STOCKS

News


2–3 వారాలకు ఈ షేర్లు చూడొచ్చు

Monday 28th January 2019
Markets_main1548672382.png-23853

2–3 వారాల్లో రాబడులకు అవకాశం వున్న   షేర్లపై వివిధ అనలిస్టులు రూపొందించిన అంచనాలివే..

అనలిస్ట్‌: మజార్‌ మహ్మద్, చీఫ్‌ స్ట్రాటజిస్ట్, చార్ట్‌వ్యూ ఇండియా

దీపక్‌ ఫెర్టిలైజర్స్‌

సిఫార్సు: బై,  టార్గెట్‌: రూ. 135, స్టాప్‌లాస్‌: రూ. 104


 కొద్ది వారాలుగా రూ. 147 స్థాయి నుంచి రూ. 104 వరకూ నిలువునా పతనమైన దీపక్‌ ఫెర్టిలైజర్స్‌ ఇటీవల ఓవర్‌సోల్డ్‌ స్థాయి నుంచి బ్రేక్‌అవుట్‌ సాధించింది. ట్రేడర్లు ప్రస్తుత ధరలోగానీ, లేదా స్వల్పంగా తగ్గినపుడుగానీ కొనుగోలు చేసి రూ. 104 స్టాప్‌లాస్‌తో రూ. 135 టార్గెట్‌ ధర కోసం అట్టిపెట్టవచ్చు. 


కేస్ట్రాల్‌


సిఫార్సు: బై, టార్గెట్‌: రూ. 179, స్టాప్‌లాస్‌: రూ. 160

ఇటీవలి కనిష్టస్థాయి రూ. 151 నుంచి రూ. 169 వరకూ కేవలం రెండు సెషన్లలో జరిపిన వేగవంతమైన ర్యాలీ తర్వాత స్వల్ప విరామాన్ని ఈ షేరు తీసుకుంది. ఈ ర్యాలీతో 200 రోజుల మూవింగ్‌ ఏవరేజ్‌ను అధిగమించినందున, ప్రస్తుత స్థాయి వద్ద కేస్ట్రాల్‌ షేరును కొనుగోలుచేసి రూ. 179 టార్గెట్‌ ధర కోసం రూ. 160 స్టాప్‌లాస్‌తో హోల్డ్‌ చేయవచ్చు.  

అనలిస్ట్‌: నాగరాజ్‌ షెట్టి, టెక్నికల్‌ అనలిస్ట్, హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌

హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌

సిఫార్సు:  కొనొచ్చు. టార్గెట్‌: రూ. 1065, స్టాప్‌లాస్‌: రూ. 905


గత కొద్ది వారాలుగా ఈ షేరు కన్సాలిడేషన్‌ బ్యాండ్‌లో కదులుతోంది. ఈ బ్యాండ్‌కు అప్పర్‌ ఏరియా అయిన రూ. 980–990 స్థాయిని దాటేందుకు ఇటీవల ఒక విఫలయత్నం చేసినప్పటికీ, గత శుక్రవారం ఈ కౌంటర్‌లో కొనుగోళ్ల ఆసక్తి కన్పించింది. వీక్లీ ఆస్కిలేటర్స్‌లో మూమెంటమ్‌ పాజిటివ్‌గా వుంది.  

హవెల్స్‌ ఇండియా 

సిఫార్సు: బై,  టార్గెట్‌: రూ. 775, స్టాప్‌లాస్‌: రూ. 655

కొద్దివారాలపాటు క్రమేపీ బలహీనపడిన హవెల్స్‌ షేరు గతవారం జోరుగా పెరిగింది. క్రితం గరిష్టస్థాయి అయిన రూ. 716 స్థాయిని బ్రేక్‌ చేసేందుకు ప్రస్తుతం ఈ షేరు ప్రయత్నిస్తున్నది. ఆర్‌ఎస్‌ఈ ఇండికేటర్‌ సైతం హవెల్స్‌ మరింత పెరగవచ్చని సంకేతాలు అందిస్తున్నది. 


అనలిస్ట్‌: సమీత్‌ చవాన్, చీఫ్‌ అనలిస్ట్, ఏంజిల్‌ బ్రోకింగ్‌

గాడ్‌ఫ్రే ఫిలిప్స్‌

సిఫార్సు: బై,  టార్గెట్‌: రూ. 1020, స్టాప్‌లాస్‌: రూ. 914

ఈ హై బీటా స్టాక్‌కు గత మూడు నెలలూ బాగా కలిసివచ్చింది. వరుసగా హయ్యర్‌ హైలు, హయ్యర్‌ లోలు డైలీ చార్టుల్లో కన్పిస్తున్నాయి. ఈ క్రమంలో ఇటీవల రూ. 930 సమీపంలో వున్న ట్రెండ్‌లైన్‌ అడ్డంకిని అధిగమించింది. ఈ సమయంలో భారీ ట్రేడింగ్‌ నమోదయ్యింది. ప్రస్తుతం కన్సాలిడేట్‌ అవుతూ, కొనుగోలు సంకేతాల్ని అందిస్తోంది. 
 

బ్రిటానియా ఇండస్ట్రీస్‌

సిఫార్సు: బై, టార్గెట్‌: రూ. 3460, స్టాప్‌లాస్‌: రూ. 3060

కొద్ది సంవత్సరాలుగా స్థిరమైన పనితీరును కనపరుస్తున్న ఈ ఎఫ్‌ఎంసీజీ షేరు ఇటీవల కరెక్టివ్‌ కన్సాలిడేషన్‌ బాట పట్టింది. గత వారం ఈ కౌంటర్లో తిరిగి కొనుగోలు ఆసక్తి మొదలుకావడంతో రూ. 3180 సమీపంలో వున్న ఫాలింగ్‌ ట్రెండ్‌లైన్‌ను అధిమించగలిగింది. సమీప భవిష్యత్తులో ఈ షేరు మరింత పెరుగుతుందనడానికి ఇది సంకేతం. 
 You may be interested

డెబిట్‌ కార్డు కేవలం ఏటీఎం కోసమే కాదు..!

Monday 28th January 2019

డెటిట్‌ కార్డును మన దేశంలో ఇప్పటికీ ఎక్కువ మంది ఏటీఎం కార్డుగానే భావిస్తున్నారు. కేవలం ఏటీఎంల నుంచి డబ్బుల ఉపసంహరణ కోసమే వినియోగిస్తున్నారు. డెబిట్‌ కార్డులను అన్ని రకాల డిజిటల్‌ లావాదేవీలు, కొనుగోళ్లకు వినియోగించుకోవచ్చన్న విషయం తెలిసిన వారు తక్కువే! ఆర్‌బీఐ గణాంకాల ప్రకారం మన దేశంలో 99 కోట్లకు పైగా డెబిట్‌ కార్డులు వినియోగంలో ఉన్నాయి. ఇందులో 70 శాతం కార్డులు అంటే సుమారు 70 కోట్ల కార్డులను

ఆగని గ్రాఫైట్‌ షేర్ల పతనం

Monday 28th January 2019

గ్రాఫైట్‌ షేర్లలో పతనం ఆగడం లేదు. చైనా నుంచి దిగుమతయ్యే గ్రాఫైట్‌ ఎలక్ట్రోడ్స్‌పై 2018 సెప్టెంబర్‌లో యాంటీ డంపింగ్‌ డ్యూటీ ఎత్తివేయడంతో పాటు స్టీల్‌ ధరల్లో తగ్గుదల కారణంగా గ్రాఫైట్‌ వినియోగం తగ్గుతుందన్న అంచనాలతో  గ్రాఫైట్‌ షేర్లు తీవ్రఅమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోంటున్నాయి. ఈ రంగానికి చెందిన గ్రాఫైట్‌ ఇండియా, హెచ్‌ఈజీ లిమిటెడ్‌ షేరు నేటి ట్రేడింగ్‌లో తాజాగా 52వారాల కనిష్టానికి పడిపోయాయి. గ్రాఫైట్‌ ఇండియా నేటి ట్రేడింగ్‌లో 15శాతం పతమైన చివరికి 9.30శాతం

Most from this category