STOCKS

News


సోమవారం వార్తల్లో షేర్లు

Monday 25th March 2019
Markets_main1553494117.png-24778

వివిధ వార్తలకు అనుగుణంగా సోమవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు
జెట్‌ ఎయిర్‌వేస్‌:-
ఆర్థిక సంక్షోభం కారణంగా అదనంగా మరో ఏడు విమాన సర్వీసులను రద్దు చేసింది. 
ఎస్సార్‌ స్టీల్‌:- కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా శైలేంద్ర అగర్వాల్‌ నియమితులయ్యారు
ఎస్‌బీఐ:- మార్కెట్‌ నుంచి రూ.20వేల కోట్ల నిధుల సమీకరణకు బోర్డు గడువు కాలాన్ని మార్చి 31 2020వ తేది వరకు పొడిగించింది. అలాగే రూ.1250 కోట్ల విలువైన బాండ్ల ఇష్యూకు రుణదాతలు ఆమోదం తెలిపింది.
టాటా స్టీల్‌ బీఎస్‌ఎల్‌:- తన మాతృ సం‍స్థ టాటాస్టీల్‌కు రూ.6700 కోట్ల విలువైన కన్వర్టబుల్‌ రీడమబుల్‌ ఫ్రిఫరెన్స్‌ ఈక్విటీ షేర్లను జారీ చేసేందుకు బోర్డు ఆమోదం తెలిపింది.
ఇంటర్నేషనల్‌ పేపర్‌:- రాజమండ్రిలో యూనిట్‌ను మెయిన్‌టెనెన్స్‌లో భాగంగా 5రోజుల పాటు (మార్చి 25 నుంచి మార్చి 30వరకు) మూసివేయన్నారు. ఈ కారణంగా ప్రతిరోజు 500 టన్నుల ఉత్పత్తి నిలిచిపోతుందని కంపెనీ అంచనా వేస్తుంది. 
టాటామోటర్స్‌:- వచ్చేనెల నుంచి ప్యాసింజర్‌ వాహనాలపై ధరలను రూ.25వేల వరకు పెంచనుంది. తయారీ ఖర్చు పెరగడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
అంబర్‌ ఎంటర్‌ప్రైజెస్‌:- సిద్వాల్ రిఫ్రిజరేషన్‌ ఇండస్ట్రీస్‌లో 80శాతం వ్యూహాత్మక వాటా కొనుగోలుకు బోర్డు ఆమోదం తెలిపింది.
టాటా కాఫీ: కొత్త ఎండీ, సీఈఓగా చకో పురక్కాల్‌ నియామితులయ్యారు. ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి కొత్త నియామకం అమల్లోకి రానుంది. 
డాక్టర్‌ రెడ్డీస్‌:- హైదరాబాద్‌లోని యూనిట్లో ఎలాంటి అభ్యంతరాలు లేవని యూఎస్‌ఎఫ్‌డీఏ ఫామ్‌ 483 జారీ చేసింది.  
భరత్‌ గేర్స్‌:- రైట్స్‌ ఇష్యూను జారీ చేసింది. ఇష్యూలో భాగంగా కంపెనీ 1:7 నిష్పత్తిలో షేర్లను జారీ చేయనుంది. ఇష్యూ ధరలో భాగంగా ప్రతి షేరు ధర రూ.105లుగా నిర్ణయించింది. 
ఓఎన్‌జీసీ:-  ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను ఒక్కో షేరుకు రూ.1 మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది.
సీసీఎల్‌ ప్రోడెక్ట్స్‌:- ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను ఒక్కో షేరుకు రూ.1.75 మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది.
మ్యాక్స్‌ ఇండియా:- కొత్త చైర్మన్‌గా అనల్జిత్‌ సింగ్‌ను ప్రకటించింది.
రామ్‌కో సిమెంట్స్‌:- రామ్‌కో ఇండస్ట్రీయల్‌ అండ్‌ టెక్నాలజీస్‌లో 45శాతం వాటాను కొనుగోలు చేసింది.
కర్ణాటక బ్యాంక్‌:- కర్ణాటక బ్యాంక్‌లో రూ.13.26 కోట్ల మోసం జరిగింది. ఈ వివరాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కి తెలియజేసినట్లు శనివారం బ్యాంక్ చెప్పింది.You may be interested

ఈ సీరిస్‌లో 11300 వరకు పతనం!

Monday 25th March 2019

నిఫ్టీ మార్చి సీరిస్‌లో 11300- 11350 పాయింట్ల వరకు పతనమవుతుందని సామ్‌కో సెక్యూరిటీస్‌ రిసెర్చ్‌ హెడ్‌ ఉమేశ్‌ మెహతా అంచనా వేశారు. నిఫ్టీ పరుగులకు విరామం వచ్చే సమయమిదన్నారు. ఇప్పటివరకు సూచీల్లో కనిపించిన ఉత్సాహం సన్నగిల్లిందన్నారు. అందువల్ల నిఫ్టీ ఈ సీరిస్‌ చివరకు 11300-11350 పాయింట్ల వరకు క్షీణించే అవకాశాలున్నాయన్నారు. ప్రధాన ఇండికేటర్లన్నీ ఓవర్‌బాట్‌ స్థితిని సూచిస్తున్నాయని, అందువల్ల గరిష్ఠాల నుంచి పుల్‌బ్యాక్‌ తప్పకపోవచ్చని చెప్పారు. బ్యాంకు నిఫ్టీ సైతం

11400 దిగువన ప్రారంభమైన నిఫ్టీ

Monday 25th March 2019

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలను అందిపుచ్చుకున్న దేశీయ మార్కెట్‌ సోమవారం నష్టంతో మొదలైంది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 150 పాయింట్ల నష్టంతో 38,016 వద్ద, నిఫ్టీ 62 పాయింట్ల క్షీణించి 11400 దిగువున 11,395.65 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. అమెరికా ఫెడ్‌రిజర్వ్‌ వడ్డీరేట్లపై పూర్తి మెతక వైఖని ప్రకటించడం, యూరోజోన్‌లో బ్రెగ్జిట్‌ అంశం మరింత తీవ్రతరం కావడం, ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగమన ఆందోళన తదితర అంశాలు ప్రపంచ ఈక్విటీ

Most from this category