STOCKS

News


బుధవారం వార్తల్లోని షేర్లు

Wednesday 28th November 2018
Markets_main1543378634.png-22426

వివిధ వార్తలను అనుగుణంగా బుధవారం ప్రభావితమయ్యే షేర్లు వివరాలు
యస్‌బ్యాంక్‌:- ఫారెన్‌ కరెన్సీ ఇష్యూకు రేటింగ్‌ కంపెనీ మూడీస్‌ స్థిరత్వం నుంచి నెగిటివ్‌కు రేటింగ్‌ను సవరించింది.
లుపిన్‌:- కంపెనీ ఛీప్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ పదవికి రమేష్‌ స్వామినాథన్‌ రాజీనామా చేశారు.
రిలయన్స్‌ క్యాపిటల్‌:- ఈ క్యూ2లో కన్సాలిడేషన్‌ ప్రాతిపాదికన కంపెనీ రూ.280 కోట్ల నికర ఆదాయాన్ని ఆర్జించింది. గతేడాది ఇదే క్యూ2లో కంపెనీ రూ.163 కోట్ల నికరనష్టాన్ని నమోదు చేసింది. ఇదే క్వార్టర్‌లో కంపెనీ మొత్తం ఆదాయం రూ.5330 కోట్లను సాధించింది. ఈ త్రైమాసికంలో కంపెనీ ఈపీఎస్‌(ఎర్నింగ్‌ పర్‌ షేర్‌) రూ.12.30లుగా నమోదైంది.
ఐనాక్స్‌ విండ్‌:- మనదేశంలో 3మెగావాట్ల సామర్థ్యం కలిగిన విండ్‌ టర్బైన్‌ ఏర్పాటుకు అంతర్జాతీయ పవన, విద్యుత్‌ గ్రిడ్‌ పరికరాల తయారీ సంస్థ ఏఎంసీఎస్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
అతుల్‌ అటో ఇండస్ట్రీస్‌:- నిబంధనలకు అనుగుణంగా జేఎంజీ ఇండస్ట్రీస్‌తో జాయింట్‌ వెంచర్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ జాయింట్‌ వెంచర్‌ త్రిచక్ర వాహన రంగంలో ఎలక్ట్రానిక్‌ వాహనాల రూపకల్పనకు శ్రీకారం చుట్టనుంది.
యాక్సిస్కాడెస్‌:- కంపెనీ అనుబంధ సంస్థ యాక్సిస్కాడెస్‌ ఏరోస్పేస్‌ టెక్నాలజీ 20మిలియన్‌ డాలర్ల విలువైన పలు కాంట్రాక్టులను దక్కించుకుంది.
గిల్లాండర్స్‌ అర్బుథ్నాట్‌:- కంపెనీ ధీర్ఘకాలిక రుణ సదుపాయాన్ని దృష్టిలో ఉంచుకుని కంపెనీ రేటింగ్‌ను కేర్‌ రేటింగ్‌ సంస్థ బిబిబి+(నెగిటివ్‌) నుంచి బిబిబి(స్థిరత్వం)కు సవరించింది.
హిందూజా వెంచర్‌:- తన సహచర కంపెనీ హిందూజా లేలాండ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌లో కంపెనీలో రూ.10ముఖవిలువ కలిగిన కోటి విలువైన షేర్ల ఉపసంహరణకు కంపెనీ ఇన్వెస్ట్‌మెంట్‌ కమిటీ ఆమోదం తెలిపింది.
అరియన్‌ ప్రో సెల్యూషన్‌:- నయా ముంబై కేంద్రంగా కంపెనీ కొత్తగా ఎక్సీపిరియన్స్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది.
ఆర్‌ఎస్‌ ఇస్పాట్‌:- లిక్విటిడీ స్టాక్‌ ఆఫ్షన్‌కు సంబంధించి తప్పుడు సమాచారాన్ని ఇచ్చినందుకు మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబి రూ.25లక్షల జరిమానా విధించింది.
అపోలో హాస్పిటల్‌:- కొచ్చిలోని అంగమలైలో 250 పడకల ఆసుపత్రి నిర్మాణానికి కేరళ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతులు దక్కించుకుంది. మరో 6నెలలల్లో భవన నిర్మాణాన్ని పూర్తి చేసి, పూర్థిస్థాయి వైద్యసేవలను అందుబాటులోకి చేస్తామని అపోలో యాజామాన్యం ధీమాను వ్యక్తం చేసింది.
ఎయిర్‌ఇండియా ఏవియేషన్‌:- ఎయిర్‌ఇండియా కంపెనీ చెందిన గ్రౌండ్‌ హ్యాండిలింగ్‌ కంపెనీ ఎయిర్‌ట్రాన్స్‌పోర్ట్‌ సర్వీసెన్‌లో మొత్తం వాటా విక్రయానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
ఐడీబీఐ బ్యాంక్‌:- ఎల్‌ఐసీకి 51శాతం వాటా విక్రయానికి సంబంధించిన కాంపీటీషన్‌ కమీషన్‌ ఆఫ్‌ ఇండియా నుంచి అనుమతులు లభించాయి.
ఫ్యూచర్‌ రిటైల్‌:- అమెజాన్‌ కంపెనీ 9.50శాతం వాటాను కొనుగోలు చేయనుంది. కొనుగోలు ప్రక్రియ చర్చలు తుది దశలో ఉన్నాయని, మరో 10రోజుల్లో ఒప్పందం కార్యరూపం దాల్చవచ్చని విశ్వసనీయ వర్గాల సమాచారం.You may be interested

యస్ బ్యాంక్ 4 శాతం డౌన్‌

Wednesday 28th November 2018

ముంబై: ప్రైవేట్ రంగానికి చెందిన యస్‌ బ్యాంక్‌ షేరు ధర బుధవారం ట్రేడింగ్‌లో 4 శాతానికి మించి నష్టాలను నమోదుచేసింది. ఉదయం 10 గంటల సమయానికి రూ.8 (4.5 శాతం) నష్టపోయి రూ.175 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ.173.50 వద్దకు పడిపోయింది. ఈ షేరు 52 వారాల కనిష్టస్థాయి రూ.165.00 (28, సెప్టెంబర్‌ 2018)వద్ద ఉంది. డైరెక్టర్ల వరుస రాజీనామాల నేపథ్యంలో వరుస పతనాన్ని నమోదుచేసింది. ఇక తాజా రేటింగ్‌

10,700పైన నిఫ్టీ

Wednesday 28th November 2018

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ బుధవారం లాభాలతో ప్రారంభమైంది. నిఫ్టీ తన మునపటి ముగింపు 10,685 పాయింట్లతో పోలిస్తే 23 పాయింట్ల లాభంతో 10,708 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఇక సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 35,513 పాయింట్లతో పోలిస్తే 122 పాయింట్ల లాభంతో 35,635 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. క్రూడ్‌ ధరలు బుధవారం పెరగడం, వ్యవస్థలో ద్రవ్య లభ్యత పెంపు చర్యల్లో భాగంగా ఆర్‌బీఐ వచ్చే నెలలో రూ.40,000 కోట్లను అందుబాటులోకి

Most from this category