News


గురువారం వార్తల్లోని షేర్లు

Thursday 28th February 2019
Markets_main1551328372.png-24367

వివిధ వార్తలకు అనుగుణంగా గురువారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు
భారతీ ఎయిర్‌టెల్‌:-
ఫిబ్రవరి 28న జరిగే కంపెనీ సమావేశాల్లో కీలక నిర్ణయం తీసుకోనుంది. రైట్స్‌ ఇష్యూతో పాటు ఇతర మార్గాల్లో అర్హత కలిగిన సంస్థాగత ఇన్వెస్టర్లకు ఈక్విటీ షేర్లు, బాం‍డ్ల/డిబెంచర్లు, ఇతర సెక్యూరిటీలను జారీ చేసి మూలధన నిధుల సమీకరించేందుకు బోర్డు నుంచి ఆమోదం కోరనుంది.
పీఎన్‌బీ, అలహాబాద్‌ బ్యాంక్‌:- రెండు బ్యాంకులు రుణాలపై ఎంసీఎల్‌ఆర్‌ రేట్లను 10 బేసిస్‌ పాయింట్లు తగ్గించాయి. సవరించిన వడ్డీరేట్లు మార్చి 1నుంచి అమల్లోకి రానున్నాయి. 
వాస్కాన్‌ ఇంజనీరింగ్స్‌:- ఏయిర్‌ పోర్ట్‌ ఆథారిటీ ఆఫ్‌ ఇండియా నుంచి రూ.85 కోట్ల విలువైన ఆర్డర్లు దక్కించుకుంది. 
అలహాబాద్‌ బ్యాంక్‌:- కేంద్రం ప్రభుత్వానికి ఈక్విటీ షేర్లను జారీ  చేసి రూ.6896 కోట్ల నిధుల సమీకరణకు బోర్డు ఆమోదం తెలిపింది. 
క్వెస్‌ కార్ప్‌:- ధీర్ఘకాలిక నిధుల పరిమితులపై ఇక్రా రేటింగ్‌ అప్‌గ్రేడ్‌ చేసింది. ఇది వరకు కంపెనీ కేటాయించి ఎఎ/పాజిటివ్‌ నుంచి ఎఎ/స్థిరత్వానికి సవరిచింది. అలాగే నాన్‌ కన్వర్టబుల్‌ డిబెంచర్లపై కూడా ఎఎ/పాజిటివ్‌ నుంచి ఎఎ/స్థిరత్వానికి రేటింగ్‌ అప్‌గ్రేడ్‌ చేసింది. 
ఫార్మా షేర్లు:- కేన్సర్‌ చికిత్సల్లో వినియోగించే నాన్‌ షెడ్యూల్డ్‌ విభాగంలో 42 ఔషధాలను ధరల నియంత్రణలోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 
భెల్‌:- ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గానూ 40శాతం మధ్యంతరం డివిడెండ్‌ను చెల్లించింది. కంపెనీ ప్రభుత్వానికి 63.17శాతం వాటా ఉందని, దీనికి అనుగుణంగా రూ.176 కోట్ల డివిడెండ్‌ను చెల్లించామని వివరించింది. 
పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌:- ఒకటిన్నర ఏడాది మెచ్యూరిటీ కలిగి బాండ్ల ఇష్యూ ద్వారా కంపెనీ రూ.235 కోట్ల సమీకరణను పూర్తి చేసింది. 
ఐఓసీ, హెచ్‌పీసీఎల్‌:- ఐఓసీ 10 ప్రధాన పట్టణాల్లోనూ, హెచ్‌పీసీఎల్‌ 9 పట్టణాల్లోనూ రిటైల్‌ గ్యాస్‌ సరఫరా చేసేందుకు లైసెన్స్‌ను దక్కించుకున్నాయి. 
లుపిన్‌:- ఢిల్లీ హైకోర్టు డయాబెటిస్‌ జనరిక్‌ ఔషధం గ్లూకోనార్మ్‌-30పై నిషేధించినట్లు మీడియాలో వచ్చిన వార్తలపై విరణ ఇవ్వాల్సిందిగా స్టాక్‌ ఎక్చే‍్సంజ్‌ లుపిన్‌ను ఆదేశించింది.You may be interested

2వారాల కనిష్టానికి పసిడి

Thursday 28th February 2019

డాలర్‌ తిరిగి పుంజుకోవడంతో పసిడి ధర గురువారం రెండు వారాల కనిష్ట ధర వద్ద స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. ఆసియాలో ఉదయం ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి ధర 1డాలరు నష్టపోయి 1,320.05 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. వాణిజ్య యుద్ధ నివారణకు అమెరికా-చైనా దేశాల మధ్య జరుగుతున్న వాణిజ్య చర్చలపై అమెరికా వాణిజ్య అధికార ప్రతినిధి రాబర్ట్‌ లితిజెర్‌  వివాదస్పద వాఖ్యలు చేయడంతో చర్చల సఫలంపై మరోసారి అనుమానాలు రేకెత్తాయి.

పాజిటివ్‌ ప్రారంభం

Thursday 28th February 2019

సెన్సెక్స్‌ 120 పాయింట్లు, నిఫ్టీ 59 పాయింట్లు జంప్‌  ఇండోపాక్‌ ఉద్రిక్తతల నడుమ వరుసగా రెండురోజులపాటు నష్టాల్ని చవిచూసిన భారత్‌ సూచీలు గురువారం  పాజిటివ్‌గా ప్రారభమయ్యాయి.  బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 120 పాయింట్లు లాభపడి 36,026 పాయింట్ల వద్ద ప్రారంభంకాగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 59 పాయింట్లు జంప్‌చేసి 10,865 పాయింట్ల వద్ద మొదలయ్యింది. ట్రేడింగ్‌ ప్రారంభంలో టాటా మోటార్స్‌, యస్‌బ్యాంక్‌, ఓఎన్‌జీసీ, ఐఓసీలు 1 శాతంపైగా పెరగ్గా, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌, విప్రో, టీసీఎస్‌లు

Most from this category