STOCKS

News


సోమవారం వార్తల్లోని షేర్లు

Monday 4th February 2019
Markets_main1549251673.png-23992

వివిధ వార్తలకు అనుగుణంగా సోమవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు
టెక్‌ మహీంద్రా:- నెదర్లాండ్‌ కంపెనీ డైనోకామర్స్‌ను 4.39 మిలియన్‌ యూరోలకు కొనుగోలు చేసేందుకు బోర్డు ఆమోదం తెలిపింది.
రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌:- రుణాల పరిష్కారానికి సంబంధించిన గతంలో రూపొందించిన ప్రణాళిక తరహా ప్రతిపాదననే ఎన్‌సీఎల్‌టీ ముందు కూడా ప్రవేశపెడుతున్నట్లు వెల్లడించింది.
ఈద్‌ ప్యారీ:- ప్రైవేట్‌ ప్లేస్‌మెంట్‌ పద్దతిలో కంపెనీ రూ.250 కోట్ల విలువైన ఎన్‌సీడీలను జారీ చేసేందుకు బోర్డు ఆమోదం తెలిపింది.
న్యూజెన్‌ సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీస్‌:- డిజిటల్‌ ప్రొవైడింగ్‌ సెల్యూషన్‌ రంగంలో సేవలను మరింత విస్తృత స్థాయిలో అందించేందుకు కోడెక్‌ కంపెనీతో వ్యూహాత్మకంగా జట్టు కట్టింది.
శాంతి గేర్స్‌:- కంపెనీ సీఈవోగా నారాణాయమూర్తి స్థానంలో కరుణాకరన్‌ నియమితులయ్యారు.
సైయంట్‌:- రూ.200 కోట్ల బైబ్యాక్‌ ఇష్యూకు కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది. ఇష్యూలో భాగంగా కంపెనీ ప్రతి షేరు ధర రూ.700 చొప్పును మొత్తం 28.6లక్షల ఈక్విటీ షేర్లను ఇన్వెస్టర్ల నుంచి తిరిగి కొనుగోలు చేయనుంది.
నేషనల్‌ ఫెర్టిలైజర్స్‌:- ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రతిషేరుపై రూ.1.09ల మధ్యం‍తర డివిడెంట్‌ను ప్రకటించింది.
వివిధ వాహన కంపెనీలు శుక్రవారం జనవరి విక్రయ గణాంకాలను విడుదల చేశాయి. ఈ నేపథ్యంలో నేడు ఆయా కంపెనీలు షేర్ల హెచ్చుతగ్గులకు లోనయ్యే అవకాశం ఉంది.
నేడు క్యూ2 ఫలితాలను ప్రకటించే కొన్ని ప్రధాన కంపెనీలు:-
అబాన్‌ ఆఫ్‌సోర్స్‌, అజ్మీరా రియల్టీ, ఆదిత్యా బిర్లా ఫ్యాషన్‌ అండ్‌ రీటైల్‌, బల్లాపూర్‌ చినిఈ మిల్స్‌, బేయర్‌ కార్ప్‌సైన్స్‌, బాంబే బుర్హాన్‌ ట్రేడింగ్‌ కార్పోరేషన్‌, ఎక్సైడ్‌ ఇండస్ట్రీస్‌, ఫ్యూచర్‌ ఇండస్ట్రీస్‌, గార్డెన్‌ సిల్క్‌ మిల్స్‌, గ్లాస్కోస్మిత్‌లైన్‌ ఫార్మా, గోద్రేజ్‌ ఆగ్రోవెట్‌, గ్రావెన్స్‌ కాటన్‌, గ్రిడ్‌వెల్‌ నార్తన్‌, హానీవెల్‌ అటోమిషన్‌, ఐడీబీఐ బ్యాంక్‌, ఐఆర్‌బీ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ డెవెలప్‌మెంట్‌, కేఈఐ ఇండస్ట్రీస్‌, లక్ష్మీ మిషన వర్క్స్‌, లక్ష్మి విలాస్‌ బ్యాంక్‌, లుమెక్స్‌ ఇండస్ట్రీస్‌, ముంజల్‌ ఇండస్ట్రీస్‌, నవ్‌నీత్‌ ఎడ్యూకేషన్‌, నోవర్టీస్‌, రియలన్స్‌ నావెల్‌ అండ్‌ ఇంజనీరింగ్స్‌, రాయల్‌ ఆర్చిడ్‌ హోటల్స్‌, శ్రేయీ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ ఫైనాన్స్‌, ఎస్‌ఆర్‌ఎఫ్‌, స్టార్‌ సిమెంట్స్‌, సన్‌ఫార్మా అడ్వాన్స్‌ రీసెర్చ్‌ కంపెనీ, టాటా ఇన్వెస్ట్‌మెంట్‌ కార్పోరేషన్‌, టిటాఘర్‌ వేగాన్స్‌, వెల్‌స్పాన్‌, వర్ల్‌పూల్‌.You may be interested

నష్టాలతో ప్రారంభం

Monday 4th February 2019

రెండురోజుల వరుసగా ర్యాలీకి స్వస్తి పలుకుతూ సోమవారం దేశీయ మార్కెట్‌ నష్టాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్‌ గత ముగింపు(36,469)తో పోలిస్తే 13పాయింట్లను కోల్పోయి 36,456 వద్ద, నిఫ్టీ ఇండెక్స్‌ గతముగింపు(10,893)తో పోలిస్తే నిఫ్టీ 17పాయింట్ల నష్టంతో 10,876.75 వద్ద ప్రారంభమైంది. డాలర్‌ మారకంలో రూపాయి క్షీణత ట్రేడింగ్‌పై ప్రభావాన్ని చూపింది. అలాగే బడ్జెట్‌ సందర్భంగా గత ట్రేడింగ్‌లో భారీగా లాభపడిన అటో రంగషేర్లలో అమ్మకాలు ఎ‍క్కువగా ఉన్నాయి. బ్యాంకింగ్‌, మెటల్‌ షేర్లలో

స్వల్ప నష్టాల్లో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

Monday 4th February 2019

విదేశీ మార్కెట్లలో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ సోమవారం స్వల్ప నష్టాలతో ట్రేడ్‌ అవుతోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపు(10911.50)తో పోలిస్తే ఉదయం 8:30లకు 10 పాయిం‍ట్ల నష్టంతో 10,901 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ శుక్రవారం ముగింపు స్థాయి(10914)తో పోలిస్తే 14 పాయిం‍ట్ల క్షీణతతో ఉందని గమనించాలి. ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ స్వల్ప నష్టాల ట్రేడింగ్‌ కారణంగా నేడు నిఫ్టీ ఇండెక్స్‌ ఫ్లాట్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. లాభాల్లో ఆసియా

Most from this category