STOCKS

News


గురువారం వార్తల్లో షేర్లు

Thursday 22nd November 2018
Markets_main1542862358.png-22279

వివిధ వార్తలకు అనుగుణంగా గురువారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు
యస్‌ బ్యాంక్‌:- వరుస రాజీనామాలతో సంక్షోభంలో చిక్కుకున్న యస్‌ బ్యాంక్‌ బోర్డు డిసెంబర్‌ 13న సమావేశం కానుంది.  ఈ సమావేశంలో బ్యాంక్‌ ఛైర్మన్‌, సీఈవో, స్వతంత్ర డైరెక్టర్‌ పదవి నియమాకాలపై బోర్డు సభ్యులు చర్చించనున్నారు. ఈ నవంబర్‌లోనే ఏకంగా ముగ్గురు బోర్డు సభ్యులు తమ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
జెట్‌ ఎయిర్‌వేస్‌:- ఆర్థిక కష్టాల నుంచి గట్టేందుకు యూనిటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ దేశానికి చెందిన ఎతిహాద్ ఎయిర్‌లైన్స్‌ సహకారం కోరే అంశంపై ఇన్వెస్టర్లతో సమావేశం నిర్వహించనుంది.
దీపక్‌ ఫెర్టిలైజర్స్‌:- ఇన్‌కమ్‌ టాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ తనిఖీలు చేసినట్లు స్టాక్‌ ఎక్చ్సేంజ్‌లకు సమాచారం ఇచ్చింది.
జీఎంఆర్‌ ఇన్ఫ్రా:-  కాకినాడ గేట్‌వే పోర్ట్‌ లిమిటెడ్‌ను అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో ఎంఓయూ ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
ఐఎల్‌&ఎఫ్‌ఎస్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌:- ద్రవ్య కొరత కారణంగా నవంబర్‌ 21న తేదిన ఎన్‌సీడీ బాండ్ల వడ్డీని చెల్లించడంలో విఫలమైంది.
సీజీ పవర్‌ అండ్‌ ఇండస్ట్రీయల్‌ సెల్యూషన్స్‌:- నేడు రిలయన్స్‌ మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థ అధికారి ప్రతినిధులతో సమావేశం నిర్వహించునున్నారు.
డియో గ్లోబల్‌ సెల్యూషన్స్‌:- డిసెంబర్‌ 14న సంస్థ వార్షిక సమావేశాన్ని నిర్వహించనుంది.You may be interested

టీవీఎస్‌ ఎక్స్‌ఎల్‌100 ‘ఐ-టచ్‌ స్టార్ట్‌’

Thursday 22nd November 2018

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: వాహన తయారీ సంస్థ టీవీఎస్‌ మోటార్స్‌ తెలంగాణ మార్కెట్లో ఎలక్ట్రిక్‌ స్టార్ట్‌ ఫీచర్‌తో ఎక్స్‌ఎల్‌100 హెవీ డ్యూటీ ‘ఐ-టచ్‌ స్టార్ట్‌’ మోడల్‌ను ప్రవేశపెట్టింది. లీటరు పెట్రోల్‌కు 60 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. మినరల్‌ పర్పుల్‌ కలర్‌ను తొలిసారిగా పరిచయం చేశారు. మొబైల్‌ చార్జింగ్‌ సౌకర్యం ఉంది. 4 స్ట్రోక్‌ సింగిల్‌ సిలిండర్‌తో 99.7 సీసీ హెవీడ్యూటీ ఇంజన్‌, డ్యూరా గ్రిప్‌ టైర్‌, హెవీ డ్యూటీ షాక్‌

71 సమీపానికి రూపాయి

Thursday 22nd November 2018

ఇండియన్‌ రూపాయి జోరు తగ్గడం లేదు. అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్‌ రూపాయి గురువారం మళ్లీ లాభపడి 71 సమీపస్థాయికి పెరిగింది. రూపాయి బలపడుతూ రావడం ఇది వరుసగా ఏడో సెషన్‌. 2017 ఫిబ్రవరి నుంచి చూస్తే రూపాయి వరుసగా ఇన్ని రోజులు ర్యాలీ చేయడం ఇదే ప్రథమం. క్రూడ్‌ ధరలు పతనం కావడం వల్ల ద్రవ్యలోటు, ద్రవ్యోల్బణ భయాలు తగ్గడం సానుకూల ప్రభావం చూపింది.  రూపాయి గత ఏడు సెషన్లలో దాదాపుగా

Most from this category