STOCKS

News


గురువారం వార్తల్లో షేర్లు

Thursday 10th January 2019
Markets_main1547093849.png-23494

వివిధ వార్తలకు అనుగుణంగా గురువారం ప్రభావివతయ్యే షేర్ల వివరాలు
అదానీ ఎంటర్‌ప్రైజెస్‌:- ఆంధ్రప్రదేశ్‌లోని డాటా సెంటర్‌ ఏర్పాటుకు ఆ రాష్ట్ర ప్రభుత్వంతో మౌఖిక ఒ‍ప్పందాన్ని కుదుర్చుకుంది. విశాఖపట్నంలోని 500 ఎకరాల్లో మూడు ప్రాంతాల్లో 5 గిగా వాట్ డాటా సెంటర్‌ను అదాని గ్రూప్‌ ఏర్పాటు చేయనుంది. ఇర‌వై ఏళ్లలో ల‌క్ష ఉద్యోగాలు క‌ల్పించే ఈ సెంట‌ర్ కోసం అదానీ గ్రూప్ 70 వేల కోట్ల రూపాయ‌లు పెట్టుబ‌డులు పెట్టనుంది.
అశోక్‌ లేలాండ్‌:- చెన్నై, చండీగఢ్‌, ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి 2,580 బస్సులకు ఆర్డర్లు వచ్చాయని కంపెనీ ఎమ్‌డీ, వినోద్‌ కె దాసరి తెలిపారు. అలాగే కంపెనీ ఆశ్లే ఏవియేషన్‌లో అదనంగా 12.5శాతం వాటాను రూ.25.5 లక్షలకు కొనుగోలు చేసి సంబంధిత కంపెనీలో తన మొత్తం వాటాను 88.75శాతానికి పెంచుకున్నట్లు ఆయన తెలిపారు.
యస్‌ బ్యాంక్‌:- నిన్న జరిగిన బోర్డు సమావేశంలో బ్యాంకు ఎండీ, సీఈవోగా పదవి బాధ్యతలు చేపట్టేందుకు తగిన అర్హతలు కలిగిన అభ్యర్థుల జాబితాను తయారీ చేసింది. నేడు(జనవరి 10) ఎండీ, సీఈవో నియామకానికి గురువారం ఆర్‌బీఐ ఆమోదం కోరనున్నట్లు తెలిపింది.
బజాజ్‌ ఫైనాన్స్‌:- రూ.1495 కోట్ల విలువైన 14950 సెక్యూర్డ్‌ రీడమబుల్‌ నాన్‌ కన్వర్టబుల్‌ డిబెంచర్లను జారీ చేసింది. ప్రతి సెక్యూర్డ్‌ రీడమబుల్‌ నాన్‌ కన్వర్టబుల్‌ డిబెంచర్‌ ముఖవిలువ రూ.10లక్షలుగా ఉంది.
టాటా స్టీల్‌ బీఎస్‌ఎల్‌:- తన మాతృ సంస్థ టాటాస్టీల్‌కు నాన్‌ కన్వర్టబుల్‌ రీడమబుల్‌ షేర్లను జారీ చేసి రూ.12వేల కోట్ల నిధుల సమీకరణకు బోర్డు ఆమోదం తెలిపింది.
డెల్టా కార్పోరేషన్‌:- మధ్యంతర డివిడెండ్‌ చెల్లింపునుకు జనవరి 21ను రికార్డు తేదిగా ప్రకటించింది.  
నేడు క్యూ2 ఫలితాలను ప్రకటించే కొన్ని ప్రధాన కంపెనీలు

టీసీఎస్‌, బంధన్‌ బ్యాంక్‌, గోవా కార్బన్‌You may be interested

పసిడి 1300 డాలర్ల వైపు అడుగులు

Thursday 10th January 2019

ప్రపంచమార్కెట్లో పసిడి అడుగులు మరోసారి 1300డాలర్లు దిశగా కదులుతున్నాయి. డాలర్‌ ఇండెక్స్‌ బలహీనత అందుకు తోడ్పాటును అందిస్తుంది. ఆసియా మార్కెట్లో గురువారం ఉదయం గం.10:00ని.లకు ఔన్స్‌ పసిడి ధర 5డాలర్లు లాభపడి 1,297 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ డిసెంబర్‌లో జరిపిన సమీక్ష వివరాలు బుధవారం వెల్లడయ్యాయి. అందులో ఫెడ్‌ సభ్యుల్లో ఎక్కువ మంది వడ్డీ రేట్లపై మెతకవైఖరి వహించాలని కోరినట్లు తెలుస్తుంది.

స్వల్పలాభాలతో ప్రారంభం

Thursday 10th January 2019

గురువారం భారత్‌ మార్కెట్‌ స్వల్పలాభాలతో ప్రారంభమయ్యింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 45 పాయింట్ల లాభంతో 36,258 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 4 పాయింట్ల లాభంతో 10,859 పాయింట్ల వద్ద మొదలయ్యాయి. బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఐటీసీ, టాటా మోటార్స్‌, ఐషర్‌ మోటార్స్‌ ట్రేడింగ్‌ ప్రారంభంలో 1 శాతంవరకూ పెరగ్గా, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌, బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌,  ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌లు స్వల్పనష్టాలతో మొదలయ్యాయి.  ఆసియా సూచీలు నష్టాల్లో...  ఇక గురువారం ఉదయం ఆసియా సూచీల్లో జపాన్‌ నికాయ్‌

Most from this category