STOCKS

News


గురువారం వార్తల్లోని షేర్లు

Thursday 24th January 2019
Markets_main1548302752.png-23764

వివిధ వార్తలకు అనుగుణంగా గురువారం ప్రభావిత‌య్యే షేర్ల వివ‌రాలు
అపోలో మెక్రో సిస్టమ్స్‌:- భార‌త్ డైన‌మిక్స్ నుంచి  రూ.13 కోట్ల విలువైన ఆర్డర్లను ద‌క్కించుకుంది.
ఐడీబీఐ బ్యాంక్‌:- ఎల్ఐసీ వ్యూహాత్మక పెట్టుబడులు పెట్టిన త‌ర్వాత మూడీస్ రేటింగ్ కంపెనీ ఐడీబీఐ బ్యాంక్ రేటింగ్ను బీ1 నుంచి బీఏ2 కు   అప్ గ్రేడ్ చేసింది.
ఎవ‌రెస్ట్ ఇండ‌స్ట్రీస్‌:- కంపెనీ ఛైర్మన్ ప‌ద‌వికి ఆదిత్య విక్రమ్ సోమ‌ని రాజీనామా చేశారు.
వోడాఫోన్ ఐడియా:- అర్హత క‌లిగిన ఈక్వీటీ షేర్‌హోల్డర్లకు రైట్స్ ఇష్యూ ద్వారా ఈక్వీటీ షేర్లను జారీ చేసి రూ.25వేల కోట్లను స‌మీక‌రించేందుకు బోర్డు ఆమోదం తెలిపింది.
ఇన్ఫోసిస్‌:- ఎంట‌ర్‌ప్రైజెస్ డిజిటల్ ట్రాన్స్‌ఫ‌ర్మేష‌న్ విభాగంలో వ్యాపారాన్ని మ‌రింత వృద్ధి చేసుకునేందుకు హెచ్‌పీఈ కంపెనీతో భాగ‌స్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
వేదాంత:- దక్షిణాఫ్రికాలో 160 కోట్ల డాలర్లు పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటించింది.
‍బ్లూడార్ట్:- కంపెనీ నూతన సీఈఓగా బాల్పోర్‌ మానుయల్‌ను నియమించినట్లు ప్రకటించింది.

పర్సిస్టెంట్‌ సిస్టమ్స్‌:- జనవరి 27ను జరిగే బోర్డు సమావేశంలో కంపెనీ షేర్ల బై బ్యాంక్‌ అంశంపై చర్చించనుంది.

నేడు క్యూ3 ఫ‌లితాల‌ను ప్ర‌క‌టించే కొన్ని ప్ర‌ధాన కంపెనీలు:- య‌స్ బ్యాంక్‌, అల్ట్రాటెక్ సిమెంట్స్‌, బ‌యోకాన్‌, హాట్ స‌న్ అగ్రో ప్రాడెక్ట్‌, రిలయన్స్ ప‌వ‌ర్, ఎడెల్వీజ్ ఫైనాన్షియ‌ల్ స‌ర్వీసెస్‌, శ్రద్ధా కార్ప్ కెమ్‌, పీఎన్‌బీ హౌసింగ్ ఫైనాన్స్‌, సింటెక్స్ ఇండ‌స్ట్రీస్‌, కాల్గేట్, భ‌ర‌త్ బిజ్లీ, ఇక్రా, పంబాజ్ కెమిక‌ల్స్‌, జీ మీడియా కార్పోరేష‌న్‌, స‌న్టెక్ రియ‌ల్టీ, క్వెస్ కార్ప్‌, పీఆర్‌వీ, జ్యోతీ ల్యాబోరేట‌రీస్‌, పోద్దార్ పిగ్మెంట్‌, ఆన్‌వ‌ర్డ్ టెక్నాల‌జీస్‌, వీఎస్‌టీ ఇండ‌స్ట్రీస్‌, ఫైజ‌ర్, ఎంఫ‌సీస్‌, న్యూజెన్ సాఫ్ట్‌వేర్ టెక్నాల‌జీస్ టెక్నాల‌జీస్‌, స్టెరిలైట్ టెక్నాల‌జీస్‌, ఎన్ఐఐటీ, స‌న్‌ఫ్లాగ్, సెంచ‌రీ ఎంకా, కేఆర్బీఎల్‌, జిందాల్ సా, తివారీ పాలీపైప్స్‌, ఓరియంట‌ల్ గ్రీన్ కంపెనీ, హెక్సా ట్రేడెక్స్‌, స‌న్‌ప్రీమ్ ఇండ‌స్ట్రీస్, కామ్‌ధేను.You may be interested

టాటా ‘హారియర్‌’ వచ్చేసింది

Thursday 24th January 2019

 ప్రారంభ ధర రూ.12.69 లక్షలు ముంబై: కారు ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘టాటా హారియర్‌’ బుధవారం దేశీయ మార్కెట్లోకి ప్రవేశించింది. ల్యాండ్‌ రోవర్‌ డీ8 ప్లాట్‌ఫాంపై రూపొందిన ఈ సరికొత్త కాంపాక్ట్‌ స్పోర్ట్స్‌ యుటిలిటీ వెహికల్‌ (ఎస్‌యూవీ).. మొత్తం 4 వేరియంట్లలో లభ్యమవుతోంది. 2.0 లీటర్ డీజిల్ ఇంజిన్, 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌, సింగిల్ పవర్‌ట్రెయిన్ ఈ కారు ప్రధాన ఫీచర్లు. ‘ఎక్స్‌ఈ, ఎక్స్‌ఎం, ఎక్స్‌టీ, ఎక్స్‌జెడ్‌’ మోడళ్లను

పాజిటివ్‌ ఓపెనింగ్‌

Thursday 24th January 2019

సెన్సెక్స్‌ 70 పాయింట్లు, నిఫ్టీ 15 పాయింట్లు అప్‌ ఆసియా సూచీలు సానుకూలంగా ట్రేడవుతున్న నేపథ్యం‍లో గురువారం భారత్‌ సూచీలు స్వల్పలాభంతో ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 70  పాయింట్ల లాభంతో 36,178 పాయింట్ల వద్ద ప్రారంభంకాగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 14 పాయింట్ల లాభంతో 10,845 పాయింట్ల వద్ద మొదలయ్యింది. ఐటీసీ, పవర్‌గ్రిడ్‌, ఇన్‌ఫ్రాటెల్‌, ఎన్‌టీపీసీ, హెచ్‌సీఎల్‌టెక్‌లు లాభాలతో మొదలుకాగా, టాటా మోటార్స్‌, ఎం అండ్‌ ఎం, అదాని పోర్ట్స్‌, జెఎస్‌డబ్ల్యూ స్టీల్‌లు

Most from this category