STOCKS

News


హిస్టరీ రిపీట్‌ అయితే ర్యాలీ!!

Thursday 8th November 2018
Markets_main1541657038.png-21787

గత రెండు నెలలుగా ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ బేర్‌ గుప్పిట్లో ఉంది. నిఫ్టీ తన గరిష్ట స్థాయి నుంచి 14 శాతానికిపైగా పతనమైంది. రూపాయి క్షీణత, క్రూడ్‌ ధరల పెరుగుదల, వాణిజ్య లోటు విస్తరణ, లిక్విడిటీ భయాలు వంటి అంశాలు మార్కెట్‌లో ఒడిదుడుకులకు కారణమయ్యాయి. అయితే దీర్ఘకాల ఇన్వెస్టర్లు మార్కెట్‌పై ఇంకా నమ్మకాన్ని కోల్పోలేదు. గత 12 ఏళ్లలో చూస్తే.. ఇండెక్స్‌ దాదాపు 14 శాతం మేర పతనమైన ప్రతీసారి.. తర్వాతి మూడు నెలల కాలంలో మళ్లీ రికవరీ అయ్యింది. ఈ విషయాన్ని ఎలరా సెక్యూరిటీస్‌ తన నివేదికలో పేర్కొంది. అయితే 2008-09 మాత్రం దీనికి మినహాయింపు. అప్పుడు అంతర్జాతీయంగా ఆర్థిక మాంద్య పరిస్థితులు నెలకొన్నాయి.
నిఫ్టీ ప్రస్తుతం అక్టోబర్‌ 26 నాటి తన రెండు నెలల కనిష్ట స్థాయి నుంచి చూస్తే దాదాపు 5 శాతంమేర రికవరీ అయ్యింది. 2006 నుంచి చూస్తే 15 సార్లు (2008-09 మినహా) ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్లు 10 శాతానికిపైగా పడిపోయాయి. ఇలాంటి కరెక‌్షన్స్‌లో సగటున చూస్తే నిప్టీ 14 శాతమేర పతనమైంది. సగటున చూస్తే ఈ కరెక‌్షన్లు 58 రోజులు కొనసాగాయి. ప్రతి కరెక‌్షన్‌ తర్వాత నిఫ్టీ మూడు నెలల కాలంలో రికవరీ అయ్యింది. ఈ 15 కరెక‌్షన్ల తర్వాత నిఫ్టీ ఆరు నెలల కాలంలో 11 సార్లు మళ్లీ గరిష్ట స్థాయిలకు చేరింది. అయితే రెండు కరెక‌్షన్ల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. 2012లోని కరెక‌్షన్‌ 105 రోజులపాటు కొనసాగింది. యూరోజోన్‌ సంక్షోభం ఇందుకు కారణం. 2015లోని కరెక‌్షన్‌ 125 రోజులపాటు ఉంది. చైనా ఆర్థిక వృద్ధి మందగమనం, క్రూడ్‌ ధరలు పడిపోవడం, ఎన్‌పీఏల పెరుగుదల వంటి అంశాలు ఇందుకు కారణం. ఇలాంటి సందర్భాల్లో నిఫ్టీ తన గరిష్ట స్థాయిలను చేరుకోవడానికి ఆరు నెలల కాలం పట్టింది. నిఫ్టీ నాలుగు సందర్భాల్లో ఆరు నెలల తర్వాత కూడా గరిష్ట స్థాయిని అందుకోలేకపోయింది.
వివిధ అంశాలు ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌లో రికవరీని సూచిస్తున్నాయని నిపుణులు పేర్కొంటున్నాయి. ‘ప్రస్తుత స్థాయిల నుంచి మార్కెట్‌ రీబౌండ్‌ అవుతుందని అంచనా వేస్తున్నాం. వ్యాల్యుయేషన్స్‌ ఆమోదయోగ్యంగా ఉండటం, క్రూడ్‌ ధరలు దిగిరావడం, కరెన్సీ క్షీణత నెమ్మదించడం, ఐటీ/ఫార్మా వంటి రంగాలు అండర్‌పర్ఫార్మ్‌ చేయడం, మెటల్స్‌ ర్యాలీ చేయడం, మార్కెట్‌ ఒడిదుడుకులు తగ్గడం వంటి అంశాలు ఇందుకు కారణం’ అని ఎలరా సెక్యూరిటీస్‌ హెడ్‌ (ఇన్‌స్టిట్యూషనల్‌ ఈక్విటీ రీసెర్చ్‌) రవి ముత్తుకృష్ణన్‌ తెలిపారు. ఇటీవలి కరెక‌్షన్‌ సమయంలో ఏసియన్‌ పెయింట్స్‌, బ్రిటానియా ఇండస్ట్రీస్‌, కోల్గేట్‌, గ్లాక్సోస్మిత్‌క్లైన్‌ ఫార్మా, కెన్సాయ్‌ నెరొలాక్‌, డాబర్‌, మారికో వంటి షేర్లు మంచి పనితీరు కనబర్చాయి.You may be interested

ఎస్‌బీఐకి హెచ్‌డీఎఫ్‌సీ బై రేటింగ్‌

Thursday 8th November 2018

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ తాజాగా ప్రభుత్వ రంగ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) షేరును కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. ఎందుకో చూద్దాం.. బ్రోకరేజ్‌: హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ షేరు: ఎస్‌బీఐ రేటింగ్‌: కొనొచ్చు ప్రస్తుత ధర: రూ.286 టార్గెట్‌ ప్రైస్‌: రూ.352 హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌.. ఎస్‌బీఐపై పాజిటివ్‌గా ఉంది. ఈ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. టార్గెట్‌ ప్రైస్‌ను రూ.352గా నిర్ణయించింది. బ్యాంక్‌ క్యూ2 ఎర్నింగ్స్‌ అంచనాలకు మించి ఉన్నా కూడా నాణ్యత

అంచనాలను మించిన చైనా వాణిజ్య గణాంకాలు

Thursday 8th November 2018

రెండో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా పేరున్న చైనాలో అక్టోబర్‌ నెల ఎగుమతి, దిగుమతి గణాంకాలు ఆర్థికవేత్తల అంచనాలకు మించి నమోదయ్యాయి. అంతకముందు ఏడాదితో పోలిస్తే ఎగుమతులు 15.6 శాతం, దిగుమతులు 21.4శాతం వృద్ధిని సాధించినట్లు చైనా కస్టమ్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. విశ్లేషకులు అక్టోబర్‌లో ఎగుమతులు 11శాతం, దిగుమతులు 14శాతం వృద్ధిని నమోదు చేస్తాయని అంచనా వేశారు. అయితే ఇదే అక్టోబర్‌లో వాణిజ్య మిగులు మాత్రం ఆర్థికవేత్తల అంచనాలను అందుకోలేకపోయింది. ఈ

Most from this category