STOCKS

News


గురువారం వార్తల్లోని షేర్లు

Thursday 30th August 2018
Markets_main1535605498.png-19779

వివిధ వార్తలకు అనుగుణంగా గురువారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు
మహీంద్రా లాజిస్టిక్స్‌:- కంపెనీ సీఎఫ్‌ఓగా యోగేష్‌ పటేల్‌ నియమితులయ్యారు.
పీఎన్‌బీ హౌసింగ్స్‌ ఫైనాన్స్‌:- ఆగస్ట్‌ 30న రూ.585కోట్ల ఎన్‌సీడీలను జారీ చేయనుంది.
యూనిటెక్‌:- క్యూ1లో రూ.72.95 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది.  గత క్యూ1 నమోదైన రూ.195.96కోట్ల ఆదాయాన్ని పోలిస్తే ఈ క్యూ1లో ఆదాయం రూ.76.3 కోట్లకు పరిమితమైంది.
నాల్కో:- 2017-18 నాటికి రూ.1102కోట్ల డివిడెండ్‌ను ప్రకటించింది.
పయనీర్ డిస్టిలరీస్:- ఆగష్టు 30 నుండి మహారాష్ట్ర నాందేడ్లులోని బాలాపూర్ వద్ద తన కొత్త ప్రాజెక్ట్‌ కార్యకలాపాలను ప్రారంభించనుంది.
టాటా కెమికల్స్‌:- ఐసీఐసీఐ ప్రిడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌.. టాటా కెమికల్స్‌లో తనకున్న 50 లక్షల ఈక్విటీ షేర్లను ప్రతి షేరు ధర రూ.414.21 వద్ద మొత్తం రూ.216 కోట్లకు విక్రయించింది. ఈ వాటా విక్రయంతో టాటా కెమికల్స్‌లో సంస్థ వాటా 5.02శాతం నుంచి 2.97శాతానికి తగ్గింది.
టీవీ టుడే:- టీవీ టుడే సీఈవోగా వివేక్‌ కన్నా నియమానికి మినిస్టర్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ సంస్థ ఆమోదం తెలిపింది.
గ్రావీస్‌ కాటన్‌:- ఆంపియర్‌ వెహికల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలో విడుతల వారీగా పెట్టుబడులు పెట్టేందుకు బోర్డు ఆమోదం తెలిపింది. అందులో భాగంగా మొదటి విడుతగా 67 శాతాన్ని, తరువాత 13 శాతాన్ని మూడేళ్ల కాలంలో కొనుగోలు చేయనుంది.
లారస్‌ ల్యాబ్స్‌:- డయాబెటిస్‌ వ్యాధి నివారణకు వినియోగించే మెట్ఫోర్మిన్ హైడ్రోక్లోరైడ్ ఔషధాలకు యూఎస్‌ఎఫ్‌డీఏ నుంచి అనుమతులు దక్కించుకుంది.
రిలయన్స్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్‌:- రిలయన్స్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్‌కు చెందిన ముంబై పట్టణానికి పవర్‌ సరఫరా చేసే వ్యాపారాన్ని  అదానీ ట్రాన్స్‌మిషన్స్‌ కొనుగోలు పూర్తిచేసింది.
పీఎంఓస్‌:- తన కంపెనీ పేరును రాజ్‌ అగ్రో మిల్స్‌గా మార్చుకుంది.
రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌:- ఉత్తారాఖండ్‌లో తన వ్యాపారాన్ని విస్తరించింది.
టాటా టెలికమ్యూనికేషన్స్‌:- రూ.20వేల కోట్ల సమీకరణకు షేర్లహోల్డర్ల అనుమతి కోరునుంది.
భారతీ ఎయిర్‌టెల్‌:- టాటా టెలీసర్వీసెస్‌ విలీనానికి షేర్‌హోల్డర్లు అనుమతినిచ్చారు.
ఆదిత్యా బిర్లా ఫ్యాషన్స్‌:- రూ.1,250 కోట్ల నిధుల సమీకరణకు షేర్‌హోల్డర్ల అనుమతి కోరింది.You may be interested

‘ఇండ్‌ భారత్‌’ దివాలా ప్రక్రియకు ఓకే

Thursday 30th August 2018

సాక్షి, హైదరాబాద్‌: ఇండ్‌ భారత్‌ ఇన్‌ఫ్రా పవర్‌ లిమిటెడ్‌ అనుబంధ కంపెనీ అయిన ఇండ్‌ భారత్‌ ఎనర్జీ (ఉత్కళ్‌) లిమిటెడ్‌ కార్పొరేట్‌ దివాలా పరిష్కార ప్రక్రియకు (సీఐఆర్‌పీ) హైదరాబాద్‌లోని జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) అనుమతినిచ్చింది. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా నుంచి తీసుకున్న రూ.167 కోట్ల రుణం తిరిగి చెల్లించడంలో విఫలమైనందుకు ఎన్‌సీఎల్‌టీ ఈ మేర నిర్ణయం తీసుకుంది. తాత్కాలిక దివాలా పరిష్కార నిపుణుడిగా (ఐఆర్‌పీ) ముంబాయికి చెందిన

చిక్కుల్లో ల్యాంకో బబం«ద్‌ పవర్‌...

Thursday 30th August 2018

సాక్షి, హైదరాబాద్‌: ల్యాంకో గ్రూపునకు చెందిన మరో కంపెనీ చిక్కుల్లో పడింది. ల్యాంకో బబం«ద్‌ పవర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ దిలావా ప్రక్రియను ప్రారంభించాలని కోరుతూ ఐసీఐసీఐ బ్యాంకు దాఖలు చేసిన పిటిషన్‌పై హైదరాబాద్‌లోని జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) సానుకూలంగా స్పందించింది. ఐసీఐసీఐ బ్యాంకు నుంచి తీసుకున్న రూ.1428 కోట్లను తిరిగి చెల్లించడంలో విఫలమైనందున ల్యాంకో బబం«ద్‌ కార్పొరేట్‌ దివాలా పరిష్కార ప్రక్రియకు (సీఐఆర్‌పీ) అనుమతినిచ్చింది. ఇందులో భాగంగా

Most from this category