STOCKS

News


బుధవారం వార్తలోని షేర్లు

Wednesday 26th September 2018
Markets_main1537935586.png-20572

వివిధ వార్తలకు అనుగుణంగా బుధవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు
బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా:- రేటింగ్‌ సంస్థ మూడీస్‌ బ్యాంక్‌ అవుట్‌లుక్‌ రేటింగ్‌ను స్థిరత్వానికి సవరించింది.
కల్లాం టెక్స్‌టైల్స్‌:- రెట్స్‌ ఇష్యూ అంశంపై చర్చించేందుకు సెప్టెంబర్‌ 29న బోర్డు సమావేశం నిర్వహించనుంది.
అవెన్యూ సూపర్‌మార్ట్స్‌:- కంపెనీ రూ.65కోట్ల విలువైన కమర్షియల్‌ పేపర్ల ఇష్యూను జారీ చేసింది. అలాగే రేటింగ్‌ సంస్థ క్రిసెల్‌ కంపెనీకి గల బ్యాంక్‌ ధీర్ఘకాలిక రుణ సదుపాయాలకీ, ఎన్‌డీలకు రేటింగ్‌ను ఎఎ(+)స్థిరత్వానికి పెంచింది.
సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా:- ఫ్రిపరెన్షియల్‌ పద్ధతిలో ప్రభుత్వానికి అదనంగా రూ.2.354కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను జారీ చేసే అంశంపై ఈ సెప్టెంబర్‌ 28న బోర్డు సమావేశాన్ని నిర్వహించనుంది.
గ్లెన్‌మార్క్‌ ఫార్మా:- కంపెనీ సెప్టెంబర్‌ 28న జరిగే బోర్డు సమావేశంలో నిధుల అంశంపై చర్చించనుంది.  
ఐఎల్‌&ఎఫ్‌ఎస్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌:- రేటింగ్‌ సంస్థ బ్రిక్‌వర్క్స్‌ రూ.3500 కోట్ల ఎన్‌సీడీలకు రేటింగ్‌ను బిబి(+)కు పెంచింది.
డీఎల్‌ఎఫ్‌:- కంపెనీ ఛైర్మన్‌గా కేపీ సింగ్‌ తిరిగి నియమితులయ్యారు.
యస్‌ బ్యాంక్‌:- కంపెనీ సీఈవోగా రాణా కపూర్‌ పునర్నియామకాన్ని ఆర్‌బీఐ రద్దు చేసిన తర్వాత కంపెనీ కొత్త ఛైర్మన్‌ వేటలో పడింది. అందులో భాగంగా కంపెనీ ‘‘రీసెర్చ్‌&సెలక్షన్‌ కమిటీ’’ని ఏర్పాటు చేసింది.
గోద్రేజ్‌ పాపర్టీస్‌:- థానేలో కొత్త ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది.
రైట్స్‌:- బీఎన్‌వీ గుజరాత్‌ రైల్వే ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీతో కలిసి జాయింట్‌వెంచర్‌ను ఏర్పాటు చేసింది.
పిరమాల్‌ ఎంటర్‌ప్రైజెస్‌:- రూ.81కోట్ల విలువైన డిబెంచర్ల జారీకి బోర్డు ఆమోదం తెలిపింది.
అదానీ గ్రీన్‌ ఎనర్జీ:- 300 మెగావాట్ల పవన విద్యుత్‌ ప్రాజెక్ట్‌ నిర్మాణానికి సంబంధించి కాంట్రాక్టును దక్కించుకుంది.
బ్లూ డార్క్‌ ఎక్స్‌ప్రెస్‌:- ఈ డిసెంబర్‌ చివరినాటికి ‘‘రీచ్‌ ఎవెరీ హోమ్స్‌’’ ప్రాజెక్ట్‌లో భాగంగా మొత్తం రూ.500 కోట్లను వ్యాపార అవసరాలకు ఖర్చు పెట్టడానికి బోర్డు నుంచి అనుమతలు దక్కించుకుంది.
మిండా ఇండస్ట్రీస్‌:- కంపెనీ కొత్త సీఎఫ్‌ఓగా సునీల్‌ బోహ్రా నియమితులయ్యారు.You may be interested

స్థిరంగా పసిడి ధర

Wednesday 26th September 2018

ఫెడరల్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ సమీక్షా సమావేశాల నేపథ్యంలో బుధవారం పసిడి స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. ఆసియా మార్కెట్లో భారత వర్తమానకాలం ఉదయం 10 గంటలకు ఔన్స్‌ పసిడి 1 డాలరు స్వల్పంగా లాభపడి 1,206 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. నిన్న, నేడు (సెప్టెంబర్‌ 25, 26 తేదిల్లో) ఫెడ్‌ రిజర్వ్‌ ద్రవ్యపరపతి సమీక్షా సమావేశాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు వేచిచూసే ధోరణి అవలంభిస్తున్నట్లు మార్కెట్‌ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు ఆరు

రూపీ ఫ్లాట్‌..

Wednesday 26th September 2018

అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్‌ రూపాయి బుధవారం అక్కడక్కడే కదలాడుతోంది. అమెరికా ఫెడరల్‌ రిజర్వు సమావేశం నేపథ్యం ఇందుకు కారణం. ఫెడ్‌ రేటు నిర్ణయం బుధవారం అర్ధరాత్రి వెలువడనుంది. ఉదయం 9:10 సమయంలో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి 72.73 వద్ద ట్రేడ్‌ అవుతోంది. తన మంగళవారం ముగింపు 72.70తో పోలిస్తే 0.03 శాతంమేర నష్టపోయింది. ఇక డాలర్‌తో పోలిస్తే రూపాయి బుధవారం 72.72 వద్ద ప్రారంభమైంది.  ట్రేడర్లు.. అమెరికా ఫెడరల్‌

Most from this category