STOCKS

News


గురువారం వార్తల్లోని షేర్లు

Thursday 25th October 2018
Markets_main1540440946.png-21456

ముంబై:- వివిధ వార్తలను అనుగుణంగా గురువారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు
వెస్ట్‌ కోస్ట్‌ పేపర్‌ మిల్స్‌:- ప్రస్తుతం కంపెనీలో నెలకొన్న అనిశ్చితి పరిస్థితుల దృష్టా‍్య రేటింగ్‌ సంస్థ ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రీసెర్చ్‌ వెస్ట్‌ కోస్ట్‌ పేపర్‌ మిల్స్‌ రేటింగ్‌ను తగ్గించింది.
ఇక్రాన్‌ ఇంటర్నేషనల్‌:- తన అనుబంధ సంస్థ ఇక్రాన్‌ ద్వారా రైట్‌ ఇష్యూ పద్దతిలో రూ.50 కోట్ల పెట్టుబడులు పెట్టింది.
టాటా కెమికల్స్‌:- వ్యాపార కార్యకలాపాల నిమిత్తం సెంట్రల్‌ ఎలక్ట్రో కెమికల్స్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిస్యూట్‌ కంపెనీతో మౌఖిక ఒప్పందాన్ని కుదర్చుకుంది.
ఐఎల్‌&ఎఫ్‌ఎస్‌:- నాన్‌-కన్వర్టబుల్‌ డిబెంచర్ల మీద వడ్డీని చెల్లించడంలో విఫలమైంది.
జెట్‌ ఎయిర్‌వేస్‌:- రుణాన్ని తీర్చేందుకు గడువు పెంచమని కానీ, వడ్డీ రేట్లను తగ్గించమని రుణదాతలను కోరలేదని వివరణ ఇచ్చింది.
కేపీఐటీ టెక్‌:- బీఎండబ్ల్యూ కార్లకు సాంకేతిక పరిఙ్ఞానాన్ని అందించేందుకు ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
ఎస్‌కేఎఫ్‌ ఇండియా:- ప్రతి షేరు ధర రూ.2100 చొప్పున మొత్తం రూ.19లక్షల ఈక్విటీ షేర్లను తిరిగి కొనుగోలు చేయనుంది.
టాటా స్టీల్‌:- టాటా స్పాంజ్‌ కంపెనీ ద్వారా ఉషా మార్టిన్‌ కొనుగోలుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది.
నేడు క్యూ2 ఫలితాలను ప్రకటించే కొన్ని ప్రధాన కంపెనీలు:-
భారతీఎయిర్టెల్‌, యస్‌ బ్యాంక్‌, మారుతి సుజుకీ, భెల్‌, ఎల్‌ అండ్‌ టీ టెక్నాలజీ సర్వీసెస్‌, వరుణ్‌ బేవరీజెస్‌, పిరమిల్‌ ఎంటర్‌ప్రైజెస్‌, క్వెస్‌ క్వార్ప్, మ్యూజిక్‌ బ్రాడ్‌కాస్ట్‌, శ్రీరాం సిటీ యూనియన్‌ బ్యాంక్‌ ఫైనాన్స్‌, హెచ్‌సీఎల్‌ ఇన్ఫోసిస్టమ్స్‌, బయోకాన్‌, కిర్లోస్కర్‌ బ్రదర్స్‌, డీబీ కార్పోరేషన్‌, షాలీమార్‌ పెయింట్స్‌, వీఎల్‌ఎస్‌ పెయింట్స్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, జేఎం ఫైనాన్షియల్స్‌, సైయంట్‌, పుంజ్‌లాయిడ్‌, మెస్టాక్‌, డిష్‌టీవీ ఇండియా, ప్రజ్‌ ఇండస్ట్రీస్‌, 63 మూన్స్‌ టెక్నాలజీస్‌, ఓరియంటల్‌ బ్యాంక్‌ కామర్స్‌, కజారియా సిరామిక్స్‌, జుబిలెంట్‌ ఇండస్ట్రీస్‌, రేమాండ్‌, వీ-గార్డ్‌ ఇండస్ట్రీస్‌, భారత్‌ హెవీ ఎలక్ట్రానిక్స్‌, టాటా కాఫీ​, పీవీఆర్‌You may be interested

తగ్గిన రూపాయి

Thursday 25th October 2018

14 పైసలు నష్టంతో 73.30 వద్ద ప్రారంభం ఇండియన్‌ రూపాయి గురువారం బలహీనపడింది. ఆసియా కరెన్సీలు మిశ్రమంగా ఉండటం ఇందుకు కారణం. ఉదయం 9:15 సమయంలో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి 73.31 వద్ద ట్రేడవుతోంది. రూపాయి తన బుధవారం ముగింపు 73.16తో పోలిస్తే 0.20 శాతం నష్టపోయింది. రూపాయి గురువారం 73.30 వద్ద ప్రారంభమైంది.   భారత్‌లో పదేళ్ల బాండ్‌ ఈల్డ్స్‌ 7.853 శాతంగా ఉన్నాయి. బాండ్‌ ఈల్డ్స్‌ మునపటి ముగింపు

నష్టాలతో ఆరంభం..

Thursday 25th October 2018

సెన్సెక్స్‌ 250 పాయింట్లకు పైగా పతనం 33,800 మార్క్‌ దిగువున ప్రారంభం నిఫ్టీ 90 పాయింట్లు డౌన్‌ 10,250 దిగువున ఇండెక్స్‌ ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ గురువారం నష్టాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 34,033 పాయింట్లతో పోలిస్తే 255 పాయింట్ల నష్టంతో 33,778 పాయింట్ల వద్ద గ్యాప్‌డౌన్‌తో ప్రారంభమైంది. ఇక నిఫ్టీ తన మునపటి ముగింపు 10,225 పాయింట్లతో పోలిస్తే 90 పాయింట్ల నష్టంతో 10,135 పాయింట్ల వద్ద ప్రారంభమైంది.  గృహ విక్రయాలు బలహీనంగా

Most from this category