ కంపెనీలు లాభపడతాయని విశ్లేషించింది. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్‌ నెలల్లో ఇక్కడ ఎఫ్‌డీఏ తనిఖీలు నిర్వహించి, ఫామ్‌ 483 జారీ చేసింది. ఇందులో 13 అభ్యంతరాలను వ్యక్తం

10650 పైన నిఫ్టీ

Tuesday 27th November 2018

రెండో రోజూ లాభాల ముగింపే రాణించిన ఐటీ, బ్యాంకింగ్‌ షేర్లు మిడ్‌సెషన్‌ నుంచి పెరిగిన కొనుగోళ్లతో మార్కెట్‌ మంగళవారం లాభాలతో ముగిసింది. ఐటీ, ఆర్థిక, బ్యాంకింగ్‌ రంగ షేర్లతో సూచీలు వరుసగా రెండో లాభపడ్డాయి. నిఫ్టీ 10650పైన, సెన్సెక్స్‌ 35500ల పైన ముగిశాయి. అంతర్జాతీయ పరిణామాలు అంతంత మాత్రంగా ఉండటంతో మిడ్‌సెషన్‌ వరకు లాభనష్టాల మధ్య ఊగిసలాడిన సూచీలు అనంతరం స్థిరమైన ర్యాలీ చేశాయి. చివరి గంటలో పెరిగిన కొనుగోళ్లతో సూచీలు మరిన్ని లాభాలను

Most from this category