STOCKS

News


శుక్రవారం వార్తల్లోని షేర్లు

Friday 7th December 2018
Markets_main1544157828.png-22714

వివిధ వార్తలకు అనుగుణంగా శుక్రవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు ఇవి
ఖాదీం ఇండియా:- రూ.30 కోట్ల వాణజ్య పేపర్ల జారీ ఇష్యూకు బోర్డు ఆమోదం తెలిపింది.
కేడిల్లా హెల్త్‌కేర్‌, జైడస్‌వెల్‌నెస్‌:- కేడిల్లా హెల్త్‌కేర్‌ తన అనుబంధ సంస్థ జైడస్‌ వెల్‌నెస్‌ ‘‘షేర్‌ సబ్‌స్క్రిప్షన్‌ అగ్రీమెంట్‌’’ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఒప్పందంలో భాగంగా కంపెనీ జైడస్‌ కంపెనీకి చెందిన 85లక్షల ఈక్విటీ షేర్లను ప్రతిషేరు ధర రూ.1,382ల వద్ద సబ్‌స్క్రెబ్‌ చేసుకుంది.
సాగర్‌ సిమెంట్స్‌:- ఈ నవంబర్‌లో కంపెనీ మొత్తం అమ్మకాలు 36.29శాతనికి పెరిగాయి. సంవత్సరం ప్రాతిపాదికన గతేడాది ఇదే నవంబర్‌లో మొత్తం 2,31,202 మిలియన్‌ టన్నుల అమ్మకాలు జరగ్గా, ఈ ఏడాది నవంబర్‌లో కంపెనీ 3,15106 మిలియన్‌ టన్నుల సిమెంట్‌ను విక్రయించినట్లు స్టాక్‌ ఎక్చే‍్సంజ్‌లకు సమాచారం ఇచ్చింది.
విప్రో:- ఆల్‌ఫ్రాస్కో సంస్థతో కలిసి డిజిటల్‌ అనుసంధాన సేవలు అందించేందుకు భాగస్వామ్య ఒప్పందాన్ని కుదర్చుకుంది.
పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌:- బాసెల్‌-III నిబంధలకు అనుగుణంగా కంపెనీ రూ.1500 కోట్ల విలువైన బాండ్లను జారీ చేసేందుకు బోర్డును అనుమతులు దక్కించుకుంది. అలాగే రూ.500 కోట్ల విలువైన క్యూఐపీ ఇష్యూకు సైతం బోర్డు ఆమోదం తెలిపింది.
హడ్కో:- బాండ్డ జారీ ద్వారా కంపెనీ రూ.1000 కోట్లను సమీకరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుంది.
కోల్‌ ఇండియా:- కంపెనీలో ప్రభుత్వం తన మొత్తం వాటా 72.9శాతంలో నుంచి 2.2శాతం వాటాను విక్రయించింది.
రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌ కార్పోరేషన్‌:- మహారాష్ట్ర ప్రభుత్వంతో కలిసి జాయింట్‌వెంచర్‌ను ప్రారంభించింది. ఈ జాయింట్‌ వెంచర్‌ కొత్త ప్రాజెక్ట్‌లకకు విద్యుత్‌ను సరఫరా చేయడంతో పాటు పవర్‌ గ్రిడ్‌కు ట్రాన్స్‌మిషన్‌ను విక్రయించింది.
ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ కన్‌స్ట్రక్చన్స్‌:- నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ పదవికి భాస్కర్‌ ఛటర్జీ రాజీనామా చేశారు.

హెచ్‌సీఎల్‌:- ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ సేవల సంస్థ ఐబీఎంకు 1.8మిలియన్‌ డాలర్ల సాఫ్ట్‌వేర్‌ ఉత్పత్తులను విక్రయించింది.You may be interested

ముడి చమురు బిల్లు.. రూపాయిల్లో చెల్లింపు

Friday 7th December 2018

న్యూఢిల్లీ: ఇరాన్‌ ముడిచమురు బిల్లును భారత్‌ రూపాయిల్లో  చెల్లించనున్నది. ఈ మేరకు ఇరు దేశాల మధ్య ఒక ఒప్పందం కుదిరిందని సమాచారం. ఈ ఒప్పందంలో భాగంగా భారత రిఫైనరీలు ఇరాన్‌ నుంచి దిగుమతి చేసుకునే ముడి చమురుకు చెల్లించాల్సిన సొమ్ములను యూకో బ్యాంక్‌లోని నేషనల్‌ ఇరానియన్‌ ఆయిల్‌ కంపెనీ ఖాతాలో జమ చేస్తాయి.ఇరాన్‌పై అమెరికా విధించిన ఆంక్షలు గత నెల 5నుంచి అమల్లోకి వచ్చాయి. అయితే ఈ ఆంక్షల నుంచి

రూపీ కళకళ

Friday 7th December 2018

ఇండియన్‌ రూపాయి శుక్రవారం లాభాల్లో ట్రేడవుతోంది. అమెరికా డాలర్‌తో పోలిస్తే ఆరంభంలోనే 34 పైసలు బలపడింది. 70.56 వద్ద ప్రారంభమైంది. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్‌ ధరలు తగ్గడం సానుకూల ప్రభావం చూపింది.  క్రూడ్‌ ఆయిల్‌ ధరలు శుక్రవారం స్వల్పంగా తగ్గాయి. ఒపెక్‌ దేశాలు ఆయిల్‌ సరఫరా తగ్గింపు తుది నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నాయి. నాన్‌-ఒపెక్‌ హెవీవెయిట్‌ దేశమైన రష్యా నుంచి మద్దతు కోసం వేచి చూస్తున్నాయి. బ్రెంట్‌ క్రూడ్‌ ధర బ్యారెల్‌కు

Most from this category