STOCKS

News


బుధవారం వార్తల్లో షేర్లు

Wednesday 5th September 2018
Markets_main1536120311.png-19954

ముంబై:- వివిధ వార్తలకు అనుగుణంగా బుధవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు
సీఈఎస్‌ లిమిటెడ్‌:- 1:27 నిష్పత్తిలో షేర్ల బోనస్‌ ఇష్యూకు బోర్డు ఆమోదం తెలిపింది. అందుకు రికార్డు తేదిని సెప్టెంబర్‌ 21గా నిర్ణయించింది.
గోల్డియం ఇంటర్నేషనల్‌:- ఇంటర్నేషనల్‌ క్లయింట్ల నుంచి రూ.140 కోట్ల విలువైన ఆర్డర్లను దక్కించుకుంది.
ఏబిబి ఇండియా:- సెప్టెంబర్‌ 4న కంపెనీ రూ.లక్ష ముఖ విలువ కలిగిన 600 అన్‌సెక్యూర్డ్‌ నాన్‌-కన్వర్టబుల్‌ డిబెంజర్లను జారీ చేసింది.
ఇమామి ఇన్ఫ్రాస్టక్చర్స్‌:- సెప్టెంబర్‌ 27న సంస్థ వార్షిక సాధారణ సమావేశాన్నినిర్వహిస్తునట్లు కంపెనీ ప్రకటించింది.
ఐల్‌&ఎఫ్‌ఎస్‌ ఇంజనీరింగ్స్‌:- రేటింగ్‌ సంస్థకేర్‌ ఐల్‌&ఎఫ్‌ఎస్‌ ఇంజనీరింగ్స్‌కు రేటింగ్‌ పెంచింది.
స్కాన్‌ పాయింట్‌ జియోటిక్స్‌:- ప్రభుత్వ కంపెనీ నార్త్‌ ఈస్ట్రన్‌ స్పేస్‌ అప్లికేషన్స్‌ సెంటర్‌(ఎన్‌ఈఎస్‌ఈఏ)కు సాఫ్ట్‌వేర్‌ సేవలందించేందుకు రూ.10.50 కోట్ల విలువైన కాంట్రాక్టును పొందింది.
ఎల్‌జీ బాలక్రిష్ణన్‌:- కంపెనీ ఫిక్సిడ్‌ డిపాజిట్స్‌ దృష్టిలో ఉంచుకుని కంపెనీ రేటింగ్‌ను ఎఎ(-) నుంచి ఎఎ(+)కు సవరించింది.
పిడిలైట్‌ ఇండస్ట్రీస్‌:- సంస్థ సెక్రటరీ, కాంప్లీయస్‌ ఆఫీసర్‌ పదవికి సావిత్రి పరేఖ్‌ రాజీనామా పత్రాన్ని సమర్పించింది.
టెక్స్‌మో పైప్స్‌:- హెచ్‌డీపీఈ పైపుల తయారీకి లార్సన్‌&టర్బో నుంచి రూ.81.30 కోట్ల ఆర్డరును దక్కించుకుంది.
జాగరణ్‌ ప్రకాషన్‌:- ఎంఎంఐ ఆన్‌లైన్‌కు చెందిన రూ.18లక్షల ఈక్విటీ షేర్లను కొనుగోలు చేసింది.
ముత్తూట్‌ ఫైనాన్స్‌:- ప్రైవేట్‌ ప్లేస్‌మెంట్‌ పద్దతిలో రీడమబుల్‌ నాన్‌-కన్వర్టబుల్‌ డిబెంచర్ల జారీ ద్వారా రూ.5వేల కోట్ల సమీకరణకు బోర్డు ఆమోదం తెలిపింది.
జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌:- మోనెట్ ఇస్పాట్‌లో 88శాతం వాటాను సొంతం చేసుకుంది.
జెట్‌ ఎయిర్‌వేస్‌:- కంపెనీ రుణ సమీకరణ విధానంపై రేటింగ్‌ను తగ్గించింది.
మెక్‌నల్లీ భారత్‌ ఇంజనీరింగ్స్‌:- ఎన్‌ఎల్‌సీ ఇండియా సంస్థ నుంచి రూ.108కోట్ల విలువైన ఆర్డర్‌ను దక్కించుకుంది.
డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌:- ఎసోమేప్రజోల్ మెగ్నీషియం ఔషధాలకు యూఎస్‌ఎఫ్‌డీ నుంచి అనుమతులు దక్కించుకుంది.  
నేడు క్యూ1 ఫలితాలు ప్రకటించే కంపెనీలు:- హడ్కో, శ్రేయి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్‌, వారోక్‌ ఇంజనీరింగ్స్‌You may be interested

నిఫ్టీ రెడ్‌.. సెన్సెక్స్‌ గ్రీన్‌..

Wednesday 5th September 2018

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ బుధవారం మిశ్రమంగా ప్రారంభమైంది. సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 38,157 పాయింట్లతో పోలిస్తే 35 పాయింట్ల లాభంతో 38,192 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఇక నిఫ్టీ తన మునపటి ముగింపు 11,520 పాయింట్లతో పోలిస్తే 6 పాయింట్ల నష్టంతో 11,514 పాయింట్ల వద్ద ప్రారంభమైంది.  అమెరికా స్టాక్‌ మార్కెట్లు మంగళవారం నష్టాల్లోనే ముగియడం, ఒక్క తైవాన్‌ ఇండెక్స్‌ మినహా ఆసియా ప్రధాన సూచీలన్నీ బుధవారం నష్టాల్లోనే ట్రేడవుతుండటం,

మార్కెట్‌ ఎటు?

Wednesday 5th September 2018

నిప్టీ మంగళవారం వరుసగా రెండో సెషన్‌లోనూ నష్టాలను కొనసాగించింది. ఇంట్రాడేలో ఒకానొక సమయంలో 11,500 మార్క్‌కు దిగువకు కూడా పడిపోయింది. క్రూడ్‌ ధరలు పెరగడం, రూపాయి 71.57 కనిష్టానికి పడిపోవడం ప్రతికూల ప్రభావం చూపాయి. ఇండెక్స్‌ డైలీ చార్ట్స్‌లో బేరిస్‌ క్యాండిల్‌ను ఏర్పరచింది.  ఐటీ మినహా మిగతా సెక్టోరల్‌ ఇండెక్స్‌లన్నీ నష్టపోయాయి. బ్యాంక్‌, ఆటో, ఎఫ్‌ఎంసీజీ, మెటల్‌, ఫార్మా ఇండెక్స్‌లు 2 శాతం వరకు క్షీణించాయి. అయితే కేవలం ఐటీ మాత్రం

Most from this category