News


స్వల్పకాలానికి సిఫార్సులు

Monday 13th May 2019
Markets_main1557740838.png-25710

వచ్చే రెండు మూడు వారాల సమయానికి మంచి రాబడినిచ్చే స్టాకులను ప్రముఖ బ్రోకింగ్‌ సంస్థలు రికమండ్‌ చేస్తున్నాయి.
ఎపిక్‌ రిసెర్చ్‌ సిఫార్సులు
1. కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 1430. స్టాప్‌లాస్‌ రూ. 1360. స్టాకు అప్‌ట్రెండ్‌లో ఉంది. హయ్యర్‌హై, లో ఏర్పరుస్తూ సాగుతోంది. తాజాగా వచ్చిన స్వల్పకాలిక పతనంలో 20 రోజుల డీఎంఏ వద్ద మద్దతు తీసుకుంది. ఈ స్థాయిల నుంచి త్వరలో అప్‌మూవ్‌ కొనసాగించనుంది.
2. ఎంఅండ్‌ఎం: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 658. స్టాప్‌లాస్‌ రూ. 613. డైలీ చార్టుల్లో డబుల్‌ బాటమ్‌ ఏర్పరుచుకుంది. తాజాగా రివర్సల్‌ క్యాండిల్‌స్టిక​ పాటర్న్‌ ఏర్పరిచింది. త్వరలో అప్‌ట్రెండ్‌ ఆరంభించవచ్చు.
ఎంఎస్‌టీఏ సిఫార్సులు
1. లిండె ఇండియా: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 560. స్టాప్‌లాస్‌ రూ. 485. ఇటీవల వేగంగా పతనమైన స్టాకు రూ. 420 ప్రాంతంలో మద్దతు పొందింది. చార్టుల్లో త్రిభుజాకార పాటర్న్‌ నుంచి బ్రేకవుట్‌ ఇచ్చే యత్నాల్లో ఉంది. ఆర్‌ఎస్‌ఐ బుల్లిష్‌ సంకేతాలు ఇస్తోంది. 
2. రేమండ్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 850. స్టాప్‌లాస్‌ రూ. 775. స్టాకు చార్టుల్లో హయ్యర్‌ బాటమ్స్‌ ఏర్పరుస్తోంది. సోకాస్టిక్‌ సంకేతాలు పాజిటివ్‌గా ఉన్నాయి. ఎంఏసీడీలో బుల్లిష్‌క్రాసోవర్‌ ఏర్పడింది. త్వరలో అప్‌మూవ్‌ ఉండొచ్చు. 
హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ సిఫార్సులు
1.జీఎస్‌ఎఫ్‌సీ: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 108. స్టాప్‌లాస్‌ రూ. 90. డైలీ చార్టుల్లో హామర్‌ క్యాండిల్‌పాటర్న్‌ ఏర్పరిచింది. బుల్లిష్‌ రివర్సల్‌కు ఇది సంకేతం. వేవ్‌ థియరీ ప్రకారం వేవ్‌ సి ఆరంభం కానుంది. ఇది బుల్లిష్‌గా ఉంటుంది.
2. పీసీ జువెలర్స్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 143. తాజా పతనంలో మూడు వేవ్స్‌ను పూర్తి చేసింది. ఇకపై అప్‌ వేవ్‌ను ఆరంభించాల్సిఉంది. ఇందుకు సంకేతంగా హయ్యర్‌ బాటమ్స్‌, టాప్స్‌ ఏర్పరుస్తోంది.
ఏంజిల్‌ బ్రోకింగ్‌ సిఫార్సులు
1. బీఈఎంఎల్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 900. స్టాప్‌లాస్‌ రూ. 812. ఏప్రిల్‌లో ఆరంభమైన కరెక‌్షన్‌ తాజాగా బుల్లిష​ రివర్సల్‌ క్యాండిల్‌ ఏర్పాటుతో ముగిసింది. చార్టుల్లో మార్నింగ్‌స్టార్‌ ఏర్పడడం త్వరలో అప్‌మూవ్‌ ఉంటుందనేందుకు సంకేతం. ఆర్‌ఎస్‌ఐ పాజిటివ్‌గా ఉంది. 
2. హైడెల్‌బర్గ్‌ సిమెంట్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 204. స్టాప్‌లాస్‌ రూ. 167. మార్చిలో బ్రేకవుట్‌ సాధించి వెంటనే కన్సాలిడేషన్‌ మూడ్‌లోకి వెళ్లింది. ఈ వారం తిరిగి బలమైన అప్‌మూవ్‌ యత్నాలు ఆరంభించింది. ఇండికేటర్లన్నీ బుల్లిష్‌గా మారుతున్నాయి.



You may be interested

ఐటీసీ లాభంలో 18 శాతం వృద్ధి

Monday 13th May 2019

ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం ఐటీసీ మార్చి త్రైమాసికంలో అంచనాలను మించిన ఫలితాలు ప్రకటించింది. కంపెనీ నికరలాభం 18 శాతం పెరిగి రూ. 2932.7 కోట్ల నుంచి రూ. 3482 కోట్లను చేరింది. ఇదే సమయంలో రెవెన్యూ 13 శాతం పెరిగి రూ. 11992 కోట్లను చేరింది. కంపెనీ ఎబిటా రూ. 4572 కోట్లకు చేరగా మార్జిన్లు 38.1 శాతంగా నమోదయ్యాయి. కంపెనీ సిగరెట్‌ విక్రయాలు 11 శాతం పెరుగుదలతో రూ. 5486కోట్లను

నష్టాల బాటలో అటో షేర్లు

Monday 13th May 2019

మార్కెట్‌ పతనంలో భాగంగా అటోరంగ షేర్లు నష్టాల బాట పట్టాయి. ఎన్‌ఎన్‌ఈసీలో అటోరంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ నేడు 1శాతం క్షీణించింది. గత సంవత్సరపు చివరి త్రైమాసికంలో పలు వాహన కంపెనీల ప్రకటించిన ఫలితాలు ఆశించిన స్థాయిలో నమోదు కావడంతో ఏప్రిల్‌లో వాహన విక్రయాలు క్షీణించనట్లు సియామ్‌, ఎఫ్‌ఏడీఏ సంస్థలు గణాంకాలను విడుదల చేయడంతో నేడు వాహన కంపెనీ షేర్లపై అమ్మకాల ఒత్తిడి నెలకొంది. క్యూ4

Most from this category